Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

బాల్య దశలో అభివృద్ధి: ఎదుగుదలను గుర్తించి, ప్రోత్సహించడం

Default Avatar

Dr Ajay Sharma

Also available in: हिंदी English
Like Icon 0Likes

Key Takeaways:

  • పిల్లల జీవితంలోని మొదటి కొన్ని సంవత్సరాలు వారి శారీరక, మానసిక మరియు భావోద్వేగ అభివృద్ధికి పునాది వేస్తాయి.
  • పిల్లలు వయస్సుకు తగిన అభివృద్ధి దశలను చేరుకోవడంలో ఆలస్యం కనిపిస్తే, వెంటనే పిల్లల వైద్యుడిని (పిడియాట్రిషన్) సంప్రదించండి.
  • ముందస్తు సహాయం ఫలితాలను ఇస్తుంది – సరైన సమయంలో అందించే ప్రారంభ సహాయం పిల్లలు కొత్త నైపుణ్యాలను మెరుగ్గా నేర్చుకోవడంలో సహాయపడుతుంది మరియు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను నివారించవచ్చు.
  • ప్రేమతో, ఓర్పుతో పిల్లలకు మద్దతు ఇవ్వండి. వారు చేసే ప్రతి చిన్న ప్రయత్నాన్ని ప్రోత్సహించి, ప్రశంసించండి.
  • అద్భుతంగా నయం చేస్తామనే హామీలను నమ్మకండి. మీ వైద్యుడు మరియు థెరపిస్ట్ సూచనలను విశ్వసించండి.
  • కుటుంబ సభ్యులందరూ సంరక్షణ బాధ్యతలను పంచుకుంటూ, ప్రధాన సంరక్షకులకు అండగా నిలవాలి.

పిల్లల జీవితంలోని మొదటి కొన్ని సంవత్సరాలు శారీరక, మానసిక మరియు భావోద్వేగ అభివృద్ధికి పునాది వేస్తాయి. ఈ దశలో పిల్లలు సాధారణంగా నిర్దిష్టమైన అభివృద్ధి దశలను చేరుకుంటారు. ప్రేమతో కూడిన, ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనది.

కొన్నిసార్లు పిల్లల అభివృద్ధి సాధారణంగా ఆశించిన విధానానికి భిన్నంగా ఉండవచ్చు. ఇది అభివృద్ధి ఆలస్యాలకు సంకేతం కావచ్చు. ఈ ఆలస్యం ఒక్కో పిల్లల్లో ఒక్కో స్థాయిలో కనిపించవచ్చు. అందుకే ప్రారంభ సంకేతాలను గుర్తించి, వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన సమాచారం, సమయానికి చేసే మూల్యాంకనం(అసెస్మెంట్) మరియు అవసరమైన సహాయం పిల్లల అభివృద్ధిలో గణనీయమైన మార్పును తీసుకురాగలవు.

గుర్తుంచుకోండి: సరైన సమయంలో అందించే సహాయం మీ పిల్లల అభివృద్ధిలో ఎంతో మార్పును తీసుకురాగలదు.

నిపుణుల సూచనలు

అభివృద్ధిలో భిన్నత్వాలను గుర్తించడంలో సాధారణంగా తల్లిదండ్రులకు ఉండే సందేహాల గురించి నయీ దిశా రిసోర్స్ సెంటర్, కన్సల్టెంట్ న్యూరో-డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్ డా. అజయ్ శర్మతో మాట్లాడింది. తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలను నిశితంగా గమనిస్తే, చిన్న వయస్సులోనే సమగ్ర అభివృద్ధిలో ఆలస్యాన్ని (గ్లోబల్ డెవలప్‌మెంటల్ డిలే)  గుర్తించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. మీ పిల్లల ఎదుగుదలలో ఏదైనా అసాధారణంగా అనిపిస్తే, వెంటనే మీ పిల్లల వైద్యుడిని (పిడియాట్రిషన్) సంప్రదించి, సమగ్ర అభివృద్ధి మూల్యాంకనం చేయించండి.

1.     ప్రారంభ సహాయం అంటే ఏమిటి? ఇది ఎలా సహాయపడుతుంది?

పిల్లల అభివృద్ధి దశలలో ఆలస్యం ఉన్నట్లు గుర్తించిన వెంటనే వారికి అవసరమైన సహాయం అందించడాన్ని ప్రారంభ సహాయం అంటారు. సరైన సమయంలో ప్రారంభించే సహాయం వలన పిల్లలు కొత్త నైపుణ్యాలను మరింత సమర్థవంతంగా నేర్చుకుని వాటిని అభివృద్ధి చేసుకోగలరు. అలాగే, అభివృద్ధి ఆలస్యం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే కొన్ని సవాళ్లను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

2. పిల్లలతో కలసి పనిచేస్తున్నప్పుడు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి?

