Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

ప్రారంభ సహాయం: కుటుంబాలకు మార్గదర్శకత్వం, మద్దతు, భరోసా

LRF-LOGO-Transparent-1

Latika Roy Memorial Foundation

Also available in: हिंदी English
Like Icon 0Likes

Key Takeaways:

  • పిల్లల అభివృద్ధిలో భిన్నత్వాలు గుర్తించిన వెంటనే థెరపీలను ప్రారంభిస్తే, దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
  •  ప్రారంభ సహాయం అందించే  ప్రక్రియలో కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమైన భాగస్వాములే. తల్లిదండ్రులు మరియు థెరపిస్టులు కలిసి పనిచేసినప్పుడు, పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలతో మరింత మెరుగ్గా కలసిపోవవడానికి అవకాశం ఉంటుంది.
  • అంగన్‌వాడీ కార్యకర్తలు కూడా కీలక పాత్ర పోషిస్తారు. పిల్లల ఎదుగుదలను క్రమం తప్పకుండా గమనించడం, గ్రోత్ చార్టులను ఉపయోగించడం ద్వారా అభివృద్ధి దశలలో ఆలస్యాలను ప్రారంభ దశలోనే గుర్తించగలరు.
  •  MRI, CTస్కాన్ వంటి పరీక్షలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉపయోగపడవచ్చు. అయితే, థెరపీ ప్రణాళిక రూపొందించడానికి ప్రామాణిక అభివృద్ధి మూల్యాంకనాలు (అస్సెస్మెంట్స్) మరింత ఉపయోగకరంగా ఉంటాయి.
  • పిల్లల అభివృద్ధి మరియు అవసరాలను బట్టి, తల్లిదండ్రులు తగిన సహాయంతో  సాధారణ పాఠశాల లేదా ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా సేవలు అందించే ప్రత్యేక పాఠశాలలను ఎంచుకోవచ్చు.

ఈ విషయ వివరణ నయీ దిశా మరియు లతికా రాయ్ ఫౌండేషన్ సంయుక్తంగా రూపొందించిన వీడియో ఆధారంగా రూపొందించబడింది. ఇందులో లతికా రాయ్ ఫౌండేషన్‌లో పునరావాస సేవల డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్తి నాయర్, ప్రారంభ దశలో నిర్ధారణ మరియు ప్రారంభ సహాయం పిల్లల దీర్ఘకాలిక అభివృద్ధిపై చూపే ప్రభావం గురించి వివరించారు.

  • ప్రారంభ సహాయం అంటే ఏమిటి?

ప్రారంభ సహాయం అనేది చిన్న వయస్సులోనే పిల్లల అభివృద్ధికి తోడ్పడేందుకు అందించే ప్రత్యేకమైన థెరపీలు మరియు మద్దతు సేవల సముదాయం. కొన్ని అభివృద్ధి ఆలస్యాలను పూర్తిగా సరిచేయడం సాధ్యం కాకపోయినా, ప్రారంభ దశలో సరైన సహాయం అందించడం ద్వారా పిల్లలు ఇంట్లో, పాఠశాలలో మరియు రోజువారీ జీవితంలో అవసరమైన నైపుణ్యాలను మెరుగ్గా అభివృద్ధి చేసుకొని, ఎదురయ్యే సవాళ్లను తగ్గించుకోగలుగుతారు. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు కూడా ముఖ్యమైన భాగస్వాములే. థెరపిస్టులతో కలిసి నిరంతర సహకారంతో పనిచేయడం ద్వారా పిల్లల అభివృద్ధిలో పురోగతికి తోడ్పడగలరు.

  •   ప్రారంభ సహాయం ఎందుకు ముఖ్యమైనది?

పిల్లల అభివృద్ధిలో ఏవైనా ఆందోళన కలిగించే సంకేతాలు కనిపించిన వెంటనే ప్రారంభ సహాయం అందించడం మొదలవుతుంది. సరైన సమయంలో ప్రారంభించే సహాయం వల్ల మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు, పిల్లల దీర్ఘకాలిక అభివృద్ధిపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది. 

