Skip to main content
Install App
If you're using:

పిల్లలలో ప్రవర్తన సవాళ్లు- సంక్షిప్త  అవగాహన

Default Avatar

Dr.Gouri Reddy

Also available in: English
Like Icon 0Likes

Key Takeaways:

  1.   ప్రవర్తన అనేది చుట్టూ ఉన్న పరిస్థితులకు స్పందనగా  వ్యక్తి చేసే చర్య లేదా చర్యల సమూహం.
  2.   పిల్లల ప్రవర్తనకు పరిసరాలు, సామాజిక పరిస్థితులు, ఒత్తిడి లేదా ఎదుటివారి ప్రవర్తనకు స్పందన వంటి వివిధ కారణాలు ఉండవచ్చు. 
  3.   ఒక ప్రవర్తనను అర్థం చేసుకోవాలంటే, దానిని కేవలం ఆలోచనగా కాకుండా వారు చేసే చర్య లేదా చూపించే స్పందనగా గుర్తించడం ముఖ్యం. 
  4.   ఆందోళన కలిగించే ప్రవర్తనను స్పష్టంగా అంచనా వేయాలంటే, దానికి సంబంధించిన “ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా” అనే అంశాలను గుర్తించాలి.
  5.   ఒక నిర్దిష్ట పరిస్థితిలో, పిల్లల సంభాషణ, సామాజిక నైపుణ్యాలు మరియు భావోద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచే మార్గాలను ఉపయోగించడం సహాయపడుతుంది.  
  6.   క్రమబద్ధమైన దినచర్య, దృశ్య సహాయకాలు మరియు సోషల్ స్టోరీస్ వంటి పద్ధతులు పిల్లలలో ఆందోళన కలిగించే ప్రవర్తనలను అధిగమించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

ఈ విషయ వివరణ పిల్లలలో ప్రవర్తన సవాళ్లను అర్థం చేసుకోవడం అనే వీడియో ఆధారంగా రూపొందించబడింది . ఈ వీడియో, నయీ దిశా నిర్వహించిన ప్రవర్తన నిర్వహణ వర్క్‌షాప్‌లో భాగంగా, చైల్డ్ సైకాలజిస్ట్ డా. గౌరి రెడ్డి గారి మార్గదర్శకత్వంలో రూపొందించబడింది.

 ప్రవర్తన అంటే ఏమిటి?

  • ప్రవర్తన అనేది పరిసరాలలో జరిగే సంఘటనలు లేదా పరిస్థితులకు ప్రతిస్పందనగా కనిపించే చర్య.
  • కొన్ని ప్రవర్తనలు తాత్కాలికంగా ఉండి, పిల్లలు ఎదుగుతున్న కొద్దీ సహజంగానే తగ్గిపోవచ్చు. అయితే, పిల్లల అభివృద్ధి, అభ్యాసం లేదా సామాజిక జీవితాన్ని ప్రభావితం చేసే ప్రవర్తనలు కొనసాగితే, వాటిని గమనించడం మరియు అర్థం చేసుకోవడం అవసరం.
  • ఆటిజం ఉన్న పిల్లలలో ఇటువంటి ప్రవర్తనా సవాళ్లు కనిపించవచ్చు.పిల్లలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో, దాని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
  • తమ అవసరాలను తెలియజేయడంలో ఇబ్బంది, క్రమబద్ధమైన దినచర్య లేకపోవడం, పరిస్థితి ఎలా ఉంటుందో తెలియకపోవడం , ఒక పని నుంచి మరో పనికి మారడంలో ఇబ్బంది , అలాగే ఇంద్రియ (సెన్సరీ) సున్నితత్వం ఉండటం వల్ల కొన్ని ప్రవర్తనా సవాళ్లు కనిపించవచ్చు.

ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి 5 W లు మరియు H

  • ఒక ప్రవర్తనను కేవలం ఆలోచనగా కాకుండా, పిల్లలు చేసే చర్యగా గుర్తించడం చాలా ముఖ్యం.
  • పిల్లలు చూపే ప్రవర్తనను చిన్న చిన్న చర్యలుగా విభజించి పరిశీలించడం ద్వారా, దాని వెనుక ఉన్న కారణాలను గుర్తించడం మరియు సరైన పరిష్కారాలను కనుగొనడం సులభమవుతుంది.
  • ఉదాహరణకు, “పిల్లలు దూకుడుగా ఉంటున్నారు” అని మాత్రమే చెప్పడం ద్వారా, వారు నిజంగా ఏమి చేస్తున్నారో లేదా ఆ ప్రవర్తనకు కారణమైన అంశాలు ఏమిటో అర్థం చేసుకోవడం కష్టం.
  • పిల్లలు ఎందుకు దూకుడుగా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకుంటే, ఆ ప్రవర్తనలో ఏమి, ఎలా మార్పు చేయాలో తెలుసుకోవచ్చు.
  • “పిల్లలు దూకుడుగా ఉంటున్నారు” అంటే: ఇతరులను కొట్టడం, కొరకడం, తోయడం, తమను తాము కొట్టుకోవడం, వస్తువులను విసరడం లేదా పగులగొట్టడం, పారిపోవడం గమ్యం లేకుండా తిరగడం, గట్టిగా అరవడం వంటివి ఉంటాయి.
  • ప్రవర్తనకు సంబంధించిన వివరాలను క్రమబద్ధంగా గమనించి నమోదు చేయడం ద్వారా, ఆ ప్రవర్తనను మెరుగ్గా అర్థం చేసుకుని, పిల్లలకు సహాయపడే సరైన విధానాలను రూపొందించవచ్చు. ఇది తల్లిదండ్రులు మరియు పిల్లలు ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుంది.
  • పిల్లలలో గమనించిన ప్రవర్తనకు సంబంధించిన 5 W లు మరియు Hల ను గుర్తించడం చాలా ముఖ్యం. ఇవి ఈ కింది విధాలలో సహాయపడుతుంది
    • ప్రవర్తనకు కారణమయ్యే కారకాలు లేదా ఒత్తిడి కలిగించే అంశాలను గుర్తించవచ్చు. 
    • ఆ ప్రవర్తన ఎంత తరచుగా లేదా ఎంతవరకు జరుగుతుందో అంచనా వేయవచ్చు 
    • పిల్లలకు సరైన సహాయ మార్గాలను గుర్తించవచ్చు.

తల్లిదండ్రులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో, డా. రెడ్డి ఒక ఉదాహరణ పరిస్థితిని తీసుకుని, ఆ ప్రవర్తనకు సంబంధించిన “ఏమిటి (W-వాట్), ఎప్పుడు (W-వెన్), ఎక్కడ (W-వేర్), ఎందుకు (W-వై), ఎవరితో (W- హూమ్), ఎలా (H -హౌ)” అనే అంశాలను ఎలా గుర్తించాలో వివరించారు. ఈ ఉదాహరణలో, పిల్లలు తన స్నేహితులను కొట్టడం (ఏమిటి) అనే ప్రవర్తనను చూపుతున్నారు. ఇది (ఎక్కడ) పాఠశాలలో, (ఎప్పుడు) మధ్యాహ్న భోజన విరామ సమయంలో, (ఎవరితో) తన స్నేహితులతో ఉన్నప్పుడు జరుగుతోంది. అలాగే, ఆ ప్రవర్తన ఎంత తీవ్రంగా (ఎలా) జరుగుతోంది అనే విషయాన్ని కూడా గమనించి నమోదు చేయాలి.

ఒక ప్రవర్తనకు కారణమయ్యే అంశాలను గుర్తించడం ద్వారా, ఆ ప్రవర్తన ఎంత మేరకు ఉందో అంచనా వేయవచ్చు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆ ప్రవర్తన వెనుక ఉన్న కారణాలను తెలుసుకుని, వాటిని సరిదిద్దేందుకు పిల్లలకు అవసరమైన సహాయం అందించవచ్చు అని ఆమె వివరించారు.

పిల్లల ప్రవర్తనను మెరుగుపరచేందుకు ఉపయోగించే వివిధ పద్ధతుల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ వర్క్‌షాప్ వీడియోలను అనేక భాగాలుగా విభజించారు. మీరు క్రింది అంశాలపై ఉన్న వీడియోలను కూడా చూడవచ్చు. ఇంటి బయట పిల్లల ప్రవర్తనను ఎలా నిర్వహించాలి?, A (ఆంటీసెడెంట్)B (బిహేవియర్)C (కాంసీక్వెన్సు) చార్ట్, సానుకూల మరియు ప్రతికూల ప్రోత్సాహం, పిల్లల ప్రవర్తనకు ఎలా స్పందించాలి?, తల్లిదండ్రుల ప్రశ్నలు మరియు సమాధానాలు. ఈ వీడియోలు చైల్డ్ సైకాలజిస్ట్ డా. గౌరి రెడ్డి గారితో కలిసి నయీ దిశా నిర్వహించిన ప్రవర్తన నిర్వహణ వర్క్‌షాప్‌లో భాగంగా రూపొందించబడ్డాయి.    

ఈ ప్రవర్తనా నిర్వహణ గురించిన ABC చార్ట్ నమూనాను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకుని, మీ పిల్లల ప్రవర్తనను వివిధ పరిస్థితుల్లో గమనించి నమోదు చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది ప్రవర్తన వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సరైన మార్గదర్శకత్వం కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English