Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

డౌన్ సిండ్రోమ్ ఉన్న మహిళల్లో మెనోపాజ్ దశను అర్థం చేసుకోవడం

Default Avatar

DSFI

Also available in: हिंदी English

Key Takeaways:

  1. సాధారణ మహిళలతో పోలిస్తే, డౌన్ సిండ్రోమ్ ఉన్న మహిళల్లో మెనోపాజ్ దాదాపు పది సంవత్సరాలు ముందుగానే రావచ్చు.
  1. మెనోపాజ్‌ లక్షణాలు ప్రతి మహిళలో భిన్నంగా కనిపించవచ్చు. కొందరిలో తీవ్రత తక్కువగా ఉంటే, మరికొందరిలో ఎక్కువకాలం కొనసాగవచ్చు.
  1. తల్లిదండ్రులు ముందుగానే సిద్ధం కావడం, పిల్లలతో స్పష్టంగా మాట్లాడటం, మరియు నమ్మకం కలిగించడం ద్వారా ఈ దశను సులభంగా అధిగమించవచ్చు.
  1. సంరక్షకులు సరైన మార్గదర్శనం ఇవ్వడం, ఇది సహజమైన దశ అని అర్థమయ్యేలా చేయడం మరియు మొత్తం శారీరక-మానసిక ఆరోగ్యానికి తోడ్పడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
  2. ఈ దశలో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు మరియు పర్యవేక్షణ చాలా ముఖ్యమైనవి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [677.54 KB]

మెనోపాజ్ అనేది మహిళల్లో అండాశయాలు అండాలను విడుదల చేయనప్పుడు మరియు గర్భధారణకు అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు ఏర్పడే సహజ దశ. ఈ మార్పుతో నెలసరి/రుతుక్రమం ముగుస్తుంది మరియు అనేక శారీరక, భావోద్వేగ మార్పులు కనిపించవచ్చు.

డౌన్ సిండ్రోమ్ ఉన్న మహిళల్లో మెనోపాజ్ కొన్ని ప్రత్యేక సవాళ్లతో కూడి ఉండవచ్చు. పరిశోధనల ప్రకారం, డౌన్ సిండ్రోమ్ ఉన్న మహిళల్లో సాధారణ మహిళలతో పోలిస్తే మెనోపాజ్ దాదాపు పది సంవత్సరాల ముందుగానే రావచ్చు. అందువల్ల సంరక్షకులు మరియు కుటుంబ సభ్యులు ఈ మార్పులకు ముందుగానే సిద్ధం కావడం, అవసరమైన మద్దతు మరియు సంరక్షణ అందించే ఏర్పాట్లు చేయడం ఎంతో ముఖ్యం.

సంరక్షకుల దృష్టికోణం

నెలసరి ముందు వచ్చే (ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్-పి.ఎం.ఎస్.) లక్షణాలు మరియు నెలసరి సమయంలో రక్తస్రావం వల్ల   తల్లిదండ్రులు మరియు సంరక్షకులు చాలా ఒత్తిడిగా, అయోమయంగా అనిపించుకోవచ్చు. మెనోపాజ్ దశ దగ్గరపడుతున్నప్పుడు ఈ సవాళ్లు మరింత క్లిష్టంగా అనిపించవచ్చు. అయితే, మెనోపాజ్ అనేది ప్రతి మహిళ జీవితంలో సహజమైన దశ అని, ఇందులో డౌన్ సిండ్రోమ్ ఉన్న మహిళలు కూడా ఉంటారని గుర్తుంచుకోవడం ముఖ్యం. 

అవగాహన, ఓర్పు మరియు స్పష్టమైన సంభాషణతో ఈ దశను ఎదుర్కొంటే సంరక్షకులు ఎంతో మంచి మార్పు తీసుకురాగలరు. సంరక్షకులు మరియు ఈ దశను ఎదుర్కొంటున్న మహిళ ఇద్దరూ ముందుగానే సిద్ధంగా ఉంటే, ఈ మార్పును మరింత సులభంగా అధిగమించవచ్చు.