పిల్లల సామర్థ్యానికి మించి వారిపై ఒత్తిడి చేయవద్దు. అధిక ఒత్తిడి వల్ల వారు ఆందోళనకు గురికావచ్చు, నిరాశ చెందవచ్చు మరియు నేర్చుకోవాలనే ఆసక్తిని కోల్పోవచ్చు. ఇది వారి అభివృద్ధికి సహాయపడదు. 

పిల్లల పరిస్థితిని “నయం చేస్తాం” అని హామీలు ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల పట్ల జాగ్రత్తగా వహించండి. ఇటువంటి హామీలు నిజమైన సహాయం కంటే, తల్లిదండ్రుల ఆందోళనను ఉపయోగించుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుంది.

 3. పిల్లల రోజువారీ కార్యకలాపాల ద్వారా వారి అభివృద్ధికి ఎలా తోడ్పడవచ్చు?

థెరపిస్ట్ సూచనల ఆధారంగా తల్లిదండ్రులు పిల్లలకు ఒక క్రమబద్ధమైన రోజువారీ ప్రణాళికను రూపొందించాలి. ఇంట్లో చేసే చిన్న చిన్న పనుల్లో పిల్లలను భాగస్వామ్యం చేయడం, వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రోత్సహించి ప్రశంసించడం వల్ల వారు చురుకుగా పాల్గొనడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకుంటారు.

4. ప్రత్యామ్నాయ విధానాలు/చికిత్సలు ఎంతవరకు ఉపయోగపడతాయి?

ఆయుర్వేదం, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ విధానాలను పరిగణనలోకి తీసుకుంటే, అవి పిల్లలకు హాని కలిగించకుండా ఉండేలా చూసుకోవాలి. ప్రత్యామ్నాయ విధానాలను ఉపయోగిస్తున్నప్పటికీ, వైద్యులు మరియు థెరపిస్టుల సూచనలను కొనసాగించడం ముఖ్యం. పిల్లలలో కనిపించే మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ, వాటి గురించి మీ పిల్లల వైద్య బృందంతో తప్పకుండా చర్చించండి.

5. పిల్లలకు నిర్ధారణ జరిగినప్పుడు  కుటుంబం ఎలా ఎదుర్కోవాలి?

అభివృద్ధిలో భిన్నత్వాలు ఉన్న పిల్లలను పెంచడం అనేది కుటుంబ సభ్యులందరి సమిష్టి బాధ్యత. సంరక్షణ అనేది చాలా సందర్భాల్లో తల్లిపైనే ఉంటుంది. భాధ్యత మొత్తం ప్రధాన సంరక్షకులపైనే కాకుండా కుటుంబ సభ్యులు అందరు పంచుకోవాలి. రోజువారీ పనుల్లో సహాయం చేయడం నుంచి, పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగస్వామ్యం కావడం వరకు కుటుంబ సభ్యులందరూ ప్రధాన సంరక్షకులకి తోడ్పాటు అందించాలి. కుటుంబమంతా కలిసి మద్దతుగా నిలిస్తే, పిల్లల అభివృద్ధి మరియు స్వతంత్రత దిశగా వారి ప్రయాణం మరింత బలపడుతుంది.

పిల్లలందరికీ  అభివృద్ధి ఒక్కోలా ఉంటుంది. ఓర్పు, సరైన అవగాహన మరియు సమయానికి అవసరమైనసహాయం అందించడం ద్వారా, కుటుంబ సభ్యులు పిల్లలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా సహాయపడగలరు.

దయచేసి ఈ వీడియోను చూడండి మరియు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇది ముఖ్యమైన సమాచారాన్ని మరింత మందికి చేరి పిల్లల్లో అభివృద్ధి ఆలస్యాలు, వాటి ప్రారంభ సంకేతాలపై అవగాహనను పెంచుతుంది. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, వాటిని మాకు contactus@nayi-disha.org కు ఈ-మెయిల్ చేయండి. మా వంతు ప్రయత్నంతో మీ ప్రశ్నలకు సమాధానాలు అందించడానికి మేము కృషి చేస్తాము.

ప్రారంభ దశలోనే సహాయం ఎందుకు అవసరమో, మీ పిల్లల అవసరాలను తల్లిదండ్రులుగా ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని తెలిపే విలువైన వీడియోను చూడండి.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సరైన మార్గదర్శకత్వం కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.


Write Blog

Share your experiences with others like you!

English