Skip to main content

శ్రీమతి స్నేహల్ వైద్య గారు & శ్రీమతి స్నిగ్ధ ఇందుకూరి గారితో కలిసి అభివృద్ధి చేయబడింది.

Ms.Snehal Vaidya

Also available in: हिंदी English
0Likes
0 Downloads

Key Takeaways:

మేము ఈ వ్యాసంలోని ప్రధాన అంశాలను సిద్ధం చేస్తున్నాము. అవి త్వరలో అందుబాటులో ఉంటాయి.

చాలా మంది ప్రత్యేక అవసరాలున్న ఆడపిల్లలకు అనేక రోజువారీ వస్తువులు sensory issues  అనగా జ్ఞానేంద్రియాల అనుభూతి వాళ్ళ కలిగే సమస్యలకు కారణమవుతాయి. ఉదాహరణకు సానిటరీ పాడ్ యొక్క స్పర్శ, ఆకృతి మరియు అనుభూతి మీకు చిన్న విషయమే అయినప్పటికీ, ప్రత్యేక బాలికలకు అది ఒక ఇబ్బందికరమైన అనుభూతిని కలిగించవచ్చు. అలాంటి సందర్భాలలో తల్లిదండ్రులకి ఈ అవసరాల మీద అవగాహన పెంచడం, మరియు వారి బాలికలకు సానిటరీ పాడ్ ని ఎంపిక చేసేటప్పుడు ఆ అవసరాలను తీర్చే విధంగా ఆలోచింపజేయడం ఎంతో ముఖ్యం . వీటితో బాటు మరెన్నో చిట్కాలు పైనున్న ప్రెసెంటేషన్ లో పొందుపరిచాము. ఆక్యుపేషనల్ థెరపీ అనేది వారి వ్యక్తిగత సామర్థ్యాలు లేదా లక్ష్యాల ఆధారంగా పిల్లల రోజువారీ దినచర్యలో వారికి  అనుకూలంగా మార్పులు చేర్పులు చెయ్యడానికి దోహదబడుతుంది. ఇది వారి రోజువారీ కార్యకలాపాలను సులభంగా మరియు హాయిగా  నిర్వహించడానికి వారికి సహాయపడుతుంది.

గమనిక :  ఈ గైడ్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని దయచేసి గమనించండి. సురక్షితమైన నిర్వహణ కోసం దయచేసి అర్హత కలిగిన ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

ఋతు పరిశుభ్రతను   పాటించడానికి చిట్కాలు మరియు ఋతుస్రావం సమస్యలను  పరిష్కరించే మార్గాలు.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర మేధో వైకల్యాల గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి ఆందోళనలు ఉంటే, సహాయం చేయడానికి Nayi Disha బృందం ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996లో సంప్రదించండి. మీరు మాకు కాల్ చేయవచ్చు లేదా whatsappలో సందేశం పంపవచ్చు. మా కౌన్సెలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీతో సహా వివిధ భాషలను మాట్లాడతారు.

 

Write Blog

Share your experiences with others like you!

English