Skip to main content
Install App
If you're using:

మీ పిల్లల అభివృద్ధి మూల్యాంకనం (అసెస్మెంట్)  కోసం సిద్ధం కావడానికి మీ పిడియాట్రిషన్ ను ఏమి అడగాలి?

Default Avatar

Dr Ajay Sharma

Also available in: English

Key Takeaways:

  1. పిల్లల ఎదుగుదల మరియు అభివృద్ధిని గమనించడానికి చిన్న వయస్సులోనే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
  2.   పిల్లల అభివృద్ధి గురించి ఏవైనా ఆందోళనలు ఉంటే, ముందుగా మీ పిల్లల వైద్యుడిని (పిడియాట్రిషన్) సంప్రదించాలి.
  3.   మీ పిడియాట్రిషన్ తో సంకోచం లేకుండా, నిజాయితీగా మాట్లాడే సంబంధాన్ని ఏర్పరచుకోండి. తొలిదశలో అడిగే ప్రశ్నలు, త్వరగా అవసరమైన మద్దతు అందేలా సహాయపడతాయి.
  4.   పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు పిల్లల అభివృద్ధిని పరిశీలించడం వల్ల, ఇబ్బందులను గుర్తించి,  సరైన సమయంలో సహాయాన్ని అందించవచ్చు. 
  5.  తల్లిదండ్రులు మరియు వైద్యుల మధ్య నిరంతర సహకారం కొనసాగడం  వలన, పిల్లల ఆరోగ్య ఫలితాలు మెరుగుపడటమే కాకుండా, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా సహాయపడుతుంది.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.04 MB]

పుట్టినప్పటి నుంచి మొదటి కొన్ని సంవత్సరాలు పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం మరియు అభివృద్ధి సక్రమంగా జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సందేహాలు వచ్చినప్పుడు, మొదటగా  పిల్లల వైద్యుడు (పిడియాట్రిషియన్) ను సంప్రదిస్తారు. అందువల్ల, మీ పిడియాట్రిషియన్ తో మొదటి నుంచే నమ్మకమైన, స్పష్టమైన మరియు స్వేచ్ఛగా మాట్లాడే విధమైన సంబంధం సంబంధాన్ని కొనసాగించడం ఎంతో ప్రయోజనకరం.

మీ పిడియాట్రిషియన్ తో క్రమం తప్పకుండా మాట్లాడే అలవాటు చేసుకోండి. మీ పిల్లల అభివృద్ధికి సంబంధించి ఏవైనా సందేహాలు, ఆందోళనలు లేదా అభివృద్ధిలో ఇబ్బందులు ఉన్నాయని మీకు అనిపిస్తే, వాటిని సంకోచించకుండా వైద్యుడితో చర్చించండి.

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా, పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వయస్సు వరకు పిల్లల అభివృద్ధిలో ఉండే ఏవైనా ఆలస్యాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. దీనివల్ల అవసరమైన సహాయాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించవచ్చు.

అభివృద్ధి మూల్యాంకనం (అసెస్మెంట్) సమయంలో మీ పిడియాట్రిషన్ ను ఏ ప్రశ్నలు అడగాలో తెలుసుకోండి.

దీనికి సహాయపడేందుకు, వైద్యుడిని కలిసే ముందు తల్లిదండ్రులు సిద్ధం కావడానికి ఉపయోగపడే సులభమైన మార్గదర్శినిని మేము రూపొందించాము.

సరైన నిర్ధారణ కోసం, వైద్యులు ఈ క్రింది విషయాలను పరిశీలించవచ్చు:

  • మీ పిల్లల గత ఆరోగ్య, అభివృద్ధి వివరాల గురించి తెలుసుకుంటారు. 
  • మీ పిల్లలను పూర్తిగా పరిశీలించి గమనిస్తారు
  • పరీక్షల ద్వారా మీ పిల్లలను అంచనా వేస్తారు

మీ పిల్లల గురించి సరైన మరియు పూర్తి సమాచారాన్ని వైద్యుడికి అందించడం చాలా ముఖ్యం. దీనివలన త్వరిత నిర్ధారణకు మరియు అవసరమైన సహాయాన్ని సరైన సమయంలో ప్రారంభించడానికి వీలవుతుంది.

1. వైద్యుడిని కలిసే ముందు ఎలా సిద్ధం కావాలి?

మీ పిల్లల గురించి మీకు ఉన్న అన్ని సందేహాలు లేదా ఆందోళనలను ఒక జాబితాగా రాసుకోండి.

ఉదాహరణకు:

  •  మీ పిల్లల శారీరక ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలు
  •  నడవడం, మాట్లాడడం, చూడడం, వినడం వంటి అభివృద్ధి దశల గురించి ఉన్న సందేహాలు

2. మీ ప్రధాన ఆందోళన ఏమిటి? దానిని మీరు మొదట ఎప్పుడు గమనించారు?

3. కాలక్రమేణా ఆ ఆందోళనల్లో ఏవైనా మార్పులు వచ్చాయా?

4. ఈ ఆందోళనలు మీ పిల్లల రోజువారీ జీవితం (తినడం, నిద్రపోవడం

టాయిలెట్ అలవాట్లు, రోజువారీ ఇతర కార్యకలాపాలు)పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి?

