Skip to main content
Install App
If you're using:

ఆటిజం అంటే ఏమిటి? – మీ పిల్లల రోగ నిర్ధారణను అర్థం చేసుకోవడానికి శీఘ్ర గైడ్

Default Avatar

डॉ. अजय शर्मा

इस भाषा में उपलब्ध है हिंदी English
Like Icon 0पसंद किया गया
Download Icon 2 डाउनलोड्स

महत्वपूर्ण जानकारी

ఆటిజం అంటే ఏమిటి? 

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏ.ఎస్.డి.) అనేది మెదడు అభివృద్ధికి సంబంధించిన పరిస్థితి. ఇందులో సంభాషణ, సామాజిక పరస్పర చర్య, మరియు ప్రవర్తనలో వ్యత్యాసాలు కనిపిస్తాయి.

పిల్లల్లో ఆటిజం సంకేతాలు:

  • పిల్లవాడు కళ్ళలోకి నేరుగా ( కాంటాక్ట్) చూడక పోవచ్చు
  • బాషా అభివృద్ధి ఆలస్యం కావచ్చు.
  • సామాజిక సంబంధాలు ఏర్పరచుకోవడం, కొనసాగించడం కష్టమవచ్చు.
  • పునరావృత కదలికలు లేదా ప్రవర్తనలో పాల్గొనవచ్చు.

 త్వరిత సహాయానికి తల్లిదండ్రులకు సూచనలు

  • ముందస్తు జోక్యం మరియు సహాయాన్ని అందించటం వలన ఆటిజం ఉన్న పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
  • సమన్వయపద్ధతిస్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, అభివృద్ధి సంబంధిత జోక్యాలు కలిపి ఉపయోగించడం ద్వారా, ప్రతి పిల్లవాడి అవసరాలకు అనుగుణంగా పద్ధతులను అందించవచ్చు.
  • అర్థం చేసుకునే మరియు సహాయక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఆటిజం పిల్లలు ఎదగడానికి, విజయవంతంగా ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తుంది.

 ఆటిజం నిర్ధారణ తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు మిశ్రమ భావోద్వేగాలను కలిగించవచ్చు. మొదట్లో ఇది కష్టంగా అనిపించినా, ఆటిజాన్ని ఒక ప్రత్యేకమైన విధానంగా అర్థం చేసుకోవడం ద్వారా మీ పిల్లకు సహాయకరమైన, అభివృద్ధి కలిగించే వాతావరణాన్ని సృష్టించవచ్చు.

Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [277.14 KB]

ఆటిజం అంటే ఏమిటి?

ఆటిజం లేదా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏ.ఎస్.డి.) అనేది మెదడు అభివృద్ధికి సంబంధించిన పరిస్థితి, ఇందులో సంభాషణ, సామాజిక పరస్పర చర్యలు మరియు ప్రవర్తనలో వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఆటిజం ఉన్న వ్యక్తుల్లో భాషా అభివృద్ధి, సామాజిక సంబంధాలు, మరియు ఇంద్రియ సమాచార ప్రక్రియలో వ్యత్యాసాలు ఉండవచ్చు. అలాగే, వారికి ప్రత్యేకమైన ఆసక్తులు ఉండవచ్చు మరియు ప్రపంచాన్ని నేర్చుకోవడం, అర్థం చేసుకోవడంలో ప్రత్యేకమైన మార్గాలు ఉండవచ్చు. సరైన సహాయం మరియు అనుకూలతలు కల్పిస్తే, ఆటిజం ఉన్న వ్యక్తులు తమ బలాలు మరియు అవసరాలకు అనుగుణంగా విజయవంతంగా ఎదగగలరు.

ఆటిజం యొక్క ప్రారంభ లక్షణాలను గుర్తించడం

ప్రతి పిల్లవాడికి అభివృద్ధి వేగం ప్రత్యేకమైనది. అలాగే ఆటిజం ప్రతి వ్యక్తిలో భిన్నంగా కనిపిస్తుంది. ఆటిజం ప్రారంభ లక్షణాలలో కొన్ని ఇవి ఉండవచ్చు:

  • పిల్లవాడు కళ్ళలోకి నేరుగా (ఐ కాంటాక్ట్) చూడలేకపోవడం
  • బాషా అభివృద్ధిలో ఆలస్యం.
  • సామాజిక సంబంధాలు ఏర్పరచుకోవడం, కొనసాగించడం కష్టంగా ఉండటం.
  • పునరావృత కదలికలు లేదా ప్రవర్తనలో పాల్గొనడం.

మీ పిల్లల్లో ఈ సంకేతాలను గమనిస్తే మరియు వాటిని మరింతగా అర్థం చేసుకోవాలనుకుంటే, నిపుణుల అంచనాలు విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ఆటిజం అనేది “సరిచేయాల్సిన” విషయం కాదు ఇది ఒక భిన్నమైన జీవన విధానం.

సంబంధిత వ్యాసం: 5 ఏళ్ల లోపు పిల్లల్లో ఆటిజం ప్రారంభ లక్షణాలు

ఆటిజం పిల్లలకు సహాయాన్నివ్వడం

పరిశోధనల ప్రకారం, ఆటిజం అనేది జన్యుపరమైన మరియు పర్యావరణ కారణాల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఇది “పెంపక లోపం” వల్ల వచ్చే విషయం కాదు. ఆటిజం అనేది పూర్తిగా నయం కానిదే అయినాగానీ   ప్రారంభ దశలో సహాయం చేయడం మరియు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా ఆటిజం ఉన్న పిల్లలు విజయవంతంగా ఎదగగలరు.

తల్లిదండ్రులు, థెరపిస్టులు మరియు ఉపాధ్యాయుల సమన్వయం ఈ క్రింది విషయాల్లో సహాయపడుతుంది:

  • ఇంద్రియ మరియు అభ్యాస అవసరాలకు అనుగుణంగా పరిసరాలను మార్చడం.
  • సహజ సంభాషణను ప్రోత్సహించడం.
  • ఉహించదగిన మరియు సౌకర్యవంతమైన దినచర్యలను రూపొందించండి.
  • స్వీయ నియంత్రణ మరియు భావోద్వేగ సౌకర్యాన్ని పెంపొందించాలి.

అధ్యయనాల ద్వారా ప్రభావవంతంగా ఉన్నాయని నిరూపించబడిన థెరపీలు

ఆటిజం పిల్లలు, వారి ప్రత్యేక అవసరాల ఆధారంగా వ్యక్తిగత సహాయం పొందడం ద్వారా లాభపడతారు. ప్రభావవంతమైన కొన్ని విధానాలు ఇవి:

  • స్పీచ్ మరియు లాంగ్వేజ్ థెరపీ (ఎస్.ఎల్.టి.): మాట్లాడగలిగే, మాట్లాడలేని (నాన్-వెర్బల్) లేదా ప్రత్యామ్నాయ సాధనా పరికరాలు పిల్లల అవసరాలకు తగిన విధంగా ప్రభావవంతమైన కమ్యూనికేషన్‌ను పెంపొందించడానికి సహాయపడతాయి.  
  • ప్రవర్తనా మరియు అభివృద్ధి నమూనాలు: సానుకూల పరస్పర చర్యలను ప్రోత్సహించి, స్వీయ నియంత్రణ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయి.
  • డెన్వర్ మోడల్, రిలేషన్‌షిప్ డెవలప్‌మెంట్ ఇంటర్వెన్షన్ (ఆర్.డి.ఐ), రెస్పాన్సివ్ టీచింగ్ (ఆర్.టి)
  • టీ.ఈ.ఏ.సీ.సీ.హెచ్ పద్ధతి (క్రమబద్ధమైన అభ్యాసం) 
  • పిక్చర్ ఎక్స్ఛేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ (పి.ఈ.సి.ఎస్.): కమ్యూనికేషన్ సవాళ్లు ఎదుర్కొంటున్న వ్యక్తులు వస్తువు కోసం కావలసిన చిత్రాన్ని మార్పిడి చేయడం ద్వారా వారి అవసరాలు మరియు కోరికలను వ్యక్తపరచడంలో ఉపయోగపడుతుంది.
  • ఆక్యుపేషనల్ థెరపీ (ఓ.టి): మోటార్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతూ, సెన్సరీ అవసరాలకు అనుగుణంగా రోజువారీ కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది.

ప్రారంభదశలో సహాయం యొక్క ప్రాముఖ్యత:

ఆటిజం అనేది జీవితాంతం ఉండే ఒక పరిస్థితి. దీనిని “చికిత్స చేయాలి” లేదా “సరిచేయాలి” అనేది అవసరం లేదు అంగీకరించాలి మరియు మద్దతు ఇవ్వాలి. సరైన సహాయం మరియు అనుకూలతలు లభిస్తే, ఆటిజం ఉన్న వ్యక్తులు స్వతంత్రంగా మారి, అర్థవంతమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలరు.

ఆటిస్టిక్ వ్యక్తుల తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు గణనీయమైన మద్దతు ఉందనేది నిజం. సహాయక సమాజాన్ని నిర్మించడం, వనరులు మరియు సేవలను పొందడం మరియు వారి పిల్లల అవసరాలను తీర్చడం ద్వారా సంరక్షకులు తమ పిల్లల ఫలితాలను మెరుగుపరచగలరు.

సమాచారం పత్రం (ఫాక్ట్ షీట్) ఆటిజం గురించి అవగాహన ఇస్తుంది. ఇందులో ప్రారంభ లక్షణాలు, సాధ్యమైన కారణాలు, నిర్ధారణ విధానం, అలాగే కుటుంబాలకు అందుబాటులో ఉన్న సహాయ మార్గాలు ఉన్నాయి.

సంబంధిత వ్యాసం:  ఆటిజం మరియు శిశు అభివృద్ధి పై ఆందోళనలు- నయీ దిశా

ధన్యవాదాలు

ఆటిజం సమాచారం పత్రం తయారీలో సలహాలు మరియు మార్గదర్శకత్వాన్ని అందించిన న్యూరోడెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ డాక్టర్ అజయ్ శర్మ గారికి కృతజ్ఞతలు. అంతేకాక, విషయాన్ని ఇంగ్లీష్ నుండి తెలుగు లోకి అనువదించడానికి సమయం మరియు శ్రమ పెట్టిన మా స్వచ్ఛంద కార్యకర్త శైలజ తాడిమేటి గారికి కూడా ధన్యవాదాలు.

Click यहाँ to find more information about Autism.

Autism is not a limitation – it is a different way of being. Embracing neurodiversity leads to a more inclusive and understanding world.

నిపుణుల సహాయం పొందండి

మార్గదర్శనం మరియు మద్దతు కోసం ఫ్రీ నయీ దిశా హెల్ప్లైన్ కి కాల్ చేయండి: 844-844-8996 (వివిధ భాషలలో అందుబాటులో ఉంది).

ఆటిజం ఒక పరిమితి కాదుఇది భిన్నమైన జీవన విధానం. న్యూరోడైవర్సిటీ అంగీకరించడం అవగాహన కలిగిన ప్రపంచాన్ని సృష్టిస్తుంది.

टैग्स :
ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी