Skip to main content
Install App
If you're using:

ప్రత్యేక అవసరాలున్న అమ్మాయిల్లో నెలసరి సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతను నిర్వహించే సూచనలు

Kavya_Gynaecologist

Dr.Kavya Priya Vazrala

Also available in: हिंदी English

Key Takeaways:

  1. ప్రత్యేక అవసరాలు ఉన్న అమ్మాయిలకు రోజువారీ వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమైనది.
  2. ఒకే విధమైన దినచర్య, ఈ సమయంలో పరిశుభ్రతను సులభంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.
  3. నెలసరి సంరక్షణ అనేది , రోజువారీ పరిశుభ్రత అలవాట్లపై ఉంటుంది.
  4. పరిశుభ్రతను సులభంగా పాటించేందుకు ఈ ప్రెజెంటేషన్‌లో ఉపయోగకరమైన సూచనలు ఉన్నాయి. 
  5. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు సమర్థవంతమైన సంరక్షణ దినచర్యను రూపొందించుకోవచ్చు.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.65 MB]

పిల్లలు ప్రతిరోజూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేలా చూడడం  చాలా ముఖ్యం. వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన ఒక క్రమమైన దినచర్యను అలవాటు చేయడం వల్ల, నెలసరి సమయంలో కూడా స్వీయ సంరక్షణకు సహాయపడుతుంది. 

ఈ విషయ వివరణ పైన అందుబటులో ఉన్న ప్రెజెంటేషన్ ఆధారంగా రూపొందించబడింది, ఇందులో ప్రత్యేక అవసరాలు ఉన్న అమ్మాయిల్లో  పరిశుభ్రతను ఎలా నిర్వహించాలో సూచనలు ఇవ్వబడ్డాయి.

ప్రారంభం నుంచే మొదలుపెట్టండి 

  • మీ పిల్లలకు నెలసరిలో పరిశుభ్రతను సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధం చేయడంలో మొదటి అడుగు స్వీయ సంరక్షణ మరియు రోజువారీ అలవాట్లను నేర్పించడం. 
  •  ఇది వారికి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన సంరక్షణ అలవాట్లను సులభంగా అలవాటు చేసుకోవడంలో సహాయపడుతుంది. 
  •  మీరు నిర్ధారించుకోవాల్సినవి:
    • వారు స్వయంగా స్నానం చేయగలగడం 
    • వారు టాయిలెట్‌ను ఉపయోగించిన తరువాత తమను తాము శుభ్రం చేసుకోవడం 
    • టాయిలెట్‌  ఉపయోగించిన ప్రతి సారి చేతులను స్వయంగా కడిగి, తుడుచుకోవడం 
    • ప్రతిరోజూ లోదుస్తులను మార్చుకోవడం 
    • స్వయంగా దుస్తులు ధరించడం

శారీరక ఆరోగ్యం: నులిపురుగుల నివారణ (డీవార్మింగ్)

  • పాఠశాలకు వెళ్లే పిల్లలు ప్రతి 6 నెలలకు ఒకసారి నులిపురుగుల నివారణ మందులు తీసుకోవాలి. ఇది ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు లేదా పోషక లోపాలను నివారిస్తుంది.
  • ఇది సమర్థవంతమైన మరియు సిఫార్సు చేయబడిన విధానం.
  • ఇది సులభమైన, సురక్షితమైన విధానం. వైద్యుడు సూచించిన మందును పిల్లలు నోటి ద్వారా తీసుకోవచ్చు. 

శారీరక ఆరోగ్యం: ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు

రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు.

మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉండటం, దురద, తెల్లటి స్రావం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

ఈ లక్షణాలు 2 రోజులకు మించి కొనసాగితే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.

సహాయక విధానాలు

దృశ్య సహాయకాలు/సూచనలు  

నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడానికి దృశ్య సూచనలను ఉపయోగించడం  చాలా ఉపయోగకరం.

ప్రైవేట్ భాగాల ఆరోగ్యం, పరిశుభ్రతను ఎలా చూసుకోవాలో వివరించడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు: 

  •   ప్రైవేట్ భాగాలను అనవసరంగా తాకకూడదు. తాకే ముందూ తరువాత చేతులు కడగాలి.
  •  ప్రైవేట్ భాగాల్లో ఏ వస్తువూ పెట్టకూడదు.

ఇంద్రియ (సెన్సరీ) సున్నితత్వం 

 కొంతమంది పిల్లలకు ఇంద్రియాలపై అధిక సున్నితత్వం ఉండవచ్చు. అందువల్ల పిల్లల సంరక్షణలో ఇది గమనించాలి.

చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు , బట్టలు ఉతికేటప్పుడు డిటర్జెంట్ లేదా యాంటీసెప్టిక్ లను ఎక్కువగా ఉపయోగించకండి.

సంరక్షణ 

రోజుకు కనీసం రెండుసార్లు లోదుస్తులు మరియు ప్యాడ్ మార్చుకోవడం నేర్పండి.

దురద వచ్చినప్పుడు గోకకుండా ఉండేలా నేర్పండి.  లేదంటే ఇన్‌ఫెక్షన్ లేదా గాయాలు కావచ్చు.

చూసి నేర్చుకునే విధానం  

పిల్లలు ఇతరులను చూసి, అనుకరించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి, మీరు మంచి పరిశుభ్రత అలవాట్లను పాటించండి. పిల్లలు మిమ్మల్ని చూసి వాటిని నేర్చుకోగలరు. 

మీ అమ్మాయి వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతిరోజూ పాటించేలా చూడడం చాలా ముఖ్యం. వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన క్రమమైన దినచర్యను అలవాటు చేయడం వల్ల, నెలసరి సమయంలో కూడా స్వీయ సంరక్షణకు అవసరమైన అలవాట్లు ఏర్పడతాయి.

మీ అమ్మాయికి వ్యక్తిగత సంరక్షణ, పరిశుభ్రతకు సంబంధించిన రోజువారీ అలవాట్లను పెంపొందించడంలో సహాయపడే కొన్ని ప్రాథమిక సూచనలను తెలుసుకోవడానికి ఈ ప్రెజెంటేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేక అవసరాలున్న అమ్మాయిల్లో నెలసరి పరిశుభ్రతను నిర్వహించడానికి కొన్ని ఉపయోగకరమైన సూచనలను తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.

మీ పిల్లలకు నెలసరి సమయంలో కలిగే భావోద్వేగ ఇబ్బందులు అర్థం చేసుకుని వాటిని ఎదుర్కోవడంలో ఎలా సహాయపడాలో తెలుసుకోండి. అలాగే, నెలసరి సమయంలో ఉపయోగపడే ఆక్యుపేషనల్ థెరపీ సూచనలు మరియు పిల్లలకు, కుటుంబానికి మెరుగైన సంరక్షణ అందించడానికి ఏమి చేయవచ్చో తెలుసుకోండి. ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఏమిటి? అనే వీడియోను కూడా చూడవచ్చు.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

గమనిక: ఈ విషయ వివరణ ప్రత్యేక అవసరాలు ఉన్న మహిళల కోసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. నెలసరి మరియు పరిశుభ్రత పద్ధతుల గురించి మరింత సమాచారం కోసం దయచేసి అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English