5. మీ పిల్లలకు ఇంతకు ముందు ఏవైనా పరీక్షలు లేదా చికిత్సలు జరిగాయా? జరిగితే, వాటి వల్ల మీ పిల్లల్లో ఏవైనా మార్పులు లేదా కనిపించాయా?

తల్లిదండ్రులుగా, మీ పిల్లల పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకునే హక్కు మీకు ఉంది. అలాగే, వారి సంరక్షణలో చురుకైన భాగస్వామిగా ఉండే బాధ్యత కూడా మీదే. మీ భాగస్వామ్యం వల్ల మీ పిల్లలకు అవసరమైన సరైన మద్దతు అందేలా చేయవచ్చు. వైద్యుడిని ప్రశ్నలు అడగడానికి ఎలాంటి సంకోచం అవసరం లేదు.

వైద్యుడిని కలిసే సమయంలో మీరు అడగాలనుకునే ప్రశ్నల జాబితాను ముందుగానే సిద్ధం చేసుకుని వెళ్లండి. మీరు అడగవలసిన వాటిలో కొన్ని కింద ఇవ్వబడ్డాయి.

1.  నా పిల్లల పరిస్థితి గురించి వైద్యుడి అభిప్రాయం ఏమిటి?

వైద్యుడు చెప్పిన విషయం మీకు పూర్తిగా అర్థం కాకపోతే, మరింత సులభంగా వివరించమని అడగడానికి సంకోచించకండి. ఇలా చేయడం వల్ల మీ పిల్లల పరిస్థితిని మీరు మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు.

2.  నా పిల్లల పరిస్థితిని అంచనా వేయడానికి ఏ పరీక్షలు అవసరం?

మీ పిల్లల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఏ పరీక్షలు నిజంగా అవసరమో తెలుసుకోవడం ముఖ్యం. మీ పిల్లలకు అవసరం లేని పరీక్షలు చేయకూడదని చెప్పడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా రేడియేషన్‌కు గురిచేసే ఎక్స్‑రే లేదా సీటీ స్కాన్ వంటి పరీక్షలు, అలాగే మీ పిల్లలకు అసౌకర్యం కలిగించే ఎంఆర్ఐ పరీక్షలు చేయకుండా ఉండటం అవసరం. అలాంటి పరీక్షలు ఎందుకు అవసరమో, వాటి ప్రయోజనాలు మరియు అవసరాన్ని స్పష్టంగా వివరించమని అడగడానికి సంకోచించవద్దు.

3.  నా పిల్లలకు మందులు సూచించినట్లయితే, వాటి అవసరం ఏమిటి?

ఈ మందుల వ్యవధిని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ మందుల గురించి, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు సహా, మరింత సమాచారం తెలుసుకోవడానికి సంకోచించకండి.

4.  సరైన సమాచారంతో మీ అవగాహనను పెంచుకోండి

మీ పిల్లలకు నిర్ధారణ అయిన పరిస్థితి గురించి తెలుసుకోండి. అలాగే, వారి అభివృద్ధిలో ఎలాంటి మార్పులు కనిపించవచ్చో తెలుసుకోండి.

5.  అవసరమైన సమాచారం మరియు మద్దతు గురించి తెలుసుకోండి

మీ పిల్లలకు సహాయపడగల థెరపిస్టులు మరియు ఇతర నిపుణుల గురించి సమాచారం తెలుసుకోండి. అలాగే, తల్లిదండ్రుల సహాయక బృందాలు (సపోర్ట్ గ్రూప్స్), తల్లిదండ్రుల కోసం సమాచార వనరుల కేంద్రాలు వంటి సేవల గురించి కూడా తెలుసుకోండి.

పిల్లలకు అవసరమైన సహాయాన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే, వారి అభివృద్ధి మరియు ఆరోగ్యంపై అంత మంచి ప్రభావం ఉంటుంది. దీనివల్ల వారి పరిస్థితిని మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం పెరుగుతుంది.

మీ పిల్లల వైద్యులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, వారి సంరక్షణలో చురుకుగా భాగస్వామ్యం కావడం వల్ల మీ పిల్లల ఆరోగ్యం మరియు అభివృద్ధికి అవసరమైన సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే మరింత మెరుగైన సంరక్షణ అందించడానికి మీకు సహాయపడుతుంది.

మీ పిల్లల అభివృద్ధి సంబంధిత సవాళ్లకు సంబంధించిన సందేహాలు ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించండి. ఉదాహరణకు, మీ పిల్లల అవసరాన్ని బట్టి పిల్లల న్యూరలాజిస్ట్ లేదా డెవెలప్మెంటల్ పిడియాట్రిషన్ ఎవరిని సంప్రదించాలో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అలాగే, పిల్లల ఎదుగుదల గురించి, అభివృద్ధిలో ఆలస్యాలను ఎలా గుర్తించాలి వంటి విషయాల గురించి కూడా తెలుసుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సరైన మార్గదర్శకత్వం కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

Tags: Diagnosis
Write Blog

Share your experiences with others like you!

English