Skip to main content
Install App
If you're using:

ప్రత్యేకఅవసరాలున్నపిల్లల్లోకమ్యూనికేషన్అభివృద్ధికిముఖ్యమైనసూచనలు

Default Avatar

Nayi Disha Team

Also available in: हिंदी English
Like Icon 0Likes
Download Icon 0 Downloads

Key Takeaways:

  1. ప్రతి పిల్లవాడు తనదయిన శైలిలో వివిధ రకాలుగా సంభాషణ జరుపుతాడు- అవి మాటల ద్వారా కానీ, సంకేతాల ద్వారా కానీ, శబ్దాలు లేదా ముఖకవళికలు ద్వారా కానీ ఉండవచ్చు.
  2. ఇంట్లో సంభాషణను ప్రోత్సహించడం వల్ల పిల్లలు పాఠశాల లేదా థెరపీలకు మించి తమను తాము వ్యక్తపరచుకోవడానికి సహాయపడుతుంది.
  3. భాషను అభివృద్ధి చేసుకోవడానికి, బంధాలను పెంపొందించుకోవడానికి ఆటలు కీలకమైనవి.
  4. సమర్ధవంతమైన కమ్యూనికేషన్ కొరకు కొన్ని వ్యూహాలు-
  • మాట్లాడే ముందు పిల్లవాడి దృష్టిని ఆకర్షించాలి.
  • స్పష్టంగా మరియు ఖచ్చితత్వంగా మాట్లాడాలి.
  • ప్రతిరోజూ పిల్లలను ఆటలకు ప్రోత్సహించడం వలన వారి భావ వ్యక్తీకరణకు తోడ్పడుతుంది.

      5. ఒక పిల్లవాడు ప్రత్యేకంగా ఎలా మెలుగుతాడో అర్థం చేసుకోవడం వారి అభివృద్ధికి తోడ్పడుతుంది.

Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [2.62 MB]

పైన ఉన్న ఇన్ఫోగ్రాఫిక్ లో మేధోవైకల్యం మరియు అభివృద్ధి జాప్యాలను ఎదుర్కొంటున్న పిల్లలకు కమ్యూనికేషన్ ను ప్రోత్సహించే ఉపయోగకరమైన మార్గాలను పేర్కొనడం జరిగింది.

వివిధ రకాల కమ్యూనికేషన్ పద్దతులను ప్రోత్సహించడం

ప్రతి పిల్లవాడికి ఒక ప్రత్యేకమైన సంభాషణా శైలి ఉంటుంది – అవి మాటల ద్వారా కావచ్చు, సంకేతాల ద్వారా కావచ్చు, శబ్దాలు లేదా ముఖకవళికలు ద్వారా కానీ ఉండవచ్చు. ప్రతి భావవ్యక్తీకరణ విధానమూ అర్థవంతమైనదని గుర్తించి పిల్లల వ్యక్తిగత సంభాషణా శైలులను ప్రోత్సహించే సహాయక వాతావరణాన్ని ఇంట్లో సృష్టించడం చాలా ముఖ్యం.

కుటుంబ సభ్యులు ప్రతిరోజూ పుస్తకాలు కలిసి చదవడం, వినోదకర ఆటల్లో పాల్గొనడం లేదా తమ సాధారణ రోజువారీ విషయాల గురించి మాట్లాడుకోవడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు పిల్లలకు తమ భావాలను వ్యక్తపరచడం సాధన చేసి మెరుగుపరచుకునే విలువైన అవకాశాలను అందించగలుగుతారు.

ఈ ప్రోత్సాహక వాతావరణం పాఠశాలలో లేదా థెరపీ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను బలపరచడమే కాకుండా, పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారు అది విలువైనదిగా, అర్థం చేసుకున్నారనే భావనను కలిగిస్తుంది. కాలక్రమంలో ఇటువంటి సహాయక చర్యలు పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో మరింత సమర్ధవంతంగా ఒక ప్రత్యేకమైన రీతిలో అనుసంధానమవ్వడానికి సహాయపడతాయి.

అభివృద్ధి పరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న పిల్లలతో సంభాషించేందుకు ముఖ్యమైన సూచనలు

1.మాట్లాడే ముందుగా పిల్లవాడి దృష్టిని మీ వైపు తిప్పుకోవాలి

సంభాషణను ప్రారంభించే ముందు, మీ పిల్లవాడి దృష్టి మీ వైపు ఉందని నిర్ధారించుకోవడం ముఖ్యం. ముఖ్యంగా అభివృద్ధి పరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న పిల్లలు తాము చేస్తున్న పనిలో లేదా ఇంద్రియానుభూతిలో ఎక్కువగా మునిగిపోతారు. అందువల్ల వారు వెంటనే దృష్టి మార్చుకోలేకపోవచ్చు. వారి దృష్టిని ఆకర్షించడానికి:

  • మీ పిల్లలు మీతో మాట్లాడుతున్నప్పుడు వారి కంటి స్థాయికి తగ్గట్టుగా ఉండటం వల్ల వారు సురక్షితంగా మరియు మీతో మరింత కనెక్ట్ అయినట్లు భావిస్తారు.
  • మాట్లాడటం ప్రారంభించకముందు వారిని పేరుతో పిలవాలి దీని వలన మీరు వాళ్లతోనే మాట్లాడుతున్నారన్న సంకేతం వస్తుంది.  
  • మీ కళ్ళలోకి నేరుగా చూసే వరకు లేదా స్పష్టమైన సంకేతం వచ్చేవరకు వేచి ఉండాలి.   
  • మౌఖిక సంకేతాలు సరిపోకపోతే సున్నితమైన స్పర్శ లేదా దృశ్య సంకేతాలు ఇవ్వడం వలన వారి దృష్టిని మీ వైపు తిప్పుకోగలుగుతారు.

పిల్లవాడు తనను చూసినట్లు మరియు కనెక్ట్ అయినట్లు భావించినప్పుడు వారు పరస్పర చర్యలలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉంటుంది.

2. మీరు చెప్పాల్సిన విషయాన్ని సరైన రీతిలో మరియు సరైన స్వరంతో చెప్పాలి.

మీరు ఎంచుకునే మాటలు మరియు మీరు ఉపయోగించే స్వరం ఒక పిల్లవాడు సంభాషణను ఎలా అర్థం చేసుకుంటాడో, ఎలా స్పందిస్తాడో అనే దానిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అభివృధి పరంగా సవాళ్లు ఎదుర్కొనే పిల్లలు ముఖ్యంగా ఇంద్రియ సున్నితత్వం ఉన్నవారు లేదా సంభాషణలో భిన్నతలు ఉన్నవారు, స్వరం లేదా శబ్దం లోని స్వల్ప మార్పులను మరింత సులభంగా గమనించగలరు. సురక్షితమైన మరియు ప్రోత్సాహక వాతావరణాన్ని పెంపొందించేందుకు:

  • పిల్లవాడు అర్థం చేసుకునే విధంగా సులభమైన మరియు స్పష్టమైన భాషను ఉపయోగించండి.
  • క్లిష్టమైన సూచనలను చిన్న, సులభంగా అనుసరించగల దశలుగా విభజించండి.
  • ఆందోళన లేదా అయోమయాన్ని తగ్గించడానికి ప్రశాంతమైన మరియు సున్నితమైన స్వరంతో కొనసాగించండి.
  • వ్యంగ్యభాష లేదా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్న భాషను ఉపయోగించకండి.

మీరు మీ భాషనీ, స్వరాన్ని ఆలోచించి మార్చుకున్నప్పుడు, అది పిల్లవాడు అర్థం చేసుకున్నట్టుగా, భద్రంగా ఉన్నట్టుగా చేస్తుంది. ఈ విధానం సమర్థవంతమైన సంభాషణకు మార్గం సుగమం చేస్తుంది.

3. ప్రతిరోజూ కలిసి ఆటలకు సమయం కేటాయించడం ద్వారా అనుబంధాన్ని పెంచడమే కాక భాషా అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది

ఆట అనేది పిల్లల్లో నమ్మకాన్ని పెంచడానికి, భావోద్వేగ అనుబంధాన్ని పెంపొందించడానికి మరియు సంభాషణను ప్రోత్సహించడానికి శక్తివంతమైన మార్గం. అభివృద్ధి పరంగా సవాళ్లు ఎదుర్కొనే పిల్లలకు ఆటలు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు సామాజిక సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఒక వారధిలా పనిచేస్తాయి. ఆటల్లో పాల్గొనడం ద్వారా:

  • మీ పిల్లవాడి ఆసక్తిని అనుసరిస్తూ కొన్ని సూచనలతో వారికి ఆడుకునే అవకాశం ఇవ్వాలి ఇది వారి ఆత్మవిశ్వాసం మరియు స్వతంత్రతను పెంచుతుంది. 
  • వారికి ఆసక్తి కలిగించేవిధంగా ఇష్టమైన బొమ్మలు, కార్యకలాపాలు లేదా ఇంద్రియ అనుభవాలను ఆటలో చేర్చండి.  
  • ఆట ఆడుతున్నప్పుడు ఏం జరుగుతోందో చెబుతూ సహజంగా ఉండే కొత్త పదాలు మరియు పద్ధతులు పరిచయం చేయండి.
  • సామాజిక సాన్నిహిత్యం మరియు సమస్యలకు పరిష్కార నైపుణ్యాలను చూపించడానికి సృజనాత్మక ఆటలను ప్రోత్సహించండి.

నాణ్యమైన ఆట సమయం తల్లిదండ్రులు-పిల్లల మధ్య అనుబంధాన్ని బలపరచడమే కాకుండా భాషా అభివృద్ధి, భావోద్వేగ నియంత్రణ, మరియు మేధో వికాసాన్ని వినోదంగా, సౌకర్యవంతమైన వాతావరణంలో ప్రోత్సహిస్తుంది.ఆట అనేది పిల్లవాడు ప్రపంచంతో ఎలా మెలుగుతాడో అర్థం చేసుకోవడానికి శక్తివంతమైన మార్గం. పై ఇన్ఫోగ్రాఫిక్‌లో మరిన్ని సంభాషణ సూచనలను పరిశీలించండి.

అలాగే, లావణ్య తన కుమారుడు కేదార్‌తో చేసిన ప్రయాణం ను పంచుకుంటున్న వీడియోను చూడండి. అతనికి అనుకూలంగా ఉన్న మార్గాల్లో ఎలా సంభాషిస్తాడో ఆమె వివరిస్తుంది

ధన్యవాదాలు:మేము మా తల్లిదండ్రుల ప్రతినిధి త్రివేణి గోస్వామి మరియు ఆమె సంస్థ ది ఆటిజం నిచ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. విలువైన సహకారం అందించిన టబితా వోల్ఫ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ.డి.హెచ్.డి. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

సూచన: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English