Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

సకాలంలో గుర్తింపు, తోడ్పాటు పిల్లల ఎదుగుదలకు దోహదం చేస్తాయి

Default Avatar

Ummeed Child Development Center

Also available in: English
Like Icon 0Likes

Key Takeaways:

  1. ప్రారంభ దశలో పిల్లలతో అనుబంధం మరియు పరస్పర చర్యలు, వారి సంపూర్ణ అభివృద్ధికి దోహదపడతాయి.
  2. పిల్లల జీవితంలోని మొదటి కొన్ని సంవత్సరాలు మెదడు అభివృద్ధికి బలమైన పునాది వేయడంలో కీలకమైనవి. ముఖ్యంగా అదనపు సహాయం అవసరమైన పిల్లలకు ఇది మరింత ముఖ్యం.
  3. ప్రారంభ దశలో అందించే సహాయ సేవల్లో వివిధ రంగాల నిపుణులు కలిసి పనిచేస్తారు. పిల్లల శారీరక, మేధోపరమైన, సామాజిక అభివృద్ధిలో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు తోడ్పడతారు. 
  4. పిల్లల అవసరాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన మద్దతు అందించడం వల్ల వారి మెరుగైన జీవన నాణ్యతను పొందే అవకాశం పెరుగుతుంది.
  5. డా. విభా కృష్ణమూర్తి మరియు ఉమ్మీద్ ప్రారంభ దశలోని సహాయం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు భరోసా మరియు నమ్మకం అందిస్తున్నారు.

ఈ విషయ వివరణ, పిల్లల అభివృద్ధిలో సవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ప్రారంభ దశలోనే సహాయం  అందించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ప్రస్తుతం, పిల్లల అభివృద్ధికి సంబంధించిన సవాళ్లు ఎక్కువగా గుర్తించబడుతున్న నేపథ్యంలో, ప్రారంభ సంకేతాలను త్వరగా గుర్తించి అర్థం చేసుకోవడం అవసరం. ఇది ఖచ్చితమైన నిర్ధారణ పొందడంలో సహాయపడుతుంది. దీని ద్వారా ప్రారంభ దశలోనే సహాయం అందించి, దీర్ఘకాలిక ఫలితాలను మెరుగుపరచే అవకాశాలను కల్పిస్తుంది.

బాల్యదశలో కనిపించే అభివృద్ధి సంబంధిత సవాళ్లు

డెవలప్మెంటల్ పిడియాట్రిషన్ మరియు సంస్థ వ్యవస్థాపకురాలు డా. విభా కృష్ణమూర్తి గారు, పిల్లల అభివృద్ధికి సంబంధించిన అన్ని సవాళ్లు బయటకు కనిపించవని గుర్తుచేస్తున్నారు. కొన్ని పరిస్థితుల్లో స్పష్టమైన శారీరక లక్షణాలు కనిపించినప్పటికీ, మరికొన్ని సవాళ్లు బయటకు కనిపించకపోయినా పిల్లల అభ్యాసం మరియు రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు.

  • డిస్లెక్సియా ఉన్న పిల్లల అవసరాలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పిల్లలు చదవడం, రాయడంలో ఇతర పిల్లలకంటే భిన్నమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి, వారు తమ పూర్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అదనపు లేదా ప్రత్యామ్నాయ మద్దతు అవసరం కావచ్చన్నారు. అలాగే, ఎక్కువసేపు ఒక పనిపై ఏకాగ్రతను నిలుపుకోవడం కష్టంగా అనిపించే పిల్లల గురించి కూడా ఆమె ప్రస్తావిస్తూ, ఇవి పిల్లలు ప్రపంచంతో కలిసే విధానంలో కనిపించే సహజమైన తేడాలని నొక్కి చెబుతున్నారు.
  • డా. కృష్ణమూర్తి రాజస్థాన్‌లో ఒక చిన్న బాలుడిని కలిసిన అనుభవాన్ని పంచుకుంటున్నారు. మొదట చూడగానే ఆ బాలుడు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు అనిపించింది. అయితే, నిశితంగా గమనించినప్పుడు అతనిలో అభివృద్ధికి సంబంధించిన ఆలస్యాలు ఉండవచ్చని ఆమె గుర్తించారు. చుట్టూ ఉన్నవారితో తగినంత సంభాషణ, పరస్పర మమేకం లేకపోవడం వల్ల ఈ సమస్యలు మరింత పెరిగి ఉండవచ్చని ఆమె వివరించారు.

