Skip to main content
Install App
If you're using:

ప్రత్యేక అవసరాలున్న పిల్లల థెరపిస్టుకు కావలసిన అర్హతలు

Default Avatar
Nayi Disha Team
Also available in: हिंदी English
Like Icon 0Likes
Download Icon 0 Downloads

Key Takeaways:

  1. థెరపీ విభిన్నంగా ఉంటుంది – వివిధ రకాల నిపుణులు పిల్లల అభివృద్ధి మరియు అభ్యాస అవసరాలకు తగిన విధంగా సహాయం చేస్తారు.
  2. అర్హతలను తెలుసుకోవడం – థెరపిస్ట్ పాత్రలను అర్థం చేసుకోవడం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
  3. సమగ్ర దృక్పథం – సహాయం అనేది వైద్య, అభివృద్ధి, మరియు అభ్యాస నిపుణులను ఏకీకృతం చేస్తుంది
  4. న్యూరోఅఫర్మింగ్ కేర్ – బలాలు, కమ్యూనికేషన్, మరియు రోజువారీ జీవన నైపుణ్యాలపై దృష్టి పెట్టడం.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.95 MB]

ఎక్కడి నుండి ప్రారంభించాలి: మీ పిల్లల కోసం థెరపిస్టుల పాత్రను అర్థం చేసుకోవడం.

పిల్లవాడికి మేధో వైకల్యం లేదా అభివృద్ధి లోపం అని నిర్ధారణ అయినప్పుడు, కుటుంబ సభ్యులు తరచుగా “థెరపీ” అనే పదాన్ని ఎక్కువగా వింటారు. కానీ ఎన్నో రకాల థెరపిస్టులు, సేవలు ఉండటంతో, అయోమయంగా లేదా ఒత్తిడిగా అనిపించడం సహజం.

థెరపిస్టులు మీ బిడ్డ అభివృద్ధిని సమర్ధవంతంగా మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించగలరు. కానీ ప్రతి బిడ్డకు ప్రతి థెరపీ అవసరం ఉండకపోవచ్చు. సరైన విధానం మీ బిడ్డ అవసరాలు, ఆసక్తులు, వయస్సు మరియు సౌకర్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ మార్గదర్శిని కుటుంబాలు సాధారణంగా కలిసే నిపుణులపై త్వరిత అవగాహనను ఇవ్వడానికి, అలాగే వారు పిల్లల అభివృద్ధికి వివిధ రంగాలలో ఎలా సహాయపడగలరో వివరించడానికి రూపొందించబడింది.

అన్ని సమాధానాలు వెంటనే తెలియకపోయినా పరవాలేదు. లక్ష్యం మీ బిడ్డను “సరిచేయడం” కాదు. వారి వికాసానికి, ఉపయోగకరమైన నైపుణ్యాలను నేర్చుకోవడానికి, మరియు వారిని వారు తమ స్వంత విధానంలో వ్యక్తపరచడానికి సహాయపడటమే.

మానసిక మరియు అభివృద్ధి లోపాలు ఉన్న పిల్లలకు వివిధ రకాల థెరపిస్టుల సహాయం ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే, ఎవరిని సంప్రదించాలి, వారికి ఉన్న అర్హతలు ఏమిటి అనే విషయంలో తల్లిదండ్రులు అయోమయానికి గురికావచ్చు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, వివిధ రకాల థెరపిస్టులు మరియు వారి పాత్రలపై స్పష్టమైన సమాచారాన్ని అందించడం నయీ దిశా లక్ష్యం.

వివిధ రకాల థెరపిస్టులు, వైద్య నిపుణులు మరియు వారి అర్హతలు

ఇది మీ ప్రయాణంలో మీరు కలుసుకోబోయే నిపుణులపై ఒక త్వరిత మార్గదర్శిని, అలాగే వారి సాధారణ అర్హతలపై సమాచారం. ఈ నిపుణులు మీ బిడ్డ అభివృద్ధి, అభ్యాసం, ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు విభిన్న రకాలుగా మద్దతు ఇస్తారు.

