Skip to main content
Install App
If you're using:

ఆటిజం గురించి ఉన్న అపోహలు మరియు అపనమ్మకాలు

Default Avatar

Dr Ajay Sharma

Also available in: English

Key Takeaways:

  1.  ఆటిజం గురించి అనేక అపోహలు ఉన్నాయి. వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా సంరక్షకులు పిల్లలకు మరింత మెరుగైన సహాయం అందించగలరు..
  1.   అవగాహన పెంపొందించడం వల్ల అంగీకారం పెరిగి, అందరికీ అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.
  2.   పిల్లల్లో ప్రతి ఒక్కరికి వారి సామర్థ్యాలు, అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే, వారికి అవసరమైన సహాయం కూడా వారి అవసరాలకు అనుగుణంగా ఉండాలి.
  3.     ప్రారంభ దశలో సహాయం అందించడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం పిల్లల అభివృద్ధిలో మంచి మార్పు రావచ్చు. 
  4. కుటుంబాలకు అవసరమైన సమాచారం మరియు వనరులు అందుబాటులో ఉన్నాయి, అందులో నయీ దిశా యొక్క ఉచిత హెల్ప్‌లైన్ కూడా ఉంది.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [571.95 KB]

ఆటిజం అంటే ఏమిటి?

ఆటిజం అనేది ఒక నాడీ అభివృద్ధి సంభందిత పరిస్థితి. ఇది వ్యక్తి ఎలా మాట్లాడతారు, సమాచారాన్ని ఎలా అర్థం చేసుకుంటారు , మరియు చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా మెలుగుతారు అనే విషయాలను  ప్రభావితం చేస్తుంది. “స్పెక్ట్రం” అనే పదం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఆటిజం భిన్నంగా కనిపించవచ్చు. వారి సామర్థ్యాలు, సంకేతాలు మరియు అవసరమయ్యే సహాయం కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. 

ఇది ఒక భిన్నమైన జీవన, ఆలోచన, మరియు అనుభూతి విధానం. ఆటిజం ఉన్న చాలా మందికి శబ్దం, వెలుతురు, వివిధ రకాల స్పర్శలు లేదా సామాజిక వాతావరణాల పట్ల ఎక్కువగా  సున్నితత్వం ఉంటుంది. కొంతమంది ఒకే విధమైన నియమిత దినచర్యను ఇష్టపడవచ్చు, మాట్లాడిన విషయాన్ని  అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు, లేదా సంకేతాలు, చిత్రాలు లేదా సహాయక సాంకేతిక పరికరాల ద్వారా అవసరాలను తెలియజేయవచ్చు.

ఆటిజం సంకేతాలు:

  • పిల్లలు నేరుగా కళ్లలోకి చూసి మాట్లాడడంలో ఇబ్బంది పడవచ్చు.
  • మాట్లాడటం ఆలస్యంగా అభివృద్ధి చెందవచ్చు.
  • సామాజిక సంబంధాలు ఏర్పరచుకోవడం మరియు కొనసాగించడం కష్టంగా ఉండవచ్చు.
  • ఒకే రకమైన కదలికలు లేదా పనులను పదే పదే చేయవచ్చు. 

గమనించాల్సిన విషయం ఏమిటంటే — పిల్లలు తమ వయస్సు పిల్లల్లాగా మాట్లాడకపోయినా లేదా ప్రతిస్పందించకపోయినా, అతను అర్థం చేసుకోలేరు లేదా భావించలేరు అనే అర్థం కాదు.

చాలా మంది ఆటిజం ఉన్న పిల్లలు మాటలకంటే భిన్నమైన మార్గాల్లో తమను తాము వ్యక్తపరచుకుంటారు మరియు కమ్యూనికేషన్ అభివృద్ధి చెందడానికి ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ పద్ధతులు అవసరం అవుతాయి.

ప్రారంభ దశలో అవగాహన మరియు సహాయం యొక్క ప్రాముఖ్యత

ఆటిజంసంకేతాల ను ప్రారంభంలోనే  గుర్తించడం ద్వారా సంరక్షకులు సరైన సహాయాన్ని పొందగలరు. అయితే, పిల్లలు నేర్చుకోవడానికి లేదా అభివృద్ధి చెందడానికి ఒక నిర్దిష్ట వయసు ఉండదు. పిల్లలు ప్రతి ఒక్కరు తమ సొంత వేగంతో నేర్చుకుంటారు. ఏ వయసులోనైనా మంచి మార్పు రావచ్చు.

పిల్లవాడిని ఇతరుల్లా మార్చడం కంటే, వారు ఎలా ఉన్నారో అర్థం చేసుకుని, అంగీకరించే వాతావరణాన్ని కల్పించడం ఒత్తిడిని తగ్గించడం  ముఖ్యం. థెరపీలలో పిల్లలను అందరితో కలిసి ఉండేలా చేయడం, కమ్యూనికేషన్ మరియు ఇతరులతో అనుబంధాన్ని పెంపొందించడంపై దృష్టి ఉండాలి. సహజ ప్రవర్తనను దాచేలా చేయడం లక్ష్యం కాకూడదు.

ఆటిజం గురించి ఉన్న అపోహలు

ఆటిజం గురించి ఉన్న కొన్ని సాధారణ అపోహలు పిల్లలు, కుటుంబాల గురించి తప్పుగా అర్థం చేసుకునేలా చేయవచ్చు. వాటి వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకుందాం. 

  • అపోహ: తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవడం వల్ల ఆటిజం వస్తుంది 

వాస్తవం: తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానంతో ఆటిజంకు సంబంధం లేదు. పిల్లల చిన్న వయసులో మెదడు అభివృద్ధి చెందే విధానం, మెదడులోని భాగాల మధ్య సంబంధాలు ఏర్పడే విధానంలో ఉండే తేడాలు ఆటిజానికి ప్రధాన కారణాలని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆటిజం అనేది పిల్లలను ఎలా పెంచారనే దాని వల్ల వచ్చే పరిస్థితి కాదు.

  • అపోహ: ఆటిజం ఉన్న పిల్లలు మాట్లాడటంలో ఇబ్బంది పడతారు కాబట్టి తెలివిగా ఉండరు.

వాస్తవం: కమ్యూనికేషన్‌లో ఇబ్బందులు  ఉండటం అనేవి పిల్లల  తెలివితేటల మీద ప్రభావం చూపవు. చాలా మంది ఆటిజం ఉన్న పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ప్రతిస్పందించడం వంటి వాటిలో తమకంటూ ప్రత్యేకమైన మార్గాలను కలిగి ఉంటారు. తెలివితేటలు అనేక రూపాలలో వ్యక్తమవుతాయి. సాధారణంగా ఉపయోగించే అంచనా పద్ధతులు పిల్లల పూర్తి సామర్థ్యాన్ని ఎప్పుడూ చూపించకపోవచ్చు.

  • అపోహ: ఆటిజం ఉన్న పిల్లలు ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడతారు, స్నేహితులు అవసరం అనుకోరు.

వాస్తవం: ఆటిజం ఉన్న పిల్లలు స్నేహం పట్ల ఆసక్తి చూపే విధానం లేదా కమ్యూనికేషన్ పద్ధతి వేరుగా ఉండవచ్చు, అందువల్ల వారికి  స్నేహం అవసరం లేదని అర్థం కాదు. చాలా మంది ఆటిజం ఉన్న పిల్లలు స్నేహానికి, ఇతరులతో కలిసి ఉండటానికి ఎంతో విలువ ఇస్తారు .వారు ఇతర పిల్లలకంటే భిన్నమైన విధానాల్లో తమ ఆసక్తిని వ్య“క్తం చేయవచ్చు. 

ఈ ప్రెజెంటేషన్ ద్వారా మీరు ఆటిజం గురించి ఉన్న మరిన్ని అపోహలను తెలుసుకొని, వాస్తవాలను అర్థం చేసుకోవచ్చు. 

ఆటిజం గురించి ఉన్న అపనమ్మకాలు  

ఆటిజం గురించి అవగాహన పెరుగుతున్నప్పటికీ, పాతకాలపు లేదా అపనమ్మకాలు ఇంకా చాలా మందిలో ఉన్నాయి. ఇలాంటి అపోహలు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల  రావు. కొత్త సమాచారం, అందరికీ అర్థమయ్యే సమాచారం, అలాగే ఆటిజం ఉన్న వ్యక్తుల నిజ జీవిత అనుభవాల గురించి తగిన సమాచారం అందుబాటులో లేకపోవడం కూడా దీనికి ఒక కారణం. 

ఇలాంటి అపోహలు కొనసాగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు:

  •  మీడియాలో ఆటిజాన్ని పరిమితంగా లేదా ఒకే విధంగా చూపించడం 

చాలా సినిమాలు, షోలు, మరియు వార్తా కథనాలు ఆటిజాన్ని ఒకే రకమైన రూపంలో చూపిస్తాయి. కానీ నిజజీవితం సినిమా లాగా ఉండదు. ఆటిజం స్పెక్ట్రం‌లో కళాకారులు, ఆలోచనాపరులు, ఎక్కువగా మాట్లాడని పిల్లలు,ఎక్కువగా మాట్లాడే పిల్లలు, కదలికలు లేదా పనులను పదే పదే చేసే పిల్లలు, క్రమబద్ధమైన దినచర్యను ఇష్టపడే పిల్లలు, అలాగే కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పిల్లలు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరినీ అర్థం చేసుకోవడం, గౌరవించడం ముఖ్యం.