అభివృద్ధిలో ఏర్పడిన కొన్ని ఆలస్యాలను పూర్తిగా సరిచేయలేకపోయినా, ప్రారంభ దశలో అందించే సహాయం వల్ల పిల్లలు ఇంట్లో, పాఠశాలలో మెరుగ్గా రాణించగలరని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. తల్లిదండ్రులుగా మీరు కూడా ఈ సహాయక బృందంలో కీలక భాగం. థెరపిస్టులతో కలిసి పనిచేస్తూ, మీ పిల్లల ఎదుగుదలకు తోడ్పడవచ్చు.  

ప్రారంభ సహాయం అందించే బృందంలో మాట (స్పీచ్), సంభాషణ (కమ్యూనికేషన్), మోటార్ నైపుణ్యాలు వంటి రంగాల్లోని నిపుణులు ఉంటారు. వీరు పిల్లలు తమ చుట్టూ ఉన్న పరిసరాలతో అర్థవంతంగా కలవడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడతారు. ప్రారంభ సహాయం విజయవంతం కావడానికి ప్రధాన కారణం నిపుణులు మరియు కుటుంబ సభ్యుల మధ్య ఉండే సమన్వయ సహకారంతో కూడి ఉంటుంది. ప్రతి చిన్న ప్రయత్నం పిల్లల అభివృద్ధిలో దీర్ఘకాలిక మార్పుకు దోహదపడుతుంది.

ప్రారంభ సహాయం మరియు సంరక్షకులకు అవసరమైన మద్దతుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకోవచ్చు.

  •  ప్రారంభ సహాయం అవసరమని తల్లిదండ్రులు ఎలా గుర్తించగలరు?

పలు సందర్భాల్లో, పిల్లల అభివృద్ధిలో వయస్సుకు అనుగుణంగా చేరుకోవాల్సిన మైలురాళ్లు ఆలస్యం కావడం లేదా ఇతర అభివృద్ధి ఆలస్యాలను ముందుగా తల్లులు లేదా ప్రధాన సంరక్షకులే గమనిస్తారు. అలాంటి సందర్భాల్లో పిల్లల వైద్యుడు (పిడియాట్రిషన్) లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. సమయానికి చేసే అభివృద్ధి మూల్యాంకనం (అసెస్మెంట్) ద్వారా పిల్లల అభివృద్ధిలో ఏయే అంశాల్లో సహాయం అవసరమో గుర్తించవచ్చు. అలాగే, పిల్లల అభివృద్ధికి ఎలా తోడ్పడాలో తల్లిదండ్రులకు స్పష్టమైన మార్గదర్శకత్వం లభిస్తుంది. నిపుణుల సహాయం కోరడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. అది పిల్లల అవసరాలను అర్థం చేసుకుని సరైన దిశలో ముందుకు సాగేందుకు స్పష్టత లభిస్తుంది.

  • అదనపు మద్దతు అవసరమైన పిల్లలను గుర్తించడంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఎలా సహాయపడగలరు?

 పుట్టిన కొద్దికాలానికే పిల్లల పేర్లు స్థానిక అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదు చేయబడతాయి.  ప్రారంభ సంవత్సరాల్లో పిల్లలు క్రమం తప్పకుండా అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శిస్తారు. ఈ సమయంలో పిల్లల ఎదుగుదలను నిరంతరం గమనించే అవకాశం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉంటుంది. అందువల్ల, పిల్లలు వయస్సుకు అనుగుణంగా చేరుకోవాల్సిన అభివృద్ధి మైలురాళ్లలో ఏవైనా ఆలస్యాలు ఉన్నాయో వారు గుర్తించగలరు. ఎదుగుదల పట్టికలు (గ్రోత్ చార్టులు), టీకాల రికార్డులు మరియు పిల్లల అభివృద్ధిని క్రమం తప్పకుండా పరిశీలించడం ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలు మైలురాళ్లలో ఆలస్యాలను గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేయగలుగుతారు. దీనివల్ల తల్లిదండ్రులు తమ పిల్లల అభివృద్ధి దశల గురించి సరైన అవగాహన పొందడంతో పాటు, అవసరమైన సమయంలో తగిన సహాయం పొందేందుకు చర్యలు తీసుకోవచ్చు.

MRI మరియు CT స్కాన్‌లు తప్పనిసరిగా చేయించాలా?

అభివృద్ధిలో భిన్నత్వాలు ఉన్న కొంతమంది పిల్లలకు వైద్యులు MRI, CT స్కాన్ వంటి పరీక్షలను సూచించవచ్చు. అయితే, ఈ పరీక్షలు సాధారణంగా మెదడు గాయం లేదా ప్రమాదాల వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మెదడులో ఏ భాగాలు ప్రభావితమయ్యాయో తెలుసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. కానీ, పిల్లల సమగ్ర అభివృద్ధిని అంచనా వేయడంలో లేదా వారికి అవసరమైన థెరపీ లక్ష్యాలను నిర్ణయించడంలో ఇవి ఇవి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు.

దీనికి బదులు, థెరపిస్ట్‌లు ప్రామాణిత అభివృద్ధి అంచనాలపై ఆధారపడతారు. వీటి ద్వారా మోటార్ ప్లానింగ్, మాట, కమ్యూనికేషన్ మరియు ఇతర అభివృద్ధి రంగాలలో నైపుణ్యాలనుఅంచనా వేయడానికి ప్రామాణిక అంచనా పద్ధతులను ఉపయోగిస్తారు.

  •  ప్రారంభ సహాయం తర్వాత ఏమి చేయాలి?

థెరపీ ప్రారంభమైన తర్వాత, స్పీచ్ థెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు మరియు ఇతర నిపుణులు కలిసి పిల్లల అభివృద్ధిలోని వివిధ అంశాలపై పని చేస్తారు.  కాలక్రమేణా, తల్లిదండ్రులు అదనపు మద్దతుతో సాధారణ పాఠశాలలో చదివించాలా లేదా ప్రత్యేక పాఠశాలలో చదివించాలా అనే నిర్ణయం తీసుకుంటారు. పిల్లల అభివృద్ధి మరియు ఎదుగుదల ఆధారంగా, కుటుంబాలు వివిధ విద్యా ఎంపికలను ఎంచుకుంటారు. కొంతమంది పిల్లలు ప్రధాన పాఠశాలలో అదనపు మద్దతుతో బాగా నిర్వహిస్తారు, మరికొంతమంది ప్రత్యేక పాఠశాలలో అందుబాటులో ఉన్న ప్రత్యేక వనరులు మరియు మార్గదర్శకత ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతారు. అందువల్ల, పిల్లల అభ్యాసం మరియు సమగ్ర శ్రేయస్సుకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని ఎంపిక చేయడం ప్రధాన లక్ష్యం.

తల్లిదండ్రులకు ఒక సందేశం

శ్రీమతి ఆర్తి నాయర్ మాట్లాడుతూ, ఈ ప్రయాణంలో తల్లులు ఒంటరిగా బాధ్యత మోయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. నిపుణుల మార్గదర్శకత్వం, కుటుంబ సభ్యుల సహకారం మరియు సమాజంలో అందుబాటులో ఉన్న వనరులు ఈ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయగలవు.

మన దేశంలో చాలా కుటుంబాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉంటాయి. కుటుంబ సభ్యులు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఎలా సహాయం చేయాలో వారికి తెలియకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో, మీ పిల్లల నిర్ధారణ, వారి అవసరాల గురించి కుటుంబ సభ్యులతో పంచుకోవడం, వారి సహకారాన్ని కోరడం వల్ల ఈ ప్రయాణం మీకు మరింత సులభంగా మారుతుంది.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సరైన మార్గదర్శకత్వం కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

Write Blog

Share your experiences with others like you!

English