Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

పిల్లల్లో నేర్చుకునే ఆసక్తిని పెంచడంలో పుస్తకాల ప్రాముఖ్యత

Default Avatar

Ummeed Child Development Center

Also available in: English

Key Takeaways:

  1.   మీ పిల్లలతో కలిసి చదవడం ద్వారా వారికి అభ్యాసం మరియు సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి.
  2.   పుస్తకాలు సృజనాత్మకత, ఊహాశక్తి మరియు భావ వ్యక్తీకరణను ప్రోత్సహిస్తాయి.
  3.   చదివే అలవాటు వల్ల పిల్లల పదజాలం పెరిగి, ఇతరులతో మాట్లాడే నైపుణ్యాలు మెరుగుపడతాయి.
  4.   పుస్తకాలు చదివే మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి, చదవడాన్ని సరదాగా మార్చుకోవడానికి ఈ బుక్‌లెట్ ఉపయోగకరమైన సూచనలను అందిస్తుంది.
  5.   ఈ వనరు ఉమ్మీద్ సంస్థ సహకారంతో రూపొందించబడింది.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [555.98 KB]

పిల్లల అభ్యాసంలో పుస్తక పఠనం ప్రాముఖ్యత

మీ పిల్లలతో కలిసి పుస్తకాలు చదవడం వారి నేర్చుకునే సామర్థ్యం మరియు సంభాషణ నైపుణ్యాలపై  సానుకూల ప్రభావం చూపుతుంది. కథలను కలిసి చదవడం కేవలం సరదా కార్యక్రమం మాత్రమే కాదు, మీ పిల్లల అభివృద్ధికి తోడ్పడే శక్తివంతమైన మార్గం కూడా. 

ఉమ్మీద్ సంస్థ సహకారంతో రూపొందించిన పుస్తక పఠనం ప్రాముఖ్యతకు సంబంధించిన ఈ బుక్‌లెట్, పుస్తకాలు పిల్లల అభ్యాసానికి కొత్త మార్గాలను ఎలా చూపిస్తాయో వివరిస్తుంది. పిల్లలకు చదవడంపై ఆసక్తి పెంచి, పుస్తకాలు చదవడంలోని ఆనందాన్ని పరిచయం చేయడానికి ఉపయోగపడే ఆచరణాత్మక సూచనలను కూడా అందిస్తుంది.

పుస్తకాలు చదవడం ఎందుకు ముఖ్యము

పుస్తకాలు చదివే అలవాటు మీ పిల్లల సమగ్ర అభివృద్ధికి మరియు సామాజిక సంభాషణ నైపుణ్యాలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యమైన ప్రయోజనాలలో కొన్ని ఇవి:

  • భాష మరియు పదజాలం అభివృద్ధి: క్రమం తప్పకుండా చదవడం వల్ల కొత్త పదాలు నేర్చుకోవచ్చు మరియు అర్థం చేసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది.
  • సృజనాత్మకత మరియు ఊహాశక్తి: కథలు పిల్లలను కొత్త ప్రపంచాలకు పరిచయం చేసి, రోజువారీ అనుభవాలకు మించి ఆలోచించేలా ప్రోత్సహిస్తాయి.
  • భావ వ్యక్తీకరణ: పుస్తకాలు పిల్లలు తమ భావాలను గుర్తించి, ఆరోగ్యకరమైన విధంగా వ్యక్తపరచడంలో సహాయపడతాయి.
  • అనుబంధం మరియు సామాజిక నైపుణ్యాలు: కలిసి చదవడం ద్వారా తల్లిదండ్రులు–పిల్లల మధ్య బంధం బలపడుతుంది. అలాగే వినడం, తమ వంతు వచ్చినప్పుడు మాట్లాడడం  వంటి సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.

ఈ బుక్‌లెట్‌  లో ఏమి ఉంది

ఈ వనరు క్రింది అంశాలపై మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది:

  • పిల్లలు నేర్చుకోవడంలో పఠనం ఎలా తోడ్పడుతుంది? : కలిసి చదవడం ద్వారా పిల్లల్లో శ్రద్ధ, అర్థం చేసుకునే సామర్థ్యం, సంభాషణ నైపుణ్యాలు మరియు ఆత్మవిశ్వాసం ఎలా క్రమంగా పెరుగుతాయో ఇందులో వివరించబడింది.
  • పుస్తకాలు చదివే మంచి పద్ధతులు: పిల్లల ఆసక్తులు మరియు శక్తి స్థాయికి అనుగుణంగా, ఒత్తిడి లేకుండా ఆనందాన్ని కలిగించేలా ప్రతిరోజూ పుస్తకాలు చదివే అలవాటును ఎలా పెంపొందించాలో ఈ బుక్‌లెట్‌ లో సూచనలు ఉన్నాయి.
  • చదవడాన్ని సరదాగా మరియు ఆసక్తికరంగా మార్చడం: పుస్తకాల్లోని బొమ్మలను చూపించడం, పిల్లలను ఆలోచింపజేసే ప్రశ్నలు అడగడం, వారికి ఇష్టమైన పుస్తకాలను మళ్లీ మళ్లీ చదవడం, వారి ఆసక్తికి అనుగుణంగా కథలను కొనసాగించడం వంటి సృజనాత్మక సూచనలను అందిస్తుంది.

కుటుంబాలకు తోడ్పాటు

ఈ బుక్‌లెట్‌  ఉమ్మీద్ సంస్థ సహకారంతో రూపొందించబడింది. నత్తిగా మాట్లాడటం ను ఎలా నిర్వహించుకోవాలో ఉపయోగపడే సూచనల కోసం ఈ వనరును కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

గమనిక: ఈ విషయ వివరణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం దయచేసి అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English