Skip to main content
Install App
If you're using:

సంభాషణకు మద్దతునిచ్చే పరికరాలు మరియు పద్ధతులు (ఏ.ఏ.సి) అంటే ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?

avaz-logo-hi-res-500
Avaz
Also available in: हिंदी English
Like Icon 0Likes
Download Icon 0 Downloads

Key Takeaways:

  1. సంభాషణకు మద్దతునిచ్చే ప్రత్యామ్నాయ సాధనాలు మరియు పద్ధతులు (ఏ.ఏ. సి) అంటే సంభాషణా మార్గాలలో ఉన్న సవాళ్లను మెరుగుపరిచే ఒక ప్రత్యామ్నాయ విధానం. పిల్లల దైనందిన జీవితాలకు సుపరిచితమైన పదాలు, భావ ఏకీకరణ ద్వారా స్వరాన్ని అందించే విధంగా ఈ ఏ.ఏ. సి మార్గాలు ఉపయోగపడతాయి.
  2. పిల్లలు సామాజిక సాన్నిహిత్యం పొందడానికి ఇంకా భాషా నిర్మాణానికి ఉపయోగపడుతూ స్వతంత్రంగా తమను వ్యక్త పరచుకునేందుకు సహకరిస్తాయి.
  3. ఆటిజం, సెలెబ్రెల్ పాల్సీ, లేదా సంభాషణా సామర్ధ్యాన్ని ప్రభావితం చేసే ఇతర అభివృద్ధి జాప్యాలున్న వారికైనా ఏ.ఏ. సి ఒక విలువైన సాధనంగా పేర్కొనవచ్చు.
  4. ఏ.ఏ. సి ను రెండు వర్గాలుగా విభజించారు. అవి 1. ఎయిడెడ్ ఏ.ఏ. సి 2 అన్ ఎయిడెడ్ ఏ.ఏ.సి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.49 MB]

సంభాషణా పరంగా సవాళ్లు ఎదుర్కునే వ్యక్తులు తమ పరిసరాలలో ఉన్న వారితో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే పద్దతిని ఏ.ఏ. సి సూచిస్తుంది.

మనం అందరం మన పరిసరాల చుట్టూ ఉన్న వ్యక్తులతో సంభాషించడానికి మనల్ని వ్యక్తపరచుకోవాలని కోరుకుంటాం. చాలావరకు మనం పదాలు లేదా భాష ద్వారా అంటే మౌఖిక సంభాషణా ద్వారా సులభంగా వ్యక్తపరచుకుంటాము. మౌఖిక బలహీనత ఉన్న వ్యక్తులు తమను తాము వ్యక్తపరచుకోడానికి మరియు వారి హక్కుల వినియోగానికి రాత ద్వారా మరియు చిత్ర ప్రాతినిధ్యాలు ఉపయోగించుకోవచ్చు.  ఈ కమ్యూనికేషన్ విధానాన్నే ప్రత్యామ్నాయ సంభాషణా పద్ధతులు లేదా సాధనా పరికరాలుగా (ఏ.ఏ. సి) చెప్పవచ్చు. కనుక ఏ.ఏ.సి. ని పిల్లవాడికి స్వరంగా చెప్పవచ్చు. పిల్లల దైనందిన జీవితంలో సాధారణంగా ఎదురయ్యే పదాలు, భాషా వంటివి మెరుగుపరచడానికి ఏ.ఏ.సి. ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఆవాజ్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు ఏ.ఏ.సి యాప్  https://www.avazapp.com/ ను సందర్శించవచ్చు.  

మౌఖిక సంభాషణ బలహీనంగా ఉన్న పిల్లలు స్వేచ్ఛగా సంభాషించడానికి ఏ.ఏ. సి ప్రాముఖ్యతను వివరించే వీడియోను దయచేసి చూడగలరు.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ.డి. హెచ్.డి. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

సూచన: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English