Skip to main content
Install App
If you're using:

ఆటిజం మరియు సంబంధిత ఆందోళనలు – డా. అజయ్ శర్మతో సంభాషణ

Default Avatar

Dr Ajay Sharma

Also available in: हिंदी English
Like Icon 0Likes

Key Takeaways:

  1. పిల్లల ఎదుగుదలలో కనిపించే సమగ్ర అభివృద్ధి ఆలస్యాలను ముందుగానే  గుర్తించడం చాలా ముఖ్యం.
  2. ఆటిజంను నిర్ధారణ మరియు అంచనా కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం 
  3. థెరపీలు ఆటిజం ఉన్న పిల్లల అభివృద్ధికి సహాయపడతాయి. 
  4. ఆటిజంలా కనిపించే ఇతర పరిస్థితుల నుంచి ఆటిజంను వేరు చేసి గుర్తించడం ముఖ్యం. 
  5. ఆటిజం తల్లిదండ్రుల నుంచే నేరుగా వారసత్వంగా రాదు. దీనికి కారణాలు మరింత క్లిష్టంగా ఉంటాయి.

ఆటిజం లేదా ASD అనేది ఒక అభివృద్ధి సంబంధిత పరిస్థితి. ఇది పిల్లల్లో సామాజిక ప్రవర్తన మరియు ప్రవర్తనా విధానాల్లో తేడాలుగా ఒక సంవత్సరం వయస్సు నుంచే కనిపించవచ్చు. అయితే, ఆటిజం ఉందా లేదా అనే విషయంలో జాగ్రత్తగా అంచనా చేయకపోతే, కొన్ని ప్రవర్తనా లక్షణాలు పొరపాటుగా  ఆటిజం సంకేతాలుగా భావించే  అవకాశం ఉంది. అందుకే, మీ పిల్లల ప్రారంభ అభివృద్ధి మైలురాళ్లను గమనించి నమోదు చేయడంలో సరైన సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

గుర్తుంచుకోండి: త్వరగా సహాయం అందించడం ద్వారా మీ పిల్లల అభివృద్ధిలో మంచి మార్పు తీసుకురావచ్చు.

పిల్లల అభివృద్ధి సమయంలో కనిపించే సంకేతాలను గుర్తించడం మరియు అర్థం చేసుకోవడం గురించిన సాధారణ సందేహాలపై  నయీ దిశా రిసోర్స్ సెంటర్, న్యూరో-డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్, కన్సల్టెంట్ డా. అజయ్ శర్మతో మాట్లాడింది. పిల్లల అభివృద్ధిని జాగ్రత్తగా గమనిస్తే, జీవితంలోని ప్రారంభ సంవత్సరాల్లోనే సమగ్ర అభివృద్ధి ఆలస్యాలను గుర్తించవచ్చు. మీ పిల్లల ఎదుగుదల గురించి ఏవైనా ఆందోళన కలిగించే సంకేతాలను గమనిస్తే, వెంటనే మీ పిడియాట్రిషియన్‌ను కలసి మీ పిల్లలకు సమగ్ర అభివృద్ధి అంచనా  చేయాలని కోరండి.

దయచేసి పైన అందుబాటులో ఉంచిన వీడియోను చూడండి మరియు దీన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలా చేయడం వల్ల చిన్న వయస్సులో కనిపించే అభివృద్ధి ఆలస్యాలు మరియు వాటి సంకేతాలపై అవసరమైన, ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరి అవగాహన పెరుగుతుంది.

వీడియోలో చర్చించిన ముఖ్యాంశాలు:

  • ఆటిజం నిర్ధారణ మరియు దాని అంచనా 
  • థెరపీల ద్వారా తగిన సహాయాన్ని అందించడం
  • ఆటిజాన్ని పోలి కనిపించే ఇతర పరిస్థితుల నుండి ఆటిజాన్ని వేరు చేసి గుర్తించడం 
  • ఆటిజం తండ్రి లేదా తల్లి నుంచి జన్యుపరంగా వస్తుందా?
  • ఆటిజం ఉన్న పిల్లల్లో దూకుడు మరియు ప్రవర్తనా పరమైన ఇబ్బందులను ఎదుర్కోవడం

ఈ వీడియో హిందీలో కూడా అందుబాటులో ఉంది. పిల్లల సామాజిక సంబాషణ ప్రతిస్పందనలు గమనిస్తూ ఆటిజానికి సంబంధించిన సాధారణ సంకేతాలను ఎలా గుర్తించవచ్చో  డా. అజయ్ వివరించిన వీడియోను కూడా  చూడవచ్చు.

ఆటిజం ఉన్న పిల్లల ప్రవర్తనను ఎలా అర్థం చేసుకోవాలి, వారికి ఎలా సహాయం చేయాలో మరింత తెలుసుకోవడానికి  డా. అజయ్ వెబ్-పేజీని సందర్శించమని మేము కోరుతున్నాము.

గమనిక: దయచేసి గమనించండి, ఈ మార్గదర్శకం సమాచారం ఇవ్వడానికి మాత్రమే. సరైన మార్గదర్శకత కోసం అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ.డి.హెచ్.డి. లేదా ఇతర మేధో అభివృద్ధి సంబంధిత సవాళ్ల గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

Write Blog

Share your experiences with others like you!

English