Skip to main content
Install App
If you're using:

ప్రవర్తన నిర్వహణ కోసం ABC (A-ఆంటీసిడెంట్, B- బిహేవియర్, C- కాన్సెక్వెన్సు) చార్ట్ నమూనా

Default Avatar

डॉ गौरी रेड्डी

इस भाषा में उपलब्ध है हिंदी English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

  • A – ఆంటీసిడెంట్ (కారణమైన పరిస్థితి), B – బిహేవియర్ (ప్రవర్తన), C – కాన్సెక్వెన్సు (ఫలితం) (ABC) చార్ట్ ద్వారా పిల్లలు తమ ప్రవర్తన ద్వారా ఏమి తెలియజేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
  • ఒక ప్రవర్తనకు ముందు, ప్రవర్తన జరుగుతున్న సమయంలో మరియు తర్వాత ఏమి జరుగుతుందో గమనించడం ద్వారా, ముఖ్యమైన నమూనాలు మరియు ప్రవర్తనను ప్రేరేపించే కారణాలను గుర్తించవచ్చు.
  • ప్రవర్తనలను స్పష్టంగా గమనించగలిగే చర్యల పదాల రూపంలో వివరించడం ద్వారా, వాటిని మరింత బాగా అర్థం చేసుకుని తగిన మద్దతు అందించవచ్చు.
  • ఈ సాధనం కేర్‌గివర్లు పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, వారిపై శ్రద్ధతో స్పందించడానికి, మరింత సమర్థవంతంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [203.92 KB]

ABC (A – ఆంటీసిడెంట్ (కారణమైన పరిస్థితి), B – బిహేవియర్ (ప్రవర్తన), C – కాన్సెక్వెన్సు (ఫలితం)) చార్ట్ 

ABC చార్ట్ అనేది పిల్లల ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులు మరియు సంరక్షకులు అర్థం చేసుకోవడానికి  సహాయపడే ఒక సాధనం. ప్రవర్తనను కేవలం “సమస్యాత్మక ప్రవర్తన” గా చూడకుండా, అది వారు తమ అవసరాలను లేదా భావాలను తెలియజేసే ఒక విధానంగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. మీ పిల్లలు తమ ప్రవర్తన ద్వారా ఏమి చెప్పాలనుకుంటున్నారో గుర్తించడానికి ABC చార్ట్ ఉపయోగపడుతుంది.

కారణమైన పరిస్థితి

ఇది ప్రవర్తన చూపించడానికి  ముందు జరిగిన పరిస్థితిని సూచిస్తుంది. ఇందులో పరిసరాలు, అక్కడ ఉన్న వ్యక్తులు, దినచర్యలో మార్పు, ఇంద్రియ (సెన్సరీ) సమాచారం లేదా పిల్లలను ఏదైనా చేయమని అడగడం వంటి అంశాలు ఉండవచ్చు.

ప్రవర్తన

ఇది పిల్లలు చేసిన నిర్దిష్ట చర్యను సూచిస్తుంది. మీరు గమనించిన ప్రవర్తనను స్పష్టంగా వివరించండి. ఉదాహరణకు ఏడవడం, చెవులు మూసుకోవడం, అక్కడి నుంచి పరుగెత్తి వెళ్లిపోవడం, వస్తువులను విసిరేయడం, మాట్లాడటానికి నిరాకరించడం వంటివి.

ఫలితం

పిల్లలు ఆ ప్రవర్తన చూపించిన వెంటనే ఏం జరిగిందో ఇది వివరిస్తుంది. ఆ సమయంలో ఇతరులు ఎలా స్పందించారో, వాతావరణంలో ఏవైనా మార్పులు వచ్చాయో, లేదా ఆ ప్రవర్తన వల్ల పిల్లలు ఏదైనా పొందారో లేదా ఏదైనా పరిసితి నుండి తప్పించుకున్నారా అనే విషయాలను ఇందులో నమోదు చేయవచ్చు.

అర్ధం చేసుకున్న కారణం 

పిల్లలు ఆ విధంగా ఎందుకు స్పందించి ఉండవచ్చో ప్రశాంతంగా  ఆలోచించి నమోదు చేయాలి. ఇక్కడ ఉద్దేశం తప్పు పట్టడం కాదు. వారి అవసరాలు, సౌకర్య స్థాయి, ఇంద్రియ అనుభూతులు లేదా భావోద్వేగ స్థితిని అర్థం చేసుకోవడం.

మీ పిల్లల ప్రవర్తనకు సంబంధించిన అనుభవాలను ABC చార్ట్‌లో నమోదు చేయండి. దీనివల్ల వారి ప్రవర్తనను మరింత బాగా అర్థం చేసుకుని, వారిపై శ్రద్ధతో స్పందించవచ్చు కాలక్రమేణా ఈ పరిశీలనలు ప్రవర్తనలోని నమూనాలను గుర్తించడంలో, అలాగే మీ పిల్లలు సురక్షితంగా, ప్రశాంతంగా మరియు అర్థం చేసుకున్నారని భావించడానికి  ఏ విషయాలు సహాయపడతాయో తెలుసుకోవచ్చు.

ముఖ్యమైన గమనిక

ABC చార్ట్‌ను మరింత ప్రభావవంతంగా ఉపయోగించాలంటే, మీరు నేరుగా గమనించగలిగిన విషయాలను మాత్రమే నమోదు చేయండి. భావాలు లేదా అంచనాలను సూచించే పదాల కంటే, చర్యలను వివరించే పదాలను ఉపయోగించండి. ఉదాహరణకు “బొమ్మలను విసరడం”, “ముఖాన్ని చేతులతో కప్పుకుని ఏడవడం” అని రాయండి కానీ “కోపంగా ఉంది”, “నిరాశకు గురైంది” అని రాయకండి.

ఇలా నమోదు చేయడం వల్ల స్పష్టమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు థెరపిస్టులు కలసి పనిచేయడానికి సహాయపడుతుంది.

అదనపు సహాయం మరియు వనరులు

మీ పిల్లలకు మద్దతు అందించడంలో ABC చార్ట్ ఎలా ఉపయోగపడుతుందో మరింత బాగా అర్థం చేసుకోవడానికి, మీరు డా. గౌరి రెడ్డి గారి వీడియో చూడవచ్చు, ఇందులో ABC చార్ట్ సహాయంతో ప్రవర్తన నిర్వహణకు సంబంధించిన ఆచరణాత్మక విధానాలు వివరించడం జరిగింది.

అలాగే, ABC చార్ట్‌ను దశలవారీగా ఎలా పూరించాలో చూపించే (ఇంగ్లీషు)  వీడియోను కూడా చూడవచ్చు.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సరైన మార్గదర్శకత్వం కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी