Skip to main content
Install App
If you're using:

మూర్ఛ (ఎపిలెప్సీ) గురించి మీ పిల్లల పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్‌ను అడగవలసిన ప్రశ్నలు

20180628_104304_NikitMilind

Dr.Nikit Milind Shah

Also available in: हिंदी English

Key Takeaways:

  •  మీ పిల్లలకు ఇటీవల మూర్ఛ ఉందని నిర్ధారణ అయితే, సంరక్షకులు ఆందోళనకు గురికావచ్చు.   
  • మూర్ఛకు గల కారణాలు, నిర్ధారణ మరియు చికిత్స గురించి సరైన సమాచారం తెలుసుకోవడం ద్వారా దీనిని సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
  • కింద అందుబాటులో ఉన్న టూల్‌కిట్‌లో  మీ పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ను అడగాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. 
  • మూర్ఛ ఉన్న పిల్లల సంరక్షణలో రోజువారీ ఎదురయ్యే సాధారణ సమస్యలను  ఇందులో చేర్చారు.
  • సరైన ప్రశ్నలు అడగడం ద్వారా సంరక్షకులు మూర్ఛను మెరుగ్గా నిర్వహించగలుగుతారు. అలాగే, తమ పిల్లలకు సురక్షితమైన, సమర్థవంతమైన మరియు సరైన సహాయం అందించగలరు.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [702.14 KB]

ఈ విషయ వివరణ పైన అందుబాటులో ఉన్న టూల్‌కిట్‌ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మీ పిల్లల మూర్ఛ గురించి పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ను అడగాల్సిన ప్రశ్నలను తెలుసుకోవచ్చు.

మూర్ఛ నిర్ధారణ తర్వాత కుటుంబాలకు సహాయం 

మీ పిల్లలకు మూర్ఛ ఉన్నట్లు  నిర్ధారణ అయితే, సంరక్షకులకు ఆందోళనను కలిగించవచ్చు. వారి సంరక్షణను ఎలా నిర్వహించాలో వారికి స్పష్టత లేకపోవచ్చు. భయం మరియు ఆందోళన సహజమైనవే అయినప్పటికీ, సరైన సమాచారం మరియు మార్గదర్శకత్వం ద్వారా వాటిని తగ్గించవచ్చు.

కుటుంబాలకు సహాయం చేయాలంటే, మూర్ఛకు గల కారణాలు,నిర్ధారణ, చికిత్స గురించి సంరక్షకులకు స్పష్టమైన సమాచారం ఉండటం  చాలా ముఖ్యం. దీనిద్వారా వారు సరైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు తమ పిల్లలకు తగిన సంరక్షణను అందించగలుగుతారు.

మూర్ఛ మరియు మందులు

ఈ టూల్‌కిట్‌లో మూర్ఛ మరియు మందులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. వైద్యుడిని కలిసినప్పుడు అవసరమైన విషయాలు తెలుసుకుని సిద్ధంగా ఉండేందుకు సంరక్షకులకు ఇవి సహాయపడతాయి

  • సరైన  మందుల ఎంపిక :

మీ పిల్లలకు వచ్చే మూర్ఛ రకాన్ని బట్టి ఏ మందులు అత్యంత అనుకూలంగా ఉంటాయో సంరక్షకులు వైద్యుడిని అడిగి తెలుసుకోవచ్చు.

  • మందుల ఇతర ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) గురించి తెలుసుకోండి

మందుల వల్ల కలిగే ఇతర ప్రభావాలు ఏమిటి, అలాగే ఏ మందులను ఉపయోగించకుండా ఉండాలో వైద్యుడితో చర్చించడం ముఖ్యం.

  •  మోతాదు మరియు భద్రత

మందుల సరైన మోతాదు గురించి ప్రశ్నించడం ద్వారా చికిత్స సురక్షితంగా, ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవచ్చు. 

  • ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలు

ఈ టూల్‌కిట్‌లో పోషకాహార సప్లిమెంట్లు మరియు ప్రత్యామ్నాయ చికిత్సా విధానాల గురించి అడగవలసిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా కుటుంబాలు వైద్య చికిత్సతో పాటు అదనపు సహాయక మార్గాలను కూడా పరిశీలించవచ్చు.

రోజువారీ అవసరాలకు సహాయం 

ఈ ప్రశ్నల జాబితాలో కుటుంబాలు తరచుగా ఎదుర్కొనే భద్రత, పాఠశాలలో సహాయం  మరియు రోజువారీ సంరక్షణ వంటి అంశాలు కూడా ఉన్నాయి.  

  • అత్యవసర పరిస్థితులకు  సిద్ధంగా ఉండటం :

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఎవరిని సంప్రదించాలో తెలుసుకోవడానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి

  •  పాఠశాలలో సహాయం:

పిల్లలకు పాఠశాలలో ఎలాంటి సహాయం అందుతోందో తెలుసుకోవడానికి, అలాగే పిల్లల పరిస్థితి, ప్రథమ చికిత్స మరియు మందుల గురించి పాఠశాలకు ఎలా తెలియజేయాలో కూడా తెలుసుకోవచ్చు.  

  • రోజువారీ సంరక్షణ:
    ఇంట్లో మరియు సమాజంలో పిల్లల పూర్తి సంరక్షణకు అందుబాటులో ఉన్న సహాయ వ్యవస్థల  గురించి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు  తెలుసుకోవచ్చు.

పిల్లల పురోగతి మరియు అభివృద్ధి

మీ పిల్లలు క్రీడలు లేదా ఇతర శారీరక కార్యకలాపాల్లో పాల్గొనడం గురించి  ప్రశ్నలు అడగండి. ఇవి వారి శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మరియు సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయి.

  •  అదనపు కార్యకలాపాలలో భాగస్వామ్యం:

పిల్లల సృజనాత్మకత మరియు సామాజిక నైపుణ్యాలను పెంపొందించే అదనపు కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాల గురించి తెలుసుకోండి.

ఈ ప్రశ్నలు పిల్లలకు మూర్ఛ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత సంరక్షకులకు సహాయపడేలా రూపొందించబడ్డాయి. పిల్లల పరిస్థితి గురించి సరైన సమాచారం తెలుసుకుని, అవసరమైన విషయాలతో  సిద్ధంగా ఉండేందుకు ఇవి సహాయపడతాయి. వైద్యులను కలిసే  ముందు సిద్ధం కావడానికి ఒక ప్రశ్నల జాబితా ఉంది. దీని ద్వారా వైద్యులతో కలిసి విషయాలను చర్చించుకోవచ్చు, సంరక్షకులలో ఉండే ఆందోళనను కూడా తగ్గుతుంది.

మీరు వైద్యుడిని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రశ్నల జాబితా యొక్క కాపీలను  తీసుకుని, మీ పిల్లల మూర్ఛ గురించి పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ను ఈ ప్రశ్నలు అడగవచ్చు.

Essentials of Epilepsy First-aid. (మూర్ఛ వచ్చినప్పుడు అందించాల్సిన అత్యవసర ప్రథమ చికిత్స) అనే వీడియో ను కూడా చూడవచ్చు.

మీరు ఒక సీజర్ కార్డ్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సంరక్షకులు పిల్లలతో లేని సమయంలో, ఈ కార్డ్ పిల్లల వైద్య గుర్తింపు కార్డ్‌గా ఉపయోగపడుతుంది.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సరైన మార్గదర్శకత్వం కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English