ఆడియాలజిస్ట్ 

అర్హత: ఆడియాలజీ లేదా స్పీచ్ & హియరింగ్‌లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ (BASLP/MASLP)

పాత్ర: వినికిడి సంభందిత అవసరాలు లేదా వినికిడి ప్రక్రియలో లోపాలు ఉన్న వ్యక్తులను అంచనా వేసి సహాయం చేస్తారు. వినికిడి పరికరాలు, లిసనింగ్ థెరపీలపై మార్గదర్శకత్వం అందిస్తారు.

బిహేవియరల్ థెరపిస్ట్ 

అర్హత: అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ (ABA) లేదా సంబంధిత రంగాల్లో శిక్షణ (సైకాలజీ, స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా సోషల్ వర్క్‌లో డిగ్రీలు కలిగి ఉండవచ్చు)

పాత్ర: ముఖ్యంగా ఆటిజం లేదా ADHD ఉన్న పిల్లల్లో సానుకూల ప్రవర్తనలు, స్వీయ నియంత్రణ మరియు ఒత్తిడిని తగ్గించే నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తారు.

build resilience.

కౌన్సిలర్

అర్హత: కౌన్సెలింగ్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ లేదా మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్‌లో పీజీ డిప్లొమా లేదా మాస్టర్స్ డిగ్రీ

పాత్ర: భావోద్వేగ సహాయం (ఎమోషనల్ సపోర్ట్), మార్గదర్శకత్వం అందిస్తూ పిల్లల భావాలను అర్థం చేసుకుని వ్యక్తీకరించేందుకు సురక్షితమైన వాతావరణం కల్పించి, ధైర్యాన్ని పెంపొందించడంలో సహాయపడతారు.

డెర్మటాలజిస్ట్ (చర్మ రోగ నిపుణుడు)

అర్హత: డెర్మటాలజీలో MBBS + MD 

పాత్ర: ఎగ్జిమా, దద్దుర్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి చర్మ సమస్యలను గుర్తించి చికిత్స చేస్తారు.

డెవలప్మెంటల్ పీడియాట్రిషన్ 

అర్హత: పీడియాట్రిక్స్‌లో MBBS + MD/DNB + డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్‌లో అదనపు ఫెలోషిప్

పాత్ర: అభివృద్ధి ఆలస్యం, ఆటిజం, ADHD, అభ్యాస వ్యత్యాసాలు వంటి పరిస్థితులను అంచనా వేసి సహాయం అందిస్తారు.

డిస్లెక్సియా థెరపిస్ట్ 

అర్హత: ఆర్టన్-గిల్లింగ్‌హామ్, బార్టన్ వంటి స్ట్రక్చర్డ్ లిటరసీ ప్రోగ్రామ్‌లలో సర్టిఫికేషన్, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేదా రిమీడియల్ థెరపిస్టులు కూడా కావచ్చు

పాత్ర: చదవడం, రాయడం, మరియు అక్షరదోషాలలో(స్పెల్లింగ్) ఇబ్బందులు ఎదుర్కొనే పిల్లలకు సహాయం చేస్తారు.

ఎండోక్రినాలజిస్ట్

అర్హత: ఇంటర్నల్ మెడిసిన్‌లో MBBS + MD + ఎండోక్రైనాలజీలో DM 

పాత్ర: ఎదుగుదల సమస్యలు, థైరాయిడ్, మధుమేహం వంటి హార్మోన్ సంబంధిత సమస్యలను గుర్తించి చికిత్స చేస్తారు.

ఫైనాన్షియల్ కన్సల్టెంట్ (ఆర్థిక సలహాదారు)

అర్హత: చార్టర్డ్ అకౌంటెంట్ (CA), సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (CFP) లేదా ఇతర సంబంధిత ఆర్థిక సర్టిఫికేషన్లు

పాత్ర: మీ బిడ్డ భవిష్యత్తు అవసరాల కోసం – పొదుపు, ఇన్సూరెన్స్, లీగల్ గార్డియన్ షిప్ మొదలైన అంశాలపై ప్రణాళిక సిద్ధం చేయడంలో సహాయం చేస్తారు.

గైనకాలజిస్ట్

అర్హత: ప్రసూతి మరియు గైనకాలజీలో MBBS + MD/MS 

పాత్ర: రుతుస్రావ ఆరోగ్యం, యౌవన దశ సమస్యలు, మరియు పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో సహాయం చేస్తారు.

సైకాలజిస్ట్ (మానసిక నిపుణుడు)

అర్హత: క్లినికల్ సైకాలజీ లేదా కౌన్సెలింగ్ సైకాలజీలో మాస్టర్స్ లేదా ఎంఫిల్

పాత్ర: ఐ.క్యూ, అభ్యాస మూల్యాంకనాలు(లెర్నింగ్ ఎస్సెస్మెంట్స్), భావోద్వేగ అంచనాలు వంటివి నిర్వహించి, థెరపీ మరియు భావోద్వేగ సహాయాన్ని అందిస్తారు. సైకాలజిస్టులు ఔషధాలు సూచించరు.

రిక్రియేషనల్ థెరపిస్ట్ 

అర్హత: థెరప్యూటిక్ రిక్రియేషన్ లేదా శిశు అభివృద్ధిలో శిక్షణ సంబంధిత రిక్రియేషన్ థెరపీ బోర్డుల నుండి సర్టిఫికేషన్ ఉండవచ్చు

పాత్ర: ఆటలు, కళ, సంగీతం మరియు క్రీడల ద్వారా చికిత్స, సామాజిక నైపుణ్యాల అభివృద్ధి మరియు ఆనందాన్ని పెంపొందిస్తారు.

రెమీడియల్ ఎడ్యుకేటర్ (ప్రత్యేక విద్యా నిపుణుడు)

అర్హత: స్పెషల్ ఎడ్యుకేషన్, రెమీడియల్ ఎడ్యుకేషన్ లేదా లెర్నింగ్ డిసెబిలిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా

పాత్ర: చదవడం, రాయడం, గణితం మరియు తరగతి గదిలో ఎదురయ్యే సవాళ్లకు వ్యక్తిగత విద్యా సహాయాన్ని అందిస్తారు.

షాడో టీచర్ (సహాయక ఉపాధ్యాయుడు)

అర్హత: సైకాలజీ, ఎడ్యుకేషన్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బ్యాక్‌గ్రౌండ్, ఉద్యోగంలో శిక్షణ (ఆన్-ది-జాబ్ ట్రైనింగ్)

పాత్ర: సాధారణ తరగతులలో పిల్లలు తోటి పిల్లలతో  కలిసి నేర్చుకోవడంలో మరియు పాల్గొనడంలో సహాయం చేస్తారు.

సోషల్ వర్కర్ (సామాజిక కార్యకర్త)

అర్హత: సోషల్ వర్క్‌లో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ (BSW/MSW)

పాత్ర: సేవలు, ప్రభుత్వ పథకాలు, థెరపీ సూచనలు మరియు హక్కుల కోసం కుటుంబాలను అనుసంధానిస్తారు. మరియు వారికి మద్దతును అందిస్తారు.

స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ (SEN) టీచర్ (ప్రత్యేక విద్యా అవసరాల ఉపాధ్యాయుడు)

అర్హత: స్పెషల్ ఎడ్యుకేషన్‌లో B.Ed. లేదా M.Ed., లేదా సంబంధిత SEN సర్టిఫికేషన్లు

పాత్ర: వ్యక్తిగత విద్యా ప్రణాళికలు (IEPs) రూపొందించి, అభ్యాస మరియు అభివృద్ధి అవసరాలు ఉన్న పిల్లలకు బోధిస్తారు.

స్పీచ్ థెరపిస్ట్ 

అర్హత: BASLP/MASLP (ఆడియాలజీ మరియు స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీలో బాచిలర్ / మాస్టర్)

పాత్ర: మాటల స్పష్టత, భాష అర్థం చేసుకోవడం, కమ్యూనికేషన్ పరికరాల వినియోగం, అలాగే తినడం/మింగడం వంటి నైపుణ్యాలలో సహాయం చేస్తారు.

డిసేబిలిటీ స్పోర్ట్స్ కోచ్ (వికలాంగుల క్రీడల కోచ్)

అర్హత: అడాప్టివ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా స్పెషల్ నీడ్స్ కోచింగ్‌లో డిప్లొమా లేదా సర్టిఫికేషన్

పాత్ర: సమ్మిళిత క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, జట్టు కృషి (టీం వర్క్) మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు.

విజన్ థెరపిస్ట్

అర్హత: విజన్ థెరపీపై ప్రత్యేక శిక్షణ పొందిన ఆప్టోమెట్రిస్ట్ లేదా నేత్రవైద్యుడు.

పాత్ర: విజువల్ ట్రాకింగ్, కంటి–చేతి సమన్వయం (ఐ-హ్యాండ్ కోఆర్డినేషన్), విజువల్-మోటార్ నైపుణ్యాలు మెరుగుపరచడంలో ముఖ్యంగా నేర్చుకోవడంలో ఇబ్బందులు లేదా ఇంద్రియ (సెన్సరీ) సంబంధిత సవాళ్లు ఉన్న పిల్లల కోసం సహాయం చేస్తారు.

యోగ థెరపిస్ట్ 

అర్హత: ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం చికిత్సాత్మక యోగాలో శిక్షణ పొందిన సర్టిఫైడ్ యోగా థెరపిస్ట్.

పాత్ర: శరీర కదలికలు, శ్వాస వ్యాయామాలు, విశ్రాంతి పద్ధతుల ద్వారా పిల్లల శారీరక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తారు.

మరిన్ని వివరాల కోసం, ఆటిజం‌లో ప్రత్యామ్నాయ థెరపీలు ను కూడా పరిశీలించవచ్చు

ప్రత్యేక అవసరాలున్న మీ పిల్లలకు సరైన థెరపిస్ట్‌ను ఎలా ఎంచుకోవాలి?

సరైన థెరపిస్ట్‌ను ఎంచుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మీ అవసరానికి ఉపయోగపడే కొన్ని సులభమైన సూచనలు ఇవి:

  • మీ పిల్లలో స్పష్టంగా కనిపించే అవసరాల నుండే ప్రారంభించండి – ఉదాహరణకు, స్పీచ్, కదలిక (మోటార్) నైపుణ్యాలు లేదా భావోద్వేగ సహాయం (ఎమోషనల్ సపోర్ట్).
  • మీ పిల్లల లాంటి అవసరాలు లేదా నిర్ధారణలు ఉన్న పిల్లలతో ఆ థెరపిస్ట్‌కు ఉన్న అనుభవం గురించి తెలుసుకోండి.
  • మొదటి సెషన్‌లలో మీ బిడ్డ ఎలా స్పందిస్తున్నాడో గమనించండి – సరైన ఫలితం రాకపోతే థెరపిస్ట్‌ను మార్చడం తప్పు కాదు.
  • తల్లిదండ్రి లేదా సంరక్షకుడిగా మీ మనసు మాటను వినండి– మీ పిల్లలను మీరు మాత్రమే బాగా తెలుసుకోగలరు.

మీ పిల్లల వైద్యుడితో (పిడియాట్రిషన్) లేదా అభివృద్ధి నిపుణుడితో మాట్లాడి సూచనలు, మార్గదర్శకత్వం పొందవచ్చు.

థెరపిస్టుల నుండి ఏమి ఆశించాలి?

