Skip to main content
Install App
If you're using:

ABC చార్ట్: ఆటిజం ఉన్న పిల్లల ప్రవర్తనను అర్థం చేసుకుని, వారికి సరైన సహాయం అందించడానికి ఉపయోగపడే సమర్థవంతమైన సాధనం.

Default Avatar

डॉ गौरी रेड्डी

इस भाषा में उपलब्ध है English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

  1.   ప్రవర్తనను సమర్థవంతంగా నిర్వహించాలంటే, దానిని గమనించగలిగే మరియు అంచనా వేయగలిగే విధంగా (చర్యా పదాలతో) స్పష్టంగా వివరించాలి.
  2.   ‘ఎందుకు?’ (W -వై), ‘ఏమిటి?’ (W -వాట్), ‘ఎప్పుడు?’ (W -వెన్), ‘ఎవరితో?’ (W -హూమ్), ‘ఎక్కడ?’ (W – వేర్) అనే 5W ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం ద్వారా , ప్రవర్తనను సాధారణంగా చెప్పడం కాకుండా, పిల్లలు చేసిన చర్యలను స్పష్టంగా వివరించవచ్చు. 
  3.   ABC ఫ్రేమ్‌వర్క్‌ (A -ఆంటీసిడెంట్–B -బిహేవియర్–C -కాన్సెక్వెన్సు) ద్వారా సంఘటనలను నమోదు చేయడం వల్ల, పిల్లల ప్రవర్తనపై లోతైన అవగాహన పొందవచ్చు.
  4.   ABC చార్ట్‌లో వరుసగా నాలుగు విభాగాలు ఉండాలి:  సమయం మరియు చర్య, కారణమైన పరిస్థితి (ఆంటీసిడెంట్), ప్రవర్తన (బిహేవియర్), ఫలితం (కాన్సెక్వెన్సు)
  5.   ఈ క్రమబద్ధమైన విధానం స్పష్టతను ఇస్తుంది, థెరపిస్టులు సరైన విధానాలను రూపొందించడానికి సహాయపడుతుంది, అలాగే తల్లిదండ్రులు సరైన విధంగా  స్పందించడానికి ఇది సహాయపడుతుంది.

ప్రవర్తన అంటే ఏమిటి? దానిని ఎలా అంచనా వేయవచ్చు?

ప్రవర్తన అంటే ఒక వ్యక్తి చుట్టూ ఉన్న పరిస్థితులకు స్పందిస్తూ చేసే చర్య. ప్రవర్తనలో వచ్చే మార్పులను (పెరుగుదల లేదా తగ్గుదల) అంచనా వేయాలంటే, దానిని ఆలోచనలను సూచించే పదాలకు బదులుగా, వ్యక్తి చేసిన చర్యలను తెలిపే పదాలను ఉపయోగించి ప్రవర్తనను వివరించాలి.

చర్యలను తెలిపే  మరియు ఆలోచనలను తెలిపే  పదాలు

చర్యలను తెలిపే పదాలు: ఇవి గమనించగలిగేవి మరియు అంచనా వేయగలిగేవి. వీటి సంఖ్యను, సమయాన్ని నమోదు చేయవచ్చు లేదా స్పష్టంగా వివరించవచ్చు.

  •  ఉదాహరణలు: ఆడటం, తోసివేయడం, అరవడం, నవ్వడం, గట్టిగా కేకలు వేయడం.

ఆలోచనలను తెలిపే పదాలు: ఇవి నేరుగా గమనించలేము లేదా అంచనా వేయలేము.  

  •  ఉదాహరణలు: ఆలోచించడం, అర్థం చేసుకోవడం, ఇష్టపడకపోవడం.

ఈ రెండు రకాల వివరణల మధ్య తేడాను ఒక ఉదాహరణ ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. పిల్లల్లో నియంత్రించాల్సిన ప్రవర్తన ఆవేశం అని అనుకుందాం. ఆవేశం అనేది ఒక సాధారణ వివరణ మాత్రమే. దానిని నేరుగా అంచనా వేయడం కష్టం. అయితే, ఆ ఆవేశ ప్రవర్తనను నిర్దిష్ట చర్యల రూపంలో వివరించినప్పుడు దానిని అంచనా వేయడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు, గట్టిగా అరవడం, కొట్టడం, తోసివేయడం, బొమ్మలను విసరడం లేదా స్నేహితుడిని కొట్టడం వంటి చర్యలుగా వివరించవచ్చు.

ఆవేశ ప్రవర్తనను నిర్దిష్టంగా గమనించగలిగే చర్యలుగా విభజించడం ద్వారా, థెరపిస్టులు మరియు తల్లిదండ్రులు:

  • ప్రవర్తన ఎంత తరచుగా జరుగుతోందో నమోదు చేయవచ్చు (ఉదాహరణకు, ఒక సెషన్‌లో ఎన్ని సార్లు అరుస్తున్నారు).
  • ప్రవర్తన తీవ్రతను గమనించవచ్చు (ఉదాహరణకు, మెల్లగా తోసివేయడం మరియు బలంగా కొట్టడం మధ్య తేడాను గుర్తించడం).
  • మార్పును  అంచనా వేయవచ్చు (ఉదాహరణకు, కాలక్రమేణా కొట్టే ప్రవర్తన తగ్గిందా లేదా అనేది తెలుసుకోవడం).

ఇది ఎందుకు ముఖ్యమైనది?

  • స్పష్టత: సమర్థవంతమైన విధానాలను రూపొందించడానికి థెరపిస్టులకు ప్రవర్తన గురించి స్పష్టమైన, గమనించగలిగే వివరాలు అవసరం.
  • స్థిరత్వం: తల్లిదండ్రులు మరియు నిపుణులు ఒకే విధంగా ప్రవర్తనను గమనించి, అంచనా వేయగలుగుతారు.
  • మార్పును గమనించడం: సాధారణ వివరణల కంటే నిర్దిష్ట చర్యలను నమోదు చేయడం ద్వారా మెరుగుదలను మరింత స్పష్టంగా గుర్తించవచ్చు.

పిల్లలు ఆవేశంగా ప్రవర్తిస్తున్నారు అని మాత్రమే చెప్పడం సరిపోదు. వారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే నిర్దిష్ట వివరాలు ఉంటేనే థెరపిస్టులు తగిన సహాయక విధానాలను రూపొందించగలరు.

5W ప్రశ్నలు 

పిల్లల ప్రవర్తనను వివరించేటప్పుడు, తల్లిదండ్రులు నిర్దిష్టంగా వివరించని చర్యల కంటే స్పష్టంగా గమనించగలిగే చర్యలపై దృష్టి పెట్టాలి. 5W ప్రశ్నలను ఉపయోగించడం ద్వారా ‘ఎందుకు?’ (W -వై), ‘ఏమిటి?’ (W -వాట్), ‘ఎప్పుడు?’ (W -వెన్), ‘ఎవరితో?’ (W -హూమ్), ‘ఎక్కడ?’ (W – వేర్) ప్రవర్తనకు సంబంధించిన వివరాలను క్రమబద్ధంగా నమోదు చేయడంలో సహాయపడతాయి. దీని వల్ల ఆ ప్రవర్తనను అర్థం చేసుకోవడం మరియు తగిన చర్యలు తీసుకోవడం సులభమవుతుంది.

ఎందుకు: ఆ ప్రవర్తనకు కారణం ఏమిటి?

ఉదాహరణ: “బొమ్మను తీసుకోవడంతో పిల్లలు గట్టిగా అరిచారు.”

ఏమిటి: పిల్లలు అసలు  ఏమి చేశారు? చర్యను సూచించే క్రియాపదాలను ఉపయోగించండి.

ఉదాహరణ: “పిల్లలు గట్టిగా అరిచారు.”

ఎప్పుడు: ఆ ప్రవర్తన ఎప్పుడు లేదా ఏ పని చేస్తున్నప్పుడు జరిగింది  జరిగింది?

ఉదాహరణ: “భోజన సమయంలో.”

ఎవరితో: ఆ ప్రవర్తన జరిగినప్పుడు పిల్లలతో పాటు ఎవరు ఉన్నారు?

ఉదాహరణ: “తరగతి గదిలో ఇతర పిల్లలతో ఉన్నప్పుడు.”

ఎక్కడ: ఆ ప్రవర్తన ఎక్కడ జరిగింది?

ఉదాహరణ: “తరగతి గదిలో.”

5W ప్రశ్నలను గుర్తించడం ద్వారా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను స్పష్టంగా మరియు నిర్దిష్టంగా వివరించగలరు. దీనివల్ల థెరపిస్టులు మరియు తల్లిదండ్రులు ప్రవర్తనలోని నమూనాలను గుర్తించడం, దానికి కారణమయ్యే అంశాలను అర్థం చేసుకోవడం, అలాగే కాలక్రమేణా వచ్చిన మార్పులను  అంచనా వేయడం సులభమవుతుంది.

అవసరమైన ప్రవర్తనను పర్యవేక్షించడానికి ABC చార్ట్ (A-ఆంటీసిడెంట్, B-బిహేవియర్, C-కాన్సెక్వెన్సు) అనే సమర్థవంతమైన ప్రవర్తన నిర్వహణ సాధనాన్ని ఉపయోగించవచ్చు.

ఒక ప్రవర్తనా చర్యను విశ్లేషించడానికి ABC చార్ట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, ప్రతి నిర్దిష్ట చర్య లేదా ప్రవర్తన కోసం విడిగా నమోదు చేయడం మంచిది. ఈ చార్ట్‌లో క్రింది నాలుగు విభాగాలు వరుస క్రమంలో ఉండాలి: సమయం మరియు చర్య, కారణం (ఆంటీసెడెంట్), ప్రవర్తన (బిహేవియర్), ఫలితం (కాన్సెక్వెన్సు)

దశ 1: ప్రవర్తనను గుర్తించండి (చర్యను తెలిపే పదం)

  •  ప్రవర్తన: గట్టిగా అరిచాడు 

దశ 2: దాని వెనుక ఏమి జరిగిందో తెలుసుకోవడం – కారణాన్ని గుర్తించడం 

  •  కారణమైన పరిస్థితి (ముందు ఏమి జరిగింది)

పిల్లలు ఆడుకుంటున్న బొమ్మను మరో పిల్లవాడు తీసుకున్నారు.

దశ 3: తర్వాత ఏమి జరిగిందో నమోదు చేయండి – ఫలితం నమోదు చేయడం

  • ఫలితం: పిల్లలను ఆట నుండి కొంతసేపు దూరంగా ఉంచి, విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించారు.

సమగ్ర పరిశీలన

కారణమైన పరిస్థితి → ప్రవర్తన → ఫలితం అనే క్రమంలో వివరాలను నమోదు చేయడం ద్వారా, ఒక నిర్దిష్ట ప్రవర్తనకు ముందు మరియు తర్వాత జరిగిన సంఘటనల మొత్తం క్రమాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోగలరు.

ఈ అవగాహన తల్లిదండ్రులు మరియు థెరపిస్టులు తగిన విధానాలను రూపొందించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు:

  •  అరవడం బదులుగా, “నా బొమ్మను తిరిగి ఇవ్వండి” వంటి మాటలతో తమ అవసరాన్ని వ్యక్తపరచడం పిల్లలకు నేర్పించడం.
  •  ప్రవర్తనను కారణమయ్యే  పరిస్థితులను తగ్గించేలా పరిసరాలను సిద్ధం చేయడం  (ఉదాహరణకు, బొమ్మలను పంచుకోవడం లేదా క్రమబద్ధమైన ఆటలను ప్రోత్సహించడం).
  •  సానుకూల ప్రవర్తనలను ప్రోత్సహించే విధంగా స్పందించడం  (ఉదాహరణకు, : పిల్లలు ప్రశాంతంగా తమ అవసరాన్ని చెప్పినప్పుడు వారిని మెచ్చుకోవడం లేదా ప్రోత్సహించడం)

ABC చార్ట్‌ను ఉపయోగించే ఒక ఉదాహరణ

తేదీ మరియు సమయంకారణమైన పరిస్థితిప్రవర్తనఫలితం
ఆగస్టు 27, ఉదయం 10 గంటలుపిల్లలు ఆడుకుంటున్న బొమ్మను తీసుకోవడంగట్టిగా అరవడంపిల్లల దృష్టిని మరొక కార్యకలాపం వైపు మళ్లించారు
ఆగస్టు 27, సాయంత్రం 7 గంటలుపిల్లలకు చాక్లెట్ తినడానికి అనుమతించలేదుపిల్లలను మందలించారు
ఆగస్టు 29 ఉదయం 9 గంటలుపిల్లలు చాలా గంటల పాటు మాల్‌లో నడిచారుపిల్లలను ఇంటికి తీసుకువెళ్లారు
ఆగస్టు 30 ఉదయం 11 గంటలుపిల్లలు కొత్త వ్యక్తులతో కూడిన ఒక వేడుకకు హాజరయ్యారుకొత్తగా పరిచయమైన పిల్లలతో ఆడుకోవడానికి వారిని స్వేచ్ఛగా వదిలారు

ABC చార్ట్ నమూనాను డౌన్‌లోడ్ చేసుకుని పిల్లల ప్రవర్తనను నమోదు చేయడానికి మరియు విశ్లేషించడానికి ఉపయోగించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సరైన మార్గదర్శకత్వం కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी