Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

రోజువారీ పనులను ఎంచుకునే కార్డులు

Default Avatar

Nayi Disha Team

Also available in: हिंदी English

Key Takeaways:

  • రోజువారీ పనులను ఎంచుకునే కార్డులు: పిల్లలు ఆ రోజు చేయాలనుకునే పనులు లేదా ఎంచుకోవడానికి సహాయపడతాయి.
  • తమకు నచ్చిన పనిని ఎంచుకోవడం: పిల్లలు తమకు నచ్చిన పనిని చెప్పడానికి, ఎంచుకోవడానికి అవకాశం ఉన్నందున, వారు తమంతట తాముగా నిర్ణయం తీసుకోవడం నేర్చుకుంటారు.
  • తల్లిదండ్రులు పిల్లలకు వివరించడం: ఆ రోజు చేయాల్సిన పనులను పిల్లలకు ముందుగానే సులభంగా తెలియజేయడానికి తల్లిదండ్రులకు సహాయపడతాయి.
  •   పిల్లలపై ఒత్తిడి తగ్గించడం: పిల్లలకు ఇష్టం లేని పనులను బలవంతంగా చేయించకుండా ఉండటానికి సహాయపడుతుంది. దీనివల్ల పిల్లలు ఎక్కువగా అసహనానికి గురికావడం లేదా కోపంగా మారడం తగ్గుతుంది.
  • వెసులుబాటు: పిల్లలు తమకు నచ్చిన పనులను ఎంచుకుని చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పిల్లలు సౌకర్యంగా రోజువారీ పనుల్లో మరింత ఆసక్తిగా పాల్గొనగలుగుతారు.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [0.95 MB]

మాట్లాడటంలో ఇబ్బంది ఉన్న పిల్లలకు తమకు కావలసింది చెప్పడం కూడా కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. చిత్రాల ద్వారా చెప్పే విధానం పిల్లలు ఆందోళన పడకుండా తమ అవసరాలను సులభంగా చెప్పడానికి సహాయపడుతుంది. ఇందులో ప్రాథమిక అవసరాలు, అత్యవసర అవసరాలను చిత్రాల ద్వారా తెలియజేయడం, రోజువారీ పనులను చేయవలసిన దశలను అర్థం చేసుకోవడం, అలాగే తమ భావాలను ఇతరులకు తెలియజేయడం వంటివి ఉంటాయి.

మాట్లాడలేని పిల్లలు తమకు కావలసినది చెప్పడానికి ఉపయోగించే చిత్రాల ద్వారా పనుల క్రమాన్ని తెలిపే కొన్ని ఉదాహరణలు పైన అందుబాటులో ఉన్నాయి.

  • రోజువారీ పనులు
  1. రోజువారీ పనులను ఎంచుకునే కార్డులు తల్లిదండ్రులు మరియు పిల్లలు ఆ రోజు చేయాల్సిన పనుల్లో తమకు నచ్చిన వాటిని ఎంచుకోవడానికి సహాయపడతాయి. ఆ రోజు చేయాల్సిన పనులను పిల్లలకు సులభంగా చెప్పడానికి ఇవి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి. అలాగే, పిల్లలు తమకు నచ్చిన పనులను ఎంచుకోవచ్చు.
  1. పిల్లలకు ఇష్టం లేని పనులను బలవంతంగా చేయించడం వల్ల వారు ఎక్కువగా ఒత్తిడికి గురికావచ్చు లేదా ఒక్కసారిగా చాలా అసహనంగా మారవచ్చు. అందుకే, రోజువారీ పనుల్లో పిల్లలకు కొంత ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడం మంచిది.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

గమనిక: ఈ విషయ వివరణ కేవలం సమాచారం కోసం మాత్రమే అని గమనించగలరు.

Write Blog

Share your experiences with others like you!

English