మీ పిల్లల థెరపిస్ట్‌తో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కొంత సమయం పడుతుంది. సహాయక థెరపీ అనుభవంలో భాగంగా ఏమేమి ఉండవచ్చో ఇక్కడ ఉంది:

  • సమిష్టిగా లక్ష్యాలు నిర్ణయించుకోవడం – మీ పిల్లల వేగానికి తగ్గ చిన్న సరళమైన దశలను రూపొందించడం.
  • పురోగతి మరియు సవాళ్లపై చర్చించేందుకు క్రమం తప్పకుండా థెరపిస్ట్ ను సంప్రదించడం.
  • మీ పిల్లల బలాలు, ఆసక్తులు మరియు సౌలభ్యతల ఆధారంగా సులభ పద్దతులను ఎంచుకోవడం.
  • నిరంతర అభ్యాసం కోసం కుటుంబ సభ్యులు ఇంట్లో సులభంగా చేయగలిగే కార్యకలాపాలను ప్రోత్సహించడం

గుర్తుంచుకోండి: థెరపీ అనేది పందెం కాదు. అది మీ బిడ్డ తన స్వంత వేగంలో ఎదగడానికి సురక్షితమైన, ప్రోత్సహించే వాతావరణాన్ని కలిసికట్టుగా సృష్టించుకోవడం.

తరచుగా థెరపీలు కష్టమైన అంశాలపై దృష్టి పెడతాయి – కానీ మీ బిడ్డ యొక్క ప్రత్యేక ప్రతిభను మాత్రం మర్చిపోవద్దు. మేధో మరియు అభివృద్ధి వైకల్యాలు ఉన్న పలువురు పిల్లలు ఎంతో కరుణ, బలమైన జ్ఞాపకశక్తి, సృజనాత్మక, సమస్య పరిష్కార నైపుణ్యం లేదా అద్భుతమైన హాస్యబుద్ధి చూపుతారు. ఈ బలాలు వారు ఎలా నేర్చుకుంటారు, ఎదుగుతారు, ప్రపంచంతో ఎలా మెలుగుతారు అన్న దానికి పునాదిగా నిలుస్తాయి.

థెరపిస్టులు వారి సవాళ్ల చుట్టూ పని చేయడం కాకుండా మీ బిడ్డ బలాలను ఆధారంగా తీసుకుని పనిచేయాలని కోరండి.

 మీ మొదటి సెషన్‌లో ఏమి అడగాలి?

మీ బిడ్డ మొదటి థెరపీ సెషన్‌కి వెళ్లే ముందు కంగారు లేదా అనిశ్చితిగా అనిపించడం సహజమే – చాలా కుటుంబాలు తాము సరిగా చెబుతున్నామా, “సరైన” పని చేస్తున్నామా అని ఆలోచిస్తుంటాయి. ఇందులో మీరు ఒంటరిగా లేరు. థెరపిస్టులు మీ దగ్గర అన్ని సమాధానాలు ఉంటాయని ఎప్పుడూ భావించరు. “నేను ఏమి అడగాలో అర్థం కావడం లేదు” లేదా “ఏం జరుగుతుందో మీరు నాకు అర్థం చేసుకునేలా చెప్పగలరా?” అని చెప్పడం పూర్తిగా సబబే. మీరు ఇలా కూడా ప్రారంభించవచ్చు:

  • నా బిడ్డ యొక్క కమ్యూనికేషన్‌ లేదా ప్రవర్తన గురించి మీరు ఏమి గమనిస్తున్నారు?
  • పిల్లలతో నమ్మకం ఏర్పరచుకోవడానికి మీరు ఎలా ముందుకు వెళ్తారు?
  • తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుండి మీరు ఎలాంటి భాగస్వామ్యాన్ని ఆశిస్తారు?

ఈ ప్రశ్నలు మీరు మరింత మద్దతుగా మరియు స్పష్టమైన సమాచారంతో ఉండడానికి సహాయపడతాయి.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ. డి హెచ్.డి. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

కృతజ్ఞతలు: ఈ వ్యాసంలోని సమాచారాన్ని ధృవీకరించిన నిపుణులు జితేంద్ర సోలంకి, రెను మనీష్, ఫరీదా రాజ్, అఫ్షాన్ జబీన్, సనా స్మృతి, చిత్ర తడతిల్ మరియు రెబెక్కా గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

DISCLAIMER: Please note that this guide is for information purposes only. Please consult a qualified health practitioner for safe management.

సూచన: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English