Skip to main content
Install App
If you're using:

ప్రత్యేక అవసరాలున్న అమ్మాయిల్లో నెలసరి సంబంధిత ఆందోళనలు

Kavya_Gynaecologist

Dr.Kavya Priya Vazrala

Also available in: हिंदी English

Key Takeaways:

  •  అదనపు అవసరాలు ఉన్న అమ్మాయిల నెలసరి నిర్వహణ కుటుంబాలకు నేర్చుకునే ప్రయాణం కొత్తదిగా మరియు భావోద్వేగపూరితమైనదిగా అనిపించవచ్చు.
  •  శస్త్రచికిత్స వంటి ఎంపికలను పరిగణలోకి తీసుకునే ముందు, ముందుగా ప్రాయోగిక సూచనలు/నిర్వహణ మార్గాలను పరిశీలించాలి.
  • తీవ్రమైన ప్రవర్తన, శారీరక లేదా మానసిక సంబంధిత ఇబ్బందులు ఉన్నప్పుడు వైద్య సహాయం అవసరం కావచ్చు.
  •  సంరక్షకుల ఆరోగ్యం మరియు సామాజిక-ఆర్థిక పరిస్థితులు కూడా నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి.
  • శాశ్వత నిర్ణయాలు తీసుకునే ముందు, సహాయక వర్గాలను మరియు అర్హత కలిగిన గైనకాలజిస్టును సంప్రదించాలి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [533.81 KB]

ప్రత్యేక అవసరాలు ఉన్న అమ్మాయిల తల్లిదండ్రులు, ప్రతి నెలా నెలసరి సమయంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లు మరియు ఇబ్బందుల గురించి ఆందోళన, భయాలను ఎదుర్కొనవచ్చు.

మీ ప్రత్యేక అవసరాలున్న అమ్మాయికి నెలసరిని సమర్థవంతంగా నిర్వహించేందుకు సహాయపడే సూచనలు క్రింద ఇవ్వబడ్డాయి. వారి శ్రేయస్సు కోసం శస్త్రచికిత్స లేదా ఇతర ప్రత్యామ్నాయ చర్యలను పరిగణలోకి తీసుకునే ముందు, ఈ సూచికను తప్పనిసరిగా చదవండి. 

సహజమైన ఎదుగుదల మరియు అభివృద్ధిని పొందడం అనేది  ప్రతి పిల్లల మౌలిక హక్కు. అదే హక్కు ప్రత్యేక అవసరాలు ఉన్న మీ అమ్మాయికీ చెందుతుంది. తల్లిదండ్రులుగా, సాధ్యమైనంత వరకు ఈ సహజ ప్రక్రియలను వారు గౌరవంగా, సురక్షితంగా పొందేలా చూడటం మన బాధ్యత.

ఈ ప్రక్రియ ఎలా ఉండవచ్చు?

ఇతర సాధారణ పిల్లల మాదిరిగానే, అదనపు అవసరాలున్న పిల్లలు కూడా కొన్ని సందర్భాల్లో నెలసరి సమయంలో ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు. ఇది శారీరకంగాను, మానసికంగాను వారికి కష్టంగా అనిపించవచ్చు.

సాధారణంగా కనిపించే   ప్రీ-మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పి.ఎం.ఎస్) లో తరచుగా కనిపించే లక్షణాలు:

  • పొత్తికడుపు నొప్పి
  •  వెన్నునొప్పి
  •  భావోద్వేగ మార్పులు (మూడ్ స్వింగ్స్)
  •   అలసట

కొంతమంది ఈ పరిస్థితిని నిర్వహించగలిగినా, మరికొందరికి ఇది ఎక్కువగా బాధాకరంగా ఉండవచ్చు. మీ పిల్లల్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా అని గమనించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, వారు తమ నొప్పి లేదా అసౌకర్యాన్ని స్పష్టంగా చెప్పలేకపోవచ్చు కాబట్టి మరింత జాగ్రత్త అవసరం.

నిర్వహణ కష్టంగా ఉంటే ఏమి చేయాలి?

మీ పిల్లలకు నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి లేదా అధిక రక్తస్రావం ఉంటే, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలాంటి పరిస్థితుల్లో జీవనశైలిలో మార్పులు లేదా వైద్య సహాయం అవసరం కావచ్చు. గైనకాలజిస్టును సంప్రదించి, అండాశయ సమస్యలు లేదా ఎండోమెట్రియోసిస్ వంటి అంతర్గత ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని పరీక్షించించండి.

వైద్యపరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకునే ముందు, మీ పిల్లల నెలసరిని సులభంగా నిర్వహించగల పద్ధతులను ముందుగా ప్రయత్నించడం మంచిది.

కొందరు పిల్లల్లో, ఈ సూచనలను క్రమంగా పాటించడం వల్ల నెలసరి సమయంలో నొప్పి మరియు అసౌకర్యం తగ్గవచ్చు. ఈ పరిస్థితి ఇంకా కొనసాగితే, గైనకాలజిస్టును సంప్రదించి అదనపు సహాయం పొందడం ఉపయోగకరంగా ఉంటుంది.

పరిస్థితి తీవ్రతని బట్టి, వారు నోటి ద్వారా తీసుకునే మందులు, హార్మోనల్ ఇంట్రా యూటరైన్ పరికరాలు ( ఐ.యూ.డి. లు) వంటి తగిన ప్రత్యామ్నాయాలను సూచించవచ్చు లేదా మరో శాశ్వతమైన పరిష్కారాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు.

అయితే, అన్ని ఇతర ప్రయత్నాలు చేసి ఫలితం లేకపోయినప్పుడు మాత్రమే శాశ్వత పరిష్కారాన్ని పరిగణలోకి తీసుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

కొన్ని సందర్భాల్లో, కొందరు వైద్యులు తల్లిదండ్రులకు తమ పిల్లలకు నెలసరి నిర్వహణ నేర్పడానికి తగిన సమయం ఇవ్వడానికి ముందే శస్త్రచికిత్సా ప్రయత్నాలను సూచించే అవకాశం ఉంటుంది.

పిల్లలకు నెలసరి చక్రాన్ని నిర్వహించడం, నొప్పి మరియు అసౌకర్యాన్ని ఎదుర్కోవడం నేర్పించడం ప్రారంభంలో కష్టంగా, ఆందోళన కలిగించేలా అనిపించవచ్చు. అయితే, నిరంతర సహాయం మరియు ప్రోత్సాహంతో, పిల్లలు క్రమంగా తమ సంరక్షణను తాము చేసుకోవడం నేర్చుకోగలరు.

ఇది వారు పెద్దవారిగా ఎదుగుతున్న సమయంలో  వారి ఆరోగ్యం మరియు పూర్తి శ్రేయస్సుకు మరింత సురక్షితంగా, ప్రయోజనకరంగా ఉంటుంది.

సమగ్ర అవగాహనతో నిర్ణయాలు తీసుకోండి

పిల్లల పరిస్థితి, నెలసరికి సంబంధించిన వివిధ అంశాలను వారు ఎంతవరకు నిర్వహించగలరో పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఈ విషయం గురించి సాధ్యమైనంత ఎక్కువగా తెలుసుకుని, అది మీ పిల్లల శ్రేయస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమైనది.

ప్రత్యేక అవసరాలు ఉన్న మీ పిల్లలో వైద్య / శస్త్రచికిత్స ఎంపికలను పరిగణలోకి తీసుకోవాల్సిన కఠినమైన పరిస్థితులు ఇవి:

  • తీవ్రమైన ప్రవర్తనా మార్పులు (కొన్ని సందర్భాల్లో తమకు తామే హాని చేసుకునే ప్రవర్తన)
  •  నెలసరి సమయంలో స్వీయ సంరక్షణను నిర్వహించలేని శారీరక ఇబ్బంది
  • సంరక్షకుడిపై పూర్తిగా ఆధారపడేలా చేసే మేధో సంబంధిత ఇబ్బందులు
  • నెలసరి సంరక్షణ బాధ్యత తీసుకునే ప్రధాన సంరక్షకుడి వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితి
  •   కష్టమైన పరిస్థితుల్లో సహాయం కోసం ఇతరులను నియమించుకునే సామాజిక-ఆర్థిక స్థితి

ఈ అంశాల్లో కొన్ని, తల్లిదండ్రులను ప్రత్యామ్నాయ మార్గాలను పరిగణలోకి తీసుకోవడాన్ని నిర్దేశిస్తాయి, తద్వారా పిల్లల మరియు తమ జీవన నాణ్యత మెరుగుపడుతుంది.

ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, తమ సపోర్ట్ గ్రూప్ లోని ఇతర తల్లిదండ్రులతో మాట్లాడి సలహా మరియు మనోధైర్యం పొందాలి. అలాగే తమ పిల్లలకు నెలసరిని శాశ్వతంగా నిలిపివేసే లేదా శస్త్రచికిత్స విధానాలను ఎంచుకునే ముందు, అనుభవం కలిగిన  గైనకాలజిస్టు నుండి వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

నెలసరి సమయంలో కలిగే భావోద్వేగ మార్పులు చాలా సాధారణం. ఎక్కువ మంది మహిళలు ఈ భావోద్వేగ ప్రయాణాన్ని వివిధ స్థాయుల్లో అనుభవిస్తారు. మీ అమ్మాయి దీనిని సహజంగా అంగీకరించి ఎదుర్కొనేలా మీరు ఎలా మద్దతు ఇవ్వగలరు అనే విషయం తెలుసుకోండి.  ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల నెలసరి సంరక్షణకు ఆక్యుపేషనల్ థెరపీ మార్గాలు పై అందుబాటులో ఉన్న ఈ అంశం కూడా మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు.

 గమనిక: ప్రత్యేక అవసరాలున్న మీ పిల్లలకు నెలసరి నిర్వహణపై రూపొందించిన ఈ విషయం వివరణ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది. సురక్షితమైన నిర్వహణ కోసం అర్హత కలిగిన వైద్య నిపుణుడిని తప్పనిసరిగా సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ.డి.హెచ్.డి లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

Write Blog

Share your experiences with others like you!

English