Skip to main content
Install App
If you're using:

ప్రత్యేకఅవసరాలున్నవారికోసంగుర్తింపుకార్డు – UDID

Default Avatar
Nayi Disha Team
Also available in: हिंदी English
Like Icon 0Likes
Download Icon 0 Downloads

Key Takeaways:

  1. UDID అనేది ప్రత్యేక అవసరాలున్నవ్యక్తుల (PwD)కు పథకాలు, సేవలు అందించేందుకు భారత ప్రభుత్వంచే జారీ చేయబడిన ఒక అధికారిక గుర్తింపు కార్డు.
  2. 2016, RPWD చట్టం ప్రకారం అభివృద్ధి లోపాలున్న వారు దీనికి అర్హులు.
  3. స్వావలంబన్ వెబ్ సైట్ నుండి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  4. నయీ దిశా యొక్క “మీ హక్కులు తెలుసుకోండి” (KYR) అనే కార్యక్రమం కుటుంబాలకు ఈ ప్రక్రియను మరియు మరెన్నో అంశాలను దశల వారీగా అర్థం చేసుకునేలా మార్గనిర్దేశం చేస్తుంది.

UDID కార్డు అంటే ఏమిటి?

UDID అనేది ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులకు అందచేసే ఒక గుర్తింపు కార్డు. సాధికారత విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కార్యక్రమం, అర్హులైన వ్యక్తుల వివరాలను కేంద్రీకృత డేటాబేస్‌ను సృష్టించడంలో సహాయపడుతూ, లబ్ది పొందే ప్రక్రియను సులభతరం చేస్తుంది.

దీనికి ఎవరు అర్హులు?

2016, వ్యక్తుల హక్కుల చట్టం (RPWD) కింద గుర్తింపు పొందిన శక్తి లోపాలున్న ఏ వ్యక్తి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో క్రింది వర్గాల వారు కూడా ఉంటారు:

  • అభివృద్ధి సంబంధిత లోపాలు కలిగిన వారు
  • శారీరక, ఇంద్రియ, మేధో లేదా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన లోపాలున్న వారు

UDID కార్డు వలన పొందే ప్రయోజనాలు:

  1. ప్రభుత్వ పథకాలను సులభంగా పొందవచ్చు.

ప్రత్యేక అవసరాలున్న వక్తులు పింఛను, స్కాలర్ షిప్పులు, నైపుణ్య శిక్షణ (స్కిల్ ట్రైనింగ్) ఇంకా మొదలైన సేవలు/లబ్ది పొందటానికి ప్రతిసారి వివిధ డాక్యుమెంట్లను సమర్పించకుండా ఒక కార్డు తోనే పొందే వీలును ఈ UDID కార్డు కల్పిస్తుంది.

  1. విద్య, ప్రయాణం, ఇంకా ఆరోగ్య సేవలలో రాయితీలు పొందవచ్చు.

UDID కార్డు కలిగిన వ్యక్తులు రైలు, బస్సు ప్రయాణాలలో మినహాయింపు పొందవచ్చు. పాఠశాలలో పరీక్షల సమయంలో సహాయం పొందవచ్చు. ఆరోగ్య సేవల పరంగా, ఆసుపత్రులలో సహాయంతో కూడిన వైద్యం, సహాయ ఉపకరణాలను పొందవచ్చు.

  1. దేశం అంతటా వర్తిస్తుంది.

మీరు ఒక రాష్టం నుండి మరొక రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు, ప్రత్యేక అవసరాల ధ్రువపత్రం (డిసెబిలిటీ సర్టిఫికెట్) ను కొత్తగా తీసుకొనవసరం ఉండదు. దేశం అంతటా, కేంద్రపాలిత ప్రాంతాలలో కూడా ఈ UDID కార్డు వర్తిస్తుంది.

  1. తక్కువ పేపర్‌వర్క్

ఈ కార్డు ఒక గుర్తింపు పత్రం గానూ, అర్హతను నిర్ధారించే ధృవీకరణ పత్రం గానూ పనిచేస్తుంది. అందువల్ల, అర్హతను చూపించడానికి అనేక పత్రాలు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

  1. మెరుగైన చేరికకు మద్దతునిస్తుంది.

UDID ద్వారా వ్యక్తులు తగిన సేవలు, సహాయం సులభంగా పొందగలరు. ఇది వారి రోజువారీ జీవితంలో జీవన ప్రమాణాలను, అవకాశాలను మరియు గౌరవాన్ని మెరుగుపరుస్తుంది.

UDID కార్డు లో ఎటువంటి వివరాలు ఉంటాయి?

కార్డు లో ఉండే వివరాలలో:

  • ప్రాథమిక వ్యక్తిగత వివరాలు
  • ఎంత శాతం లోపం కలిగి ఉన్నారు 
  • వైద్య మూల్యాంకన వివరాలు

ఈ సమాచారం వనరులు మరియు అవసరమైన సౌకర్యాలను సమానంగా అందించడానికి సహాయపడుతుంది.

ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి?

దరఖాస్తు ప్రక్రియ మొత్తం స్వావలంబన్ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో ఉంటుంది.  

దశల వారీగా దరఖాస్తు ప్రక్రియ:

  1.  అధికారిక UDID పోర్టల్ www.swavlambancard.gov.in ను సందర్శించాలి

UDID కార్డు నమోదుకు ఇది ప్రభుత్వ అధికారిక వేదిక.

  1. ‘Apply for Disability Certificate and UDID Card’ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఇక్కడి నుండి నమోదు ప్రక్రియ మొదలవుతుంది.
  1. వ్యక్తిగత వివరాల నమోదు 

మీ వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి. ఇందులో ఇవి ఉంటాయి:

  • పేరు
  • జనన తేది
  • లింగం
  • చిరునామా
  • సంప్రదించ వలసిన వివరాలు (కాంటాక్ట్ డీటెయిల్స్): ఇమెయిల్ మరియు మొబైల్ నంబర్

ఈ వివరాలు మీ అధికారిక పత్రాలతో (ఆధార్ వంటి పత్రాలు ఉంటే వాటితో) సరిపోవాలని నిర్ధారించుకోండి.

  1. ఎటువంటి లోపాన్ని కలిగి ఉన్నారో వివరాలు ఇవ్వాలి 

కింద సూచించిన వివరాలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది.

  • ఎటువంటి అభివృద్ధి లోపం (2016 RPWD హక్కుల చట్టం ప్రకారం)
  • పొందుపరచిన లోపం తాత్కాలికమైనదా లేదా శాశ్వతమైనదా 
  • మీకు ఇప్పటికే డిసెబిలిటీ సర్టిఫికెట్ ఉందా (UDID కార్డు కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఇది ఉపయోగకరంగా ఉంటుంది) 

ఒకవేళ మీకు ఈ విషయంలో ఏదయినా సందేహం ఉంటే, మీరు మూల్యాంకనం చేయించుకున్న వైద్యుడిని/ఆసుపత్రి సంప్రదించండి.

  1. అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి

సాధారణంగా అవసరమయ్యే డాక్యుమెంట్ల వివరాలు:

  • ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
  • ధ్రువీకరణ పత్రాలు (ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, మొదలైనవి)
  • నివాస ధ్రువీకరణ పత్రము
  • డిసెబిలిటీ సర్టిఫికెట్ (మీ దగ్గర ఉన్నట్లయితే)
  • దరఖాస్తుదారుని వేలిముద్ర/సంతకం (స్కాన్ చేసినవి)

సూచన: అప్ లోడ్ చేసే ప్రక్రియలో సమయం వృధా కాకుండా ఉండేందుకు ఈ డాక్యుమెంట్లను అన్ని స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోండి

  1. వైద్య అధికారం ఎంచుకోండి

మీకు ఇప్పటికే ప్రత్యేక అవసరాల ధ్రువపత్రం లేకపోతే, అంచనా కోసం మీరు సమీపంలోని వైద్య అధికారిని ఎంచుకోవాలి. దీని కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆమోదించబడిన ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాల జాబితాను అందిస్తుంది.

  1. ఫారమ్ సమర్పించండి

అవసరమైన అన్ని వివరాలను ఇచ్చి, పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, ఫారమ్‌లోని సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. తరువాత “Submit” పై క్లిక్ చేయండి. 

మీకు ఒక అప్లికేషన్/రెఫరెన్స్ నంబర్ వస్తుంది. ఈ నంబర్‌ను సురక్షితంగా ఉంచుకోండి, ఎందుకంటే మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి ఇది అవసరం అవుతుంది.

సంబధిత అంశం:  UDID ను ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలి?

దరఖాస్తు చేసిన తర్వాత ఏమి జరుగుతుంది?

  1. పత్రాల పరిశీలన – మీరు సమర్పించిన సమాచారం మరియు పత్రాలను అధికారులు పరిశీలిస్తారు.
  2. వైద్య పరీక్ష అపాయింట్మెంట్ (అవసరమైతే) – మీ వద్ద సరైన ధ్రువపత్రం లేకపోతే, మీరు ఎంచుకున్న ఆసుపత్రిలో వైద్య పరీక్షకు తేదీ కేటాయించబడుతుంది.
  3. ఆమోదం మరియు జారీ – పత్రాలు మరియు వైద్య పరీక్ష నివేదికను సమీక్షించిన తరువాత, మీకు డిజిటల్ ధ్రువపత్రం మరియు UDID కార్డు జారీ అవుతుంది.
  4. UDID కార్డు డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి – పోర్టల్‌లో లాగిన్ అయి UDID కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవసరమైతే, పోస్టు ద్వారా ఫిజికల్ కార్డు పొందడానికి అభ్యర్థించవచ్చు.

మీరు సులభంగా దరఖాస్తు చేసుకునేలా, పైన అందచేసిన ప్రెజెంటేషన్ కవర్ చేసిన అంశాలు ఇవి:

  • UDID అంటే ఏమిటి?
  • అర్హత ఎవరికుంది?
  • ఎలా దరఖాస్తు చేయాలి?
  • నమోదు కోసం అవసరమైన పత్రాలు
  • నమోదుకి తర్వాతి దశలు
  • కార్డు హోల్డర్లకు అందుబాటులో ఉన్న రాయితీల జాబితా

దరఖాస్తు ప్రక్రియను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, మీరు దశలవారీగా చూపించే వీడియో గైడ్ కూడా చూడవచ్చు.

UDID కోసం దరఖాస్తు చేయడానికి తరచుగా అవసరమయ్యే డిసెబిలిటీ సర్టిఫికేట్ పై ప్రెజెంటేషన్ కూడా తప్పక చూడండి.

ఈ సమాచారాన్ని సిద్ధం చేయడంలో సహకరించినందుకు మేము ఉమ్మీద్ చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

మీకు ఈ విషయం లేదా దీనికి సంబంధించిన ఇతర అంశాలపై మరింత మార్గదర్శకం కావాలనుకుంటే, నయీ దిశా యొక్క “Know Your Rights ” (KYR) కార్యక్రమం మీకు సహాయం చేస్తుంది. దీని ద్వారా మీరు పొందగలిగేది.

  • పథకాల మరియు ప్రయోజనాల వివరాలు
  • న్యాయ మరియు ఆర్థిక మార్గదర్శనం
  • మీ బిడ్డ భవిష్యత్తు కోసం ప్రణాళిక చేయడంలో సహాయపడే వనరులు

UDID కార్డు కేవలం ఒక పత్రం మాత్రమే కాదు – ఇది అనేక కీలకమైన సేవలు మరియు సహాయాలను పొందడానికి తలుపులు తెరిచే తాళం చెవి వంటిది. విద్యా సౌకర్యాలు మరియు రవాణా రాయితీల నుండి ఆరోగ్య సేవలు మరియు ఆర్థిక సహాయం వరకు, UDID ప్రత్యేక అవసరాలున్న వ్యక్తు

చాట్ బోట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి లేదా వాట్సాప్ నంబర్  844-844-8996  లో “KYR ” అని టైపు చేయండి

ఉచిత హెల్ప్ లైన్: 844-844-8996  

ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ బాషలలో ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు.

Disclaimer:
This guide is for informational purposes only. Please consult a qualified health practitioner for proper guidance tailored to your child’s specific needs.

సూచన: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Tags:
Write Blog

Share your experiences with others like you!

English