ప్రతి మహిళ మెనోపాజ్‌ను భిన్నంగా అనుభవిస్తుంది. కొందరికి శరీరంలో వేడి ఆవిర్లు, భావోద్వేగ మార్పులు లేదా నిద్ర సమస్యలు ఎక్కువగా కనిపించవచ్చు. మరికొందరిలో మాత్రం స్వల్ప మార్పులతోనే ఈ దశ పూర్తవవచ్చు. అలాగే ఈ దశ కొనసాగు కాలం కూడా ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. అందువల్ల ప్రతి మహిళ అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత శ్రద్ధ మరియు సంరక్షణ అందించడం చాలా అవసరం.

ముందుగానే సిద్ధం కావడం

మెనోపాజ్ దశకు ముందుగానే సిద్ధం కావడం ద్వారా సంరక్షకులు తమ పిల్లలకు మెరుగైన మద్దతు అందించగలరు. ఈ దశను సులభంగా ఎదుర్కోవడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు

1.  ఈ ప్రక్రియను సహజంగా అర్థమయ్యేలా చేయండి 

మెనోపాజ్ అనేది మహిళ శరీరంలో సహజంగా జరిగే మార్పు అని మీ పిల్లలకు తెలియజేయండి. ఆమె తల్లి లేదా కుటుంబంలోని ఇతర మహిళల మాదిరిగానే తాను కూడా ఈ దశను సురక్షితంగా ఎదుర్కోగలదని భరోసా ఇవ్వండి.

2.  మనసు విప్పి మాట్లాడండి 

ఆమెకు ఎలా అనిపిస్తోందో తెలుసుకునేందుకు ఆమెతో మాట్లాడండి. ఆమె ప్రశ్నలకు సరళమైన, స్పష్టమైన భాషలో నిజాయితీగా సమాధానాలు ఇవ్వండి. శారీరక లేదా భావోద్వేగ మార్పుల గురించి మీతో మాట్లాడవచ్చని ఆమెకు నమ్మకం కలిగించండి.

3.  అవగాహన మరియు స్పష్టమైన సమాచారం

మెనోపాజ్ అంటే ఏమిటి, ఈ సమయంలో ఎలాంటి మార్పులు రావచ్చు, వారి ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలో వారి వయస్సుకు తగిన విధంగా వివరించండి. చిత్రాలు, కథలు లేదా నిజజీవిత ఉదాహరణలు ఉపయోగించడం వల్ల విషయాలు సులభంగా అర్థమవుతాయి

4.  ఆరోగ్య పర్యవేక్షణ

క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. డౌన్ సిండ్రోమ్‌పై అవగాహన ఉన్న వైద్యులు హార్మోన్ మార్పులను గమనించడం, లక్షణాలను నియంత్రించడం మరియు ఇతర ఆరోగ్య సమస్యలను గుర్తించడంలో సహాయపడగలరు.

5.  భావోద్వేగ మద్దతు

ఒత్తిడిని తగ్గించే, ప్రేమ మరియు భరోసా కలిగిన సహాయక వాతావరణాన్ని కల్పించండి. పిల్లలకు ఇష్టమైన అలవాట్లు(హాబీలు), సామాజిక సంబంధాలు మరియు రోజువారీ అలవాట్లను ప్రోత్సహించండి. ఇవి ఆమెకు సౌకర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి.

వనరులు

డౌన్ సిండ్రోమ్ ఉన్న మహిళల్లో మెనోపాజ్‌కు సంబంధించిన అంశాలను కుటుంబాలు మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మరియు ఈ దశకు ముందుగానే సిద్ధం కావడానికి ఉపయోగపడే ఆచరణాత్మక మార్గాలను గుర్తించేందుకు ఈ ప్రెజెంటేషన్ రూపొందించబడింది.

డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తుల్లో నియమిత ఆరోగ్య పర్యవేక్షణ గురించి రూపొందించిన మా ఇన్ఫోగ్రాఫిక్ కూడా మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు.

గమనిక: ఈ విషయ వివరణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం దయచేసి అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

Write Blog

Share your experiences with others like you!

English