Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

డౌన్ సిండ్రోమ్ పిల్లల పోషకాహార అవసరాలను తీర్చుట- గైడ్

Default Avatar

DSFI

Also available in: हिंदी English

Key Takeaways:

మేము ఈ వ్యాసంలోని ప్రధాన అంశాలను సిద్ధం చేస్తున్నాము. అవి త్వరలో అందుబాటులో ఉంటాయి.

Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.33 MB]

ప్రత్యేక అవసరాలున్న పిల్లల పోషకాహార అవసరాలు ఇతరులకంటే భిన్నంగా ఉంటాయి. చాలా సందర్భాలలో, కొన్ని ఆహార పదార్ధాలు పిల్లల ఆరోగ్యం యొక్క నిర్దిష్ట అంశాలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం ద్వారా వారి జీవితం యొక్క నాణ్యతను పెంచడానికి మనం సహాయపడగలము. ప్రత్యేక అవసరాలున్న పిల్లల ఆరోగ్య సమస్యలను మేము మా మొదటి బుక్లెట్ లో చర్చించాము. అది మీరు ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు.
రెండవ బుక్లెట్ లో మేము డౌన్స్ సిండ్రోమ్ పిల్లలకి ఉండే ప్రత్యేక పోషక అవసరాలను తీర్చడం ఎలా అనే అంశాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నించాము. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలు వారి పరిస్థితి కారణంగా ఏర్పడిన శరీర నిర్మాణాన్ని బట్టి ప్రత్యేకమైన ఆహార అవసరాలను కలిగి ఉంటారు. ఉదాహరణకు డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలు ఊబకాయం భారిన పడే అవకాశం ఎక్కువ. కావున అధిక బరువును నివారించడానికి ఆహార నియమాలలో కొన్ని మార్పులు అవసరం. డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో తరచుగా ఆవు పాలలో ఉండే ప్రోటీన్ పడకపోవడం చూస్తూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో పాల ఉత్పత్తులను నివారించడం వల్ల ప్రయోజనం ఉండవచ్చు. (గమనిక: ఇది పిల్ల/ పిల్లవాడిని బట్టి, వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉంటుంది. కావున మీ పిల్లల ఆహార పట్టిక కొరకు దయచేసి న్యూట్రిషనిస్ట్ లేదా పీడియాట్రిషన్ ని సంప్రదించండి.)

మీ పిల్లల సరైన ఎదుగుదల మరియు అభివృద్ధికి తగినన్ని నీరు, పోషకాలు మరియు పీచు పదార్థాలు ఉండేలా తయారుచేయగల ఆరోగ్యకరమైన వంటకాలకు సంబంధించిన చిట్కాలను కూడా ఈ బుక్‌లెట్ లో పొందుపరిచాము.

మీ పిల్లల ప్రత్యేక పోషకాహార అవసరాలను అర్థం చేసుకోవడానికి సమాచారాన్ని పొందడానికి దయచేసి బుక్‌లెట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
గమనిక : ఈ బుక్లెట్ లోని ఏ సమాచారమైన వైద్యపరమైన సలహాగా పరిగణింపబడదు. ఇది కేవలం సమాచార అవసరాల కోసం మాత్రమే రూపొందించబడినది.
అభివృద్ధి వైకల్యాలు ఉన్న పిల్లలు ఎదుర్కొనే సాధారణ పోషకాహార సవాళ్లపై దృష్టి సారించే ఈ పోషకాహార బుక్‌లెట్‌ను కూడా దయచేసి చూడండి.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర మేధో వైకల్యాల గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి ఆందోళనలు ఉంటే, సహాయం చేయడానికి Nayi Disha బృందం ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996లో సంప్రదించండి. మీరు మాకు కాల్ చేయవచ్చు లేదా whatsappలో సందేశం పంపవచ్చు. మా కౌన్సెలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీతో సహా వివిధ భాషలను మాట్లాడతారు.

Tags: Nutrition
Write Blog

Share your experiences with others like you!

English