Skip to main content
Install App
If you're using:

పిల్లల్లో ఎదురుచూడడం మరియు తమ వంతు కోసం వేచిచూడగల సామర్థ్యాన్ని పెంచడం

Default Avatar

Nayi Disha Team

इस भाषा में उपलब्ध है हिंदी English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

  1. వంతులు మార్చుకోవడం అనేది కఠినమైన నియమాలతో కాకుండా ఆటలు మరియు ఆకర్షణీయమైన కార్యకలాపాల ద్వారా పెరుగుతుంది.
  2. ఆటలు, కథలు చెప్పడం, మరియు వివిధ కార్యకలాపాలు ఎదురుచూడడాన్ని సులభతరం చేస్తాయి.
  3. చిన్నచిన్న పాఠ్య భాగాలను చదవడం ద్వారా సమయానుగుణంగా ఓర్పు పెరుగుతుంది.
  4. ప్రోత్సాహం మరియు ప్రశంసలు ఎదురుచూడడాన్ని ఒక సానుకూల అనుభవంగా మారుస్తాయి.
  5. విజువల్ షెడ్యూల్స్ (దృశ్య సహాయాలు) మరియు టైమర్లు స్పష్టమైన అంచనాలను ఏర్పరుస్తాయి.
  6. పిల్లలు ఎదురుచూస్తున్నప్పుడు ఆసక్తిగా ఉండేందుకు సహాయక మార్గదర్శకత్వం దోహదపడుతుంది.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [408.21 KB]

తమ వంతు కోసం ఎదురుచూడటం నేర్పించడం: సహనం మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించడం 

వేచి ఉండడం మరియు తమ వంతు కోసం ఎదురుచూడడం అనేవి పిల్లలకు సామాజిక పరస్పర చర్యలు మరియు రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి అవసరమైన ముఖ్యమైన నైపుణ్యాలు. ఈ నైపుణ్యాలు తోటిపిల్లలు స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు ఇతరులతో సులభంగా మెలగడానికి సహాయపడతాయి. అలాగే, కలిసి చేసే కార్యకలాపాలను మరింత ఆనందంగా మరియు ఒత్తిడి లేకుండా ఆస్వాదించడానికి దోహదపడతాయి. ఆటిజం ఉన్న పిల్లలకు, ఈ నైపుణ్యాలు అభివృద్ధి చెందడానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే, అవగాహన, సహనం మరియు సరైన మద్దతు అందిస్తే, వారు క్రమంగా వివిధ పరిస్థితుల్లో వేచి ఉండడం మరియు తమ వంతు కోసం ఎదురుచూడడం నేర్చుకోగలుగుతారు.

ఈ ప్రక్రియలో ప్రధాన లక్ష్యం పిల్లలను అంచనాలకు అనుగుణంగా ప్రవర్తించేలా చేయడం కాదు. ప్రతి పిల్లలు తమదైన వేగంలో, ప్రత్యేక అభివృద్ధి ప్రయాణంలో ముందుకు సాగేందుకు అవసరమైన మార్గదర్శకత్వం మరియు మద్దతు అందించడమే అని గమనించాలి. ఆటిజం ఉన్న పిల్లలు ఇంద్రియ (సెన్సరీ) అనుభవాలు, సామాజిక పరస్పర చర్యలు మరియు వ్యక్తిగత అవసరాల విషయంలో ఇతర పిల్లలకంటే భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల, పిల్లలు విజయవంతం కావడానికి సహాయకమైన, అర్థం చేసుకునే వాతావరణాన్ని సృష్టించడం అత్యంత ముఖ్యమైనది

వేచి ఉండడం మరియు తమ వంతు కోసం ఎదురుచూడడం ఎందుకు ముఖ్యమైనవి?

వేచి ఉండడం మరియు వంతు కోసం ఎదురుచూడడం పిల్లలు ఇతరులతో సానుకూలంగా మెలగడానికి అవసరమైన ముఖ్యమైన సామాజిక నైపుణ్యాలు.

  • ఈ నైపుణ్యాలు పాఠశాలలో, ఆటస్థలాల్లో, ఇంట్లో మరియు ఇతర రోజువారీ పరిస్థితుల్లో తరచుగా అవసరమవుతాయి.
  • ఇవి పిల్లల్లో సహనం మరియు ఇతరుల భావాలను అర్థం చేసుకునే గుణం పెంపొందించడంలో సహాయపడతాయి. ఈ రెండు గుణాలు ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి, ఇతరులతో కలిసి ఆడుకోవడానికి, మరియు కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఎంతో అవసరం.
  • అలాగే,ఈ నైపుణ్యాలు ఇతరులతో కలిసి పంచుకునే సమయాన్ని ఉపయోగించడం నేర్పుతాయి, దాంతో పిల్లల్లో కలిసిపోయే మరియు తమను చేర్చుకున్నారనే భావనను పెంపొందిస్తాయి.

అయితే, ఆటిజం ఉన్న పిల్లల్లో తమ వంతు కోసం వేచి ఉండడం లేదా కోరుకున్నది వెంటనే లభించకపోయినా అర్ధం చేసుకోవడం అనేది ఇతర పిల్లలతో పోలిస్తే భిన్నంగా ఉండవచ్చు కొన్నిసార్లు, వారు  ఆలోచించకుండా వెంటనే స్పందించడం లేదా తాము కోరుకున్నది వెంటనే దొరకకపోతే నిరాశ చెందడం వంటి సవాళ్లను ఎదుర్కోవచ్చు. అలాగే, ఇంద్రియ సున్నితత్వం కారణంగా, ముఖ్యంగా రద్దీగా ఉండే లేదా ఎక్కువ శబ్దం, వెలుతురు లేదా ఇతర ప్రేరణలు  ఉన్న వాతావరణంలో, వేచి ఉండడం లేదా ఒకే చోట ప్రశాంతంగా కూర్చోవడం వారికి మరింత కష్టంగా అనిపించవచ్చు.

ప్రతి పిల్లలు ఈ నైపుణ్యాలను తమకు తాముగా, తమదైన వేగంలో అభివృద్ధి చేసుకుంటారని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అభివృద్ధి ప్రతి ఒక్కరిలో భిన్నంగా కనిపించవచ్చు, అది సహజమైనది. ముఖ్యమైనది ఏమిటంటే, అభివృద్ధిని ప్రోత్సహించే, సహనాన్ని పెంపొందించే, సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం.

పిల్లల్లో వేచి ఉండడం మరియు తమ వంతు కోసం ఎదురుచూడడం నేర్పించే సూచనలు

సరైన మద్దతు మరియు ప్రోత్సాహం అందిస్తే, ఆటిజం ఉన్న పిల్లలు కూడా తమకు అనుకూలమైన విధంగా వేచి ఉండడం మరియు వంతు కోసం ఎదురుచూడడం క్రమంగా నేర్చుకోగలుగుతారు. ఈ నైపుణ్యాలను పెంపొందించడానికి సహాయపడే కొన్ని సులభమైన సూచనలు ఇవి 

  • తమ వంతు కోసం ఎదురుచూసే నిర్మాణాత్మక కార్యకలాపాల్లో పాల్గొనడం
    తమ వంతు కోసం ఎదురుచూడడం పిల్లలకు నేర్పించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి. బోర్డ్ గేమ్స్, కార్డు గేమ్స్, బృందాలుగా ఏర్పడి కథలు చెప్పడం వంటి ఆటలు, పిల్లలను వంతు కోసం ఎదురుచూసి, ఇతరులతో కలిసి పాల్గొనడానికి సహాయపడతాయి.

    ఉదాహరణకు కబడ్డీ ఆట ద్వారా పిల్లలు సూచనలకు ఎదురుచూడడం, ఆదేశాలను పాటించడం, మరియు ఆటలో ఆసక్తిగా ఉండడం నేర్చుకుంటారు.
  • పుస్తకాల ద్వారా ఎదురుచూడాలనే ఆసక్తిని పరిచయం చేయడం
    పుస్తకాలను చిన్న చిన్న భాగాలుగా చదవడం ద్వారా పిల్లల్లో తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తిని పెంపొందించవచ్చు. దీని ద్వారా, ఏదైనా ఆసక్తికరమైన విషయం కోసం కొంతసేపు వేచి ఉండడం అనే భావనను పిల్లలు క్రమంగా అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు, ఒక పేజీ చదివిన తర్వాత కొద్దిసేపు ఆపి, “తర్వాత ఏమి జరుగుతుంది?” అని పిల్లలను ఆలోచించేలా ప్రోత్సహించండి. ఇలా చేయడం వల్ల, వేచి ఉండడం కూడా ఒక ఆనందకరమైన అనుభవమని పిల్లలు క్రమంగా గ్రహిస్తారు. కాలక్రమేణా, ఇది వారి సహనంతో పాటు, తమ భావోద్వేగాలను నియంత్రించుకునే నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.
  • చిన్న చిన్న విజయాలను గుర్తించి, సానుకూల ప్రోత్సాహం  అందించండి
    వేచి ఉండడం అనే అనుభవాన్ని పిల్లలకు సానుకూలంగా మార్చడం చాలా ముఖ్యం. పిల్లలు చేసే చిన్న ప్రయత్నాలను మరియు విజయాలను గుర్తించి అభినందించడం ద్వారా, వారు ఆ ప్రవర్తనను కొనసాగించడానికి ప్రోత్సాహం పొందుతారు. ఉదాహరణకు, ఒక ఆటలో పిల్లలు తమ వంతు కోసం ప్రశాంతంగా వేచి ఉంటే, వారిని ఇలా ప్రోత్సహించవచ్చు: “నీ వంతు కోసం చక్కగా వేచి ఉన్నావు.” “నువ్వు చాలా ఓపికగా ఉన్నావు.” ఇలాంటి సానుకూల ప్రోత్సాహం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు ఈ నైపుణ్యాలను మరింత సాధన చేయడానికి వారిని ప్రేరేపిస్తుంది.
  • స్పష్టమైన నిర్మాణం కోసం దృశ్య సూచనలు/సహాయాలు  మరియు టైమర్‌లను ఉపయోగించండి
    ఆటిజం ఉన్న పిల్లలు సాధారణంగా స్పష్టమైన అంచనాలు మరియు స్థిరమైన పద్ధతులు ఉన్న వాతావరణంలో మరింత సౌకర్యంగా నేర్చుకోగలుగుతారు. దృశ్య సహాయాలు/సూచనలు (విజువల్ షెడ్యూల్‌లు) లేదా టైమర్‌లు ఉపయోగించడం ద్వారా, పిల్లలకు ఎప్పుడు వేచి ఉండాలి, ఎప్పుడు వారి వంతు వస్తుంది అనే విషయాలను స్పష్టంగా అర్థమయ్యేలా చేయవచ్చు. దృశ్య సూచనలు పిల్లలకు కార్యకలాపాలు ఏ క్రమంలో జరుగుతాయి మరియు తమ వంతు ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. దీనివల్ల ఆందోళన మరియు గందరగోళం తగ్గుతాయి. ఉదాహరణకు, ఒక టైమర్ ఉపయోగించి “నీ వంతు రావడానికి ఇంకా ఎంత సమయం ఉంది” అనే విషయాన్ని చూపించడం ద్వారా, పిల్లలు సమయాన్ని అర్థం చేసుకోవడానికి మరియు పరిస్థితిపై కొంత నియంత్రణ ఉందనే భావన కలిగి ఉండడానికి సహాయపడుతుంది.

నిర్మాణాత్మక కార్యకలాపాలు, సానుకూల ప్రోత్సాహం, దృశ్య షెడ్యూల్‌లు మరియు రోజువారీ సాధనలను కలిపి ఉపయోగించడం ద్వారా, ఆటిజం ఉన్న పిల్లలు క్రమంగా వేచి ఉండడం మరియు వంతు కోసం ఎదురుచూడడం వంటి నైపుణ్యాల్లో మరింత సౌకర్యంగా మారగలుగుతారు. ఈ నైపుణ్యాలు పిల్లలకు కేవలం సామాజిక పరస్పర చర్యల్లోనే కాకుండా, సహనం, స్వీయ నియంత్రణ , సహకారం వంటి జీవితాంతం ఉపయోగపడే ముఖ్యమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో కూడా సహాయపడతాయి.

ప్రతి పిల్లలు ప్రత్యేకమైనవారు. వారి ప్రత్యేక అవసరాలు, ఆసక్తులు మరియు ఇంద్రియ సున్నితత్వాలను పరిగణనలోకి తీసుకుని, వారికి సరిపోయే వ్యక్తిగత ప్రణాళికను రూపొందించడం చాలా ముఖ్యం. అవగాహన, సహనం మరియు సానుకూల అనుభవాలను అందించాలనే ఆలోచనతో, ఆటిజం ఉన్న పిల్లలు ఈ ముఖ్యమైన సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు మరియు ప్రతి దశలో వారికి అవసరమైన మద్దతు లభించేలా మనం సహాయపడవచ్చు.

ఆటిజం ఉన్న పిల్లల్లో ఆసక్తి మరియు ప్రేరణను పెంపొందించడంలో సహాయపడే మా ఇన్ఫోగ్రాఫిక్‌ను కూడా చూడండి. ఇది మీకు ఉపయోగకరమైన సూచనలు అందించవచ్చు. 

ఈ విషయ వివరణను కూడా చదవండి: ఎంగేజ్‌డ్ సిట్టింగ్ కార్యకలాపాలలో సౌకర్యాన్ని మరియు ఏకాగ్రతను పెంపొందించడానికి సూచనలు

కృతజ్ఞతలు: ఈ ఇన్ఫోగ్రాఫిక్‌కి సమాచారాన్ని అందించడంలో సహకరించినందుకు రేణు కె. మనిష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సరైన మార్గదర్శకత్వం కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి 

ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी