Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

ఫుడ్ డైరీ – పిల్లల ఆహార అవసరాలు, ఇబ్బందులను తెలుసుకోండి

Default Avatar

Nayi Disha Team

Also available in: हिंदी English

Key Takeaways:

  1. ఆహార(ఫుడ్) అలర్జీలు, జీర్ణ సమస్యలు, కొన్ని ఆహారాలు పడకపోవడం వంటి ఇబ్బందులను గుర్తించదానికి ఫుడ్  డైరీ ఉపయోగపడుతుంది.
  2. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు వారి అవసరాలు, అభిరుచులను బట్టి ప్రత్యేకమైన పోషకాహారం అవసరం కావచ్చు.
  3. కొంతమంది పిల్లలకు ముఖ్యంగా నమలడం లేదా మింగడంలో ఇబ్బందులు ఉండవచ్చు దీనివలన వారు ఇతరులకంటే భిన్నంగా ఆహారం తీసుకోవచ్చు.
  4. కొన్ని రకాల ఆహారాలనే తినడం లేదా సెన్సరీ అవసరాలు కూడా పిల్లలకు అందే పోషణపై ప్రభావం చూపవచ్చు.
  5. పిల్లలు తీసుకునే ఆహారాన్ని నమోదు చేయడం ద్వారా వారి అవసరాలకు తగిన ఆహార ప్రణాళికను రూపొందించి, ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [172.50 KB]

ఈ విషయవివరణలో ప్రత్యేక అవసరాలు ఉన్న మీ పిల్లల కోసం ఫుడ్  డైరీని నిర్వహించడం ఎందుకు ముఖ్యమో వివరించడం జరిగింది.

ఫుడ్  డైరీ నిర్వహించడం ఎందుకు ముఖ్యం?

  •  మీ పిల్లల్లో ఏదైనా ఆహార (ఫుడ్) అలర్జీకి సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయా?
  • ఈరోజు తిన్న ఏదైనా ఆహారం వల్ల మీ పిల్లలకు కడుపులో అసౌకర్యం కలుగుతోందా?
  • ఏదైనా ప్రత్యేకమైన ఆహారం వల్ల మీ పిల్లలకు మలబద్ధకం ఏర్పడుతోందా?

ఈ ప్రశ్నలతో పాటు, ఆహారానికి సంబంధించి మీ పిల్లలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పోషకాహార నిపుణులు పరిశీలించి, వాటి కారణాలను గుర్తించగలరు. ఇందుకోసం మీ పిల్లలు తీసుకునే ఆహార వివరాలను క్రమం తప్పకుండా డైరీలో నమోదు చేయాలి.

ప్రత్యేక అవసరాలున్న పిల్లలు తమకు అవసరమైన పోషకాలను పొందడంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవచ్చు.

  • వారికి ఉండే ప్రత్యేకమైన పోషకాహార అవసరాలు లేదా ఆహార ప్రాధాన్యతలు (ఉదా: కొన్ని ఆహార పదార్థాలు పడకపోవడం, మలబద్ధకం, విరేచనాలు) .
  • ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించే శారీరక ఇబ్బందులు (ఆహారాన్ని నమలడం లేదా మింగడంలో ఇబ్బందులు ఎదురవడం.)
  • ఆహారపు అలవాట్లను ప్రభావితం చేసే ప్రవర్తన లేదా సెన్సరీ ఇబ్బందులు (కొన్ని ఆహారాలను మాత్రమే తినడం లేదా సెన్సరీ అవసరాలు)

అందువల్ల, మీ పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటో, వాటి స్వభావం ఎలా ఉందో ఖచ్చితంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఇబ్బందులను గుర్తించడానికి, మీ పిల్లలు ఏ ఆహారం తీసుకుంటున్నారు, దాన్ని ఏ రూపంలో తీసుకుంటున్నారు అనే వివరాలను నమోదు చేయాలి. మీ పిల్లల ఆహారపు అలవాట్లను ఫుడ్ డైరీలో నమోదు చేయడం ద్వారా, వారి అవసరాలకు తగిన ప్రత్యేకమైన ఆహార ప్రణాళికను రూపొందించడంలో కూడా సహాయపడుతుంది.

కృతజ్ఞతలు: ఈ టూల్‌కిట్ ను రూపొందించడంలో సలహాలు, మార్గదర్శకత్వం అందించిన పోషకాహార నిపుణులు శ్రీమతి శ్రుతి కేల్కర్ గారికి మా కృతజ్ఞతలు.

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు ఎదుర్కొనే ఆహార సంబంధిత సమస్యలు, వారి పోషకాహార అవసరాల గురించి తెలుసుకోవడానికి ఈ బుక్‌లెట్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అలాగే, డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల పోషకాహార అవసరాలు, వారు ఎదుర్కొనే సమస్యల గురించి తెలుసుకోవడానికి ఈ రెండవ బుక్‌లెట్‌ను కూడా చూడవచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఇది వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. నిర్ధారణ మరియు చికిత్స కోసం అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

Tags: Nutrition
Write Blog

Share your experiences with others like you!

English