Skip to main content
Install App
If you're using:

నిర్దిష్టఅభ్యాస/విద్యాలోపాలగురించిమాట్లాడుకుందాం

FaridaRaj_SEducator
Farida Raj
Also available in: हिंदी English
Like Icon 0Likes
Download Icon 0 Downloads

Key Takeaways:

  • నిర్దిష్ట అభ్యాస/విద్యా లోపాలను(ఎస్.ఎల్.డి) అర్థం చేసుకోవడం.
  • అవి ఎందుకు తప్పుగా అర్థం చేసుకోబడతాయి.
  • అవి పిల్లలపై చూపే ప్రభావం.
  • ప్రాసెసింగ్, ఆర్గనైజింగ్, చదవడం, రాయడం లేదా గణితంలో తేడాలు.
  • సంకేతాలను గమనించడం.
  • ఎస్.ఎల్.డి లో రకాలు: డిస్ప్రాక్సియా, డిస్కాల్కులియా, డిస్లెక్సియా, మరియు డిస్గ్రాఫియా.
  • సహాయం మరియు వనరులు.
  • సరైన మార్గదర్శనం పొందడంనిపుణుల అంచనా మరియు సహాయం మార్పు తేగలవు.

మన పిల్లల్లో నిర్దిష్ట అభ్యాస/విద్యా లోపాల గురించి మాట్లాడుకుందాం…

వాస్తవం

విద్యా లోపాలు ఉన్న పిల్లలు చాలా తెలివైనవారు, బాగా మాట్లాడగలవారు, మరియు ఎంతో సామర్థ్యం కలవారు. అయితే, వారి మెదడు సమాచారం ప్రాసెస్ చేసే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది – ఇది తప్పు కాదు, కేవలం భిన్నత మాత్రమే. ఈ తేడాలు చదవడం, రాయడం, స్పెల్లింగ్, లేదా గణితం వంటి విషయాల్లో ప్రభావం చూపవచ్చు, వారు ఎంత కష్టపడ్డా కూడా ఇది బయటపడుతుంది.

పెద్దలకు సవాలు

ఇది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గందరగోళంగా అనిపించవచ్చు. ఎందుకంటే, ఒక పిల్లవాడు ఆసక్తిగా ఉండి, బాగా మాట్లాడి, ప్రపంచంపై కుతూహలం చూపించినా కూడా పాఠశాల పనిలో ఇబ్బంది పడవచ్చు. దీనిని చాలా సార్లు ప్రోత్సాహం లేకపోవడం, అలసత్వం లేదా అలక్ష్యం అని పొరబడటం సులభం.  కానీ నిజానికి అది అసలు నిజం కాదు.

పిల్లవాడి అనుభవం

పిల్లలకు తమ సామర్థ్యాలు మరియు పాఠశాల అంచనాల మధ్య పొంతన లేకపోవడంతో నిరాశ, ఆత్మవిశ్వాసం తగ్గడం మరియు భావోద్వేగ ఇబ్బందులకు దారి తీస్తుంది. అభ్యాస/విద్యా లోపాలున్న చాలా మంది పిల్లలు తాము “చాలా తెలివైనవారు కాదని” లేదా “తమలో ఏదో తప్పు ఉందని” నమ్మడం ప్రారంభిస్తారు – నిజానికి వారు కేవలం భిన్నమైన రీతిలో నేర్చుకుంటారు.

ప్రత్యేక విద్యా లోపాలు (ఎస్.ఎల్.డి) అంటే ఏమిటి?

నిర్దిష్ట విద్యా లోపాలు (ఎస్.ఎల్.డి) