Skip to main content
Install App
If you're using:

ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఆర్థిక ప్రణాళిక

Partners (People)

Jitendra Solanki

Also available in: English

Key Takeaways:

  • “ఫైనాన్సియల్ ప్లానింగ్ ఫర్ ఫ్యామిలీస్ విత్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్”అనే పుస్తకాన్ని జితేంద్ర సోలంకి రచించారు. ప్రత్యేక అవసరాలున్న కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థికంగా ప్రణాళికకు సంబంధించిన వివిధ సందేహాలను వివరించారు.
  • ఆర్థిక వ్యవహారాలను ఎలా క్రమబద్ధంగా నిర్వహించాలి, వీలునామా, ట్రస్ట్ ఎలా ఏర్పాటు చేయాలి, చట్టపరమైన సంరక్షకులు (లీగల్ గార్డియన్) మరియు ట్రస్టీలను ఎలా నియమించాలి వంటి విషయాల గురించి ఇందులో తెలుసుకోవచ్చు.
  • ప్రత్యేక అవసరాలున్న మీ పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే కాకుండా, మీరు పదవీ విరమణ చేసిన తర్వాత మీ అవసరాల కోసం కూడా సరిపడే ఆర్థిక ఏర్పాట్లు ముందుగానే చేసుకోవడం ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది.
  • లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) అనే ముఖ్యమైన పత్రం యొక్క ప్రాధాన్యతను కూడా ఈ పుస్తకం వివరిస్తుంది.

ఈ విషయ వివరణ జితేంద్ర సోలంకి రచించిన ఫైనాన్సియల్ ప్లానింగ్ ఫర్ ఫ్యామిలీస్ విత్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనే పుస్తకం గురించి వివరిస్తుంది. ప్రత్యేక శ్రద్ధ అవసరమైన కుటుంబ సభ్యుల భవిష్యత్తు గురించి కుటుంబానికి ఉండే ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన వివిధ ఆందోళనలను ఈ పుస్తకం వివరిస్తుంది. ప్రత్యేక అవసరాలున్న పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక చేసుకునేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన వివిధ అంశాలు, ఆర్థికంగా చేయాల్సిన ఏర్పాట్లు, చట్టపరంగా అవసరమైన విషయాలు ఏమిటో ఈ పుస్తకం సమగ్రంగా విశ్లేషిస్తుంది.

ఈ పుస్తకంలో ఏమి తెలుసుకోవచ్చు?

  • పుస్తకంలోని మొదటి భాగాలు, ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తి ఉన్న కుటుంబం ఎదుర్కొనే పరిస్థితులను అర్థం చేసుకోవడానికి పాఠకులకు సహాయపడతాయి.
  • పెరుగుతున్న ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల సంఖ్య, అలాగే వారి కుటుంబాలు ఎదుర్కొనే వివిధ సవాళ్లను ఈ పుస్తకం వివరిస్తుంది.
  •  ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు చిన్నతనం నుంచి పెద్దవయస్సు వరకు జీవితంలోని వివిధ దశల్లో ఎదుర్కొనే సవాళ్ల గురించి ఈ పుస్తకంలో వివరించారు.
  •  ప్రత్యేక అవసరాలున్న వ్యక్తికి జీవితాంతం అవసరమైన సంరక్షణ కోసం పరిగణలోకి తీసుకోవాల్సిన ఆర్థిక విషయాలను జితేంద్ర సోలంకి ఈ పుస్తకంలో వివరించారు.

ప్రధానంగా చర్చించిన అంశాలు

కుటుంబాలు ఎప్పటికప్పుడు ఆలోచించే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ పుస్తకంలో చర్చించారు.

నేను మరణించిన తర్వాత నా పిల్లల ఆర్థిక అవసరాల కోసం ఎలా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి?

నా పిల్లల సంరక్షణ కోసం ముందుగానే ఎలాంటి ఆర్థిక ఏర్పాట్లు చేసుకోవాలి?

నా పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించేలా వీలునామా ఎలా తయారు చేసుకోవాలి?