  • పాతకాలపు వైద్య భాష మరియు నిర్ధారణ విధానాలు 

చాలా సంవత్సరాల పాటు, నిపుణులు ఆటిజం గురించి మాట్లాడేటప్పుడు నాడీ అభివృద్ధి సంబంధిత   పరిస్థితిగా కాకుండా “ఏం లోపం ఉంది?” అనే కోణంలో పదాలను ఉపయోగించేవారు . ఇప్పుడు ఈ విధానం  క్రమంగా మారుతోంది, కానీ “హై-ఫంక్షనింగ్”, “లో-ఫంక్షనింగ్” వంటి పాత పదాలు ఇంకా చాలామంది వాడుతున్నారు. కానీ ఇవి పిల్లలకు రోజువారీ జీవితంలో నిజంగా ఎంత సహాయం అవసరమో పూర్తిగా తెలియజేయవు. 

దీనికి బదులుగా, పిల్లల సామర్థ్యాలపై దృష్టి పెట్టే విధానం మరింత ఉపయోగకరంగా ఉంటుంది . అంటే, “సాధారణ స్థాయికి ఎంత దూరంగా ఉన్నాడు?” అని కాకుండా “ఈ పిల్లవాడు అభివృద్ధి చెందడానికి ఏ విధమైన సహాయం అవసరం?” అని ఆలోచించడం కంటే ముఖ్యమైనది. 

  • ఆటిజం ఉన్న వ్యక్తుల అనుభవాలను తెలుసుకోకపోవడం 

చాలా మంది సంరక్షకులు మరియు నిపుణులు ఆటిజం గురించి తెలుసుకుంటారు , కానీ ఆటిజం ఉన్న వ్యక్తుల అనుభవాలను, తెలుసుకోవడం చాలా తక్కువగా జరుగుతుంది. వారి అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకుంటే, మనకు లభించే సమాచారం మరింత స్పష్టంగా, సరైనదిగా, మానవీయంగా ఉంటుంది. 

ప్రతి సారి మనం ఒక అపోహను సవాలు చేసినప్పుడు అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది.

ప్రతి  అనుభవాన్ని విన్నప్పుడు సానుభూతితో, నిజంగా ఉపయోగపడే సహాయం ఎలా అందించాలో మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం. 

ఈ ప్రెజెంటేషన్‌లో ఆటిజం గురించి ఉన్న సాధారణ అపోహలను తొలగించి, స్పష్టమైన, వాస్తవ సమాచారాన్ని అందిస్తుంది. అవగాహన పెరగడం వల్ల కుటుంబాలు, సంరక్షకులు పిల్లల ప్రత్యేక సామర్థ్యాలు, అవసరాలను అర్థం చేసుకుని, వారికి సరైన సహాయం అందించగలరు. ఆటిజం గురించి చాలా అపోహలు సరైన సమాచారం లేకపోవడం వల్ల ఏర్పడతాయి. 

ఈ వనరు అపోహలు, వాస్తవాల మధ్య తేడాను అర్థం చేసుకోవడానికి, పిల్లలకు ఆటిజం ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత తల్లిదండ్రులకు వచ్చే సాధారణ సందేహాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

మరింత తెలుసుకోవడం ద్వారా, సంరక్షకులు పిల్లలకు తోడుగా ఉండే, వారిని అర్థం చేసుకునే వాతావరణాన్ని కల్పించడానికి సిద్ధంగా ఉండగలరు.

తల్లిదండ్రులు మరియు సంరక్షకుల కోసం

మీ పిల్లలకు ఆటిజం ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు ఉపశమనం, అయోమయం, బాధ లేదా విచారం వంటి అనేక భావాలు కలగవచ్చు. ఇవన్నీ సహజమైనవే. “ఏం సమస్య ఉంది?” అని ఆలోచించడం కంటే, “నా పిల్లలకు ఎలా సహాయం చేయగలను?” అనే దానిపై దృష్టి పెట్టడం ముఖ్యం. 

ముందుగా ఆటిజం గురించి తెలుసుకోండి, పిల్లల మాటలను మరియు అవసరాలను గమనించండి. సమాజం చెప్పే “పర్ఫెక్ట్” అనే భావనకు పిల్లలను సరిపోల్చాలనే ఒత్తిడిని తగ్గించండి. 

పిల్లలకు ఆటిజం ఉన్నట్లు కొత్తగా నిర్ధారణ అయినప్పుడు తల్లిదండ్రులకు వచ్చే సాధారణ సందేహాల గురించి తెలుసుకోండి. ఆటిజం గురించి మరింత తెలుసుకోవడం ద్వారా, మీ పిల్లల ప్రత్యేక అవసరాలను మరింత బాగా అర్థం చేసుకుని, వారికి సరైన సహాయం అందించగలరు.

కృతజ్ఞతలు: పైన అందించిన ప్రెజెంటేషన్‌లో 19–25 పేజీలలోని   సమాచారాన్ని అందించినందుకు జై వకీల్ ఫౌండేషన్ కు మా కృతజ్ఞతలు.

గమనిక: ఈ విషయ వివరణ కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

Write Blog

Share your experiences with others like you!

English