ఈ ఉదాహరణలు ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తున్నాయి. అభివృద్ధిలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తిస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. వీటిలో చాలా వరకు బయటకు స్పష్టంగా కనిపించకపోయినా, పిల్లలు నేర్చుకునే విధానం, ఇతరులతో కలిసే తీరు  మరియు వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. ఈ వ్యత్యాసాలను ప్రారంభ దశలోనే గుర్తించి, పిల్లలను అర్థం చేసుకుంటూ, అవసరమైన సహాయం  అందించడం ద్వారా అందరు పిల్లలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునే అవకాశాన్ని పొందగలరు.

ప్రారంభ దశలో సహాయం

ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రారంభ దశలో అభివృద్ధిలోని భిన్నత్వాలను గుర్తించి, తగిన సహాయం అందించడం చాలా ముఖ్యమని డా. విభా కృష్ణమూర్తి చెబుతున్నారు.

  • పిల్లల్లో అభివృద్ధి పరమైన భిన్నత్వాలను గుర్తించిన తర్వాత, వారి ఎదుగుదలలో కీలకమైన తొలి సంవత్సరాల్లో మెదడు అభివృద్ధికి తోడ్పడేలా ఎలా ప్రోత్సహించాలో తల్లిదండ్రులు నేర్చుకోవచ్చు. 
  • ఇది పిల్లల మెదడు అభివృద్ధిని మెరుగుపరచడంలో, పాఠశాలలో మెరుగైన పనితీరుకు, అలాగే దీర్ఘకాలిక భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది.
  • మూడేళ్లలోపు గుర్తించి, తగిన సహాయం అందిస్తే పిల్లల్లో మంచి అభివృద్ధి ఫలితాలు కనిపించే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.  
  • నిర్ధారణ జరిగిన తర్వాత, పిల్లల వయస్సుకు తగిన అభివృద్ధి దశలను చేరుకోవడానికి ఎలా సహాయపడాలో తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు.
  • పిల్లలతో భాగస్వామ్యం కావడం వలన వారి సంభాషణ, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచవచ్చు. డా. విభా గుర్తుచేస్తున్నట్లుగా, “చిన్న వయస్సులోనే పిల్లలతో పరస్పర చర్యలు జరపకపోవడం, మమేకం కాకుండా ఉండటం వారి అభివృద్ధి సామర్థ్యాలను పరిమితం చేస్తుంది.”
  • సరైన సమయంలో  థెరపిస్టుల నుండి అందే సహాయం కూడా పిల్లల అభివృద్ధి మరియు పురోగతికి ఎంతో దోహదపడుతుంది.

పిల్లల మెదడు అభివృద్ధిలో మొదటి కొన్ని సంవత్సరాలు అత్యంత కీలకం. ఈ కాలం వారి నాడీ వ్యవస్థకు బలమైన పునాది వేస్తుంది. ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలలో దీన్ని అర్థం చేసుకోవడం అత్యంత అవసరం.

ప్రారంభ దశలో సహాయం అందించే  సేవలు నిపుణుల బృందంతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయి. వారు పిల్లల శారీరక, ఆలోచన, సామాజిక నైపుణ్యాలలో ఉన్న లోటులను గుర్తించి, పరిష్కరించడానికి అవసరమైన అవగాహన మరియు మార్గదర్శకత్వం అందిస్తారు.

డా. కృష్ణమూర్తి గారు పిల్లల ప్రత్యేక అవసరాలను ప్రారంభ దశలోనే అర్థం చేసుకుని తగిన సహాయం అందించడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి అంగీకరించడం ద్వారా, పిల్లలు తమ అభివృద్ధిలో పురోగతి సాధించగలరు. ఇది వారి మొత్తం జీవన నాణ్యతపై దీర్ఘకాలిక సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కుటుంబాలకు తన పేరుకు తగినట్లు గానే భరోసాను అందిస్తున్న ఉమ్మీద్ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ వ్యవస్థాపకురాలి ఈ విలువైన ప్రసంగాన్ని చూడండి.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సరైన మార్గదర్శకత్వం కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

Write Blog

Share your experiences with others like you!

English