నా పిల్లలకు సరైన సంరక్షకుడిని ఎలా ఎంపిక చేసుకోవాలి?

కుటుంబ సంక్షేమానికి అనుకూలంగా ప్రైవేట్ ట్రస్ట్‌ను ఎలా ఏర్పాటు చేయాలి? దాన్ని ఎలా నిర్వహించాలి?

లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఏమిటి? అది ఎందుకు ముఖ్యమైనది?

ఆర్థిక ప్రణాళిక

  • ఈ పుస్తకంలో వివరించిన ఆర్థిక ప్రణాళికలో కుటుంబానికి అందుబాటులో ఉన్న అన్ని ఆదాయ వనరులను గుర్తించడం, పిల్లల సంరక్షణకు అయ్యే ఖర్చుల కోసం బడ్జెట్‌ను సిద్ధం చేయడం, అలాగే భవిష్యత్తు అవసరాల కోసం తల్లిదండ్రులు ఎంత మొత్తాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకోవడం వంటి విషయాలను వివరించారు.
  • ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలపై ఆధారపడే తల్లిదండ్రులకు జీవితంలోని మరో ముఖ్యమైన దశ వృద్ధాప్యం, ముఖ్యంగా పదవీ విరమణ సమయం. ఈ సమయంలో ఆర్థిక ప్రణాళిక అంటే తల్లిదండ్రుల సొంత అవసరాలు, సంరక్షణ ఖర్చులను మాత్రమే చూసుకోవడం కాదు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల సంరక్షణకు అయ్యే ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. పదవీ విరమణ తర్వాత తల్లిదండ్రుల అవసరాలతో పాటు, పిల్లల సంరక్షణ ఖర్చులను కూడా తీర్చడానికి అవసరమైన నిధులను ఎలా ముందుగానే కేటాయించుకోవాలో ఈ పుస్తకంలో వివరించారు.
  • తల్లిదండ్రులకు అనుకోకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితి రావడం లేదా వారు మరణించడం వంటి పరిస్థితులు ఎదురైతే, వాటిని ఎలా ఎదుర్కోవాలో సరైన ఆర్థిక ప్రణాళికతో ముందుగానే సిద్ధంగా ఉండే మార్గాలను కూడా ఈ పుస్తకం వివరిస్తుంది.
  •  ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు జీవిత భీమా, ఆరోగ్య భీమా మరియు వైకల్యం భీమా (డిసెబిలిటీ ఇన్సూరెన్స్) ఎలా తీసుకోవాలి అనే వివరాలను కూడా ఈ పుస్తకంలో అందించారు.
  •  అలాగే, అందుబాటులో ఉన్న వివిధ పెట్టుబడి మార్గాలు, ప్రతి కుటుంబ పరిస్థితికి అనుగుణంగా సరైన పెట్టుబడిని ఎలా ఎంచుకోవాలి అనే విషయాలను కూడా ఈ పుస్తకం వివరిస్తుంది.

ప్రత్యేక అవసరాలున్న పిల్లలపై ఆధారపడే కుటుంబాలకు అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపులు లేదా తగ్గింపుల గురించి కూడా ఈ పుస్తకం వివరాలను అందిస్తుంది. ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన వివిధ అంశాలను తల్లిదండ్రులు క్రమబద్ధంగా నిర్వహించుకోవడానికి, ఈ పుస్తకంలో ఉపయోగకరమైన సూచనలు, కార్యాచరణ ప్రణాళికలు అందించారు. అదనంగా, ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల సంరక్షణకు సంబంధించి కుటుంబాలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, సేవలు మరియు ఇతర వనరుల వివరాలను కూడా ఇందులో అందించారు.

ప్రత్యేక అవసరాలున్న మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికను ప్రారంభించేందుకు ఉపయోగపడే మూడు ముఖ్యమైన అంశాలు గురించి కూడా వివరించారు.

గమనిక: ఈ వివరణ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మీ అవసరాలకు సంబంధించిన చట్టపరమైన లేదా ఆర్థిక సలహా కోసం దయచేసి ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ.డి.హెచ్.డి, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

Write Blog

Share your experiences with others like you!

English