Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

ప్రత్యేక అవసరాలున్న పిల్లల్లో సామాజిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి సూచనలు

DrNinaVaidya

Dr.Nina Piyush Vaidya

Also available in: हिंदी English

Key Takeaways:

  1.       మీ పిల్లలతో అనుబంధం ఉన్న వ్యక్తులను గుర్తించండి: మీ పిల్లల జీవితంలో భాగమైన వారి జాబితాను తయారు చేయండి.
  2.       సామాజిక వర్గాలను విభజించండి: వారిని వివిధ సామాజిక వర్గాలుగా విభజించండి.
  3.       పరస్పర చర్యలను ప్రోత్సహించండి: ప్రతి సామాజిక వర్గం (సోషల్ సర్కిల్) లోని వ్యక్తులతో మీ పిల్లలు కలిసిమెలిసి ఉండేలా ప్రోత్సహించే మార్గాలను అనుసరించండి.
  4.       దశలవారీగా అభివృద్ధి చేయండి:  ఒక వర్గంలో పరస్పర చర్య, తదుపరి వర్గంలో సంబంధాలను బలపరుస్తుంది.
  5.       వివరణాత్మక మార్గదర్శకత్వం: ప్రతి సామాజిక వర్గంలో మీ పిల్లల సామాజిక భాగస్వామ్యాన్ని సమర్థవంతంగా పెంపొందించడానికి అవసరమైన దశలు మరియు సూచనలు ఈ ప్రజెంటేషన్‌లో అందించబడ్డాయి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [563.83 KB]

పిల్లల ఎదుగుదల మరియు అభివృద్ధిలో సామాజిక భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. ప్రత్యేక అవసరాలున్న. పిల్లల్లో సామాజిక పరస్పర చర్యలను మెరుగుపరచడానికి ఉపయోగపడే కొన్ని సూచనలను పై ప్రజెంటేషన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్రజెంటేషన్‌లో మీ పిల్లల కోసం ఒక సామాజిక వర్గాన్ని (సోషల్ సర్కిల్) రూపొందించడం గురించి వివరించబడింది.

ప్రత్యేక అవసరాలున్న పిల్లల్లో సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు:

  1. మీ పిల్లల జీవితంలో భాగమైన వ్యక్తులందరినీ గుర్తించండి.
  2. ఆ వ్యక్తులను వారి సంబంధాల ఆధారంగా వేర్వేరు సామాజిక వర్గాలుగా విభజించండి.
  3. ప్రతి సామాజిక వర్గంలోని వ్యక్తులతో మీ పిల్లలు పరస్పర చర్యలు పెంచుకునేలా ప్రోత్సహించే మార్గాలను అర్థం చేసుకుని అమలు చేయండి.

ప్రతి సామాజిక వర్గంలో పిల్లలు ఏర్పరచుకునే పరస్పర చర్యలు, క్రమంగా తదుపరి సామాజిక వర్గంలో కూడా వారి అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

అదనంగా, నయీ దిశా మరియు డా. అజయ్ శర్మ రూపొందించిన మీ పిల్లల సామాజిక భావోద్వేగ అభివృద్ధిని పెంపొందించడం అనే విషయ వివరణ కూడా చదవండి. అలాగే, పిల్లలకు వ్యక్తిగత పరిమితులు మరియు భద్రత పై రూపొందించిన దృశ్య మార్గదర్శిని (గ్రాఫిక్ టూల్) ను కూడా తప్పకుండా చూడండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సరైన మార్గదర్శకత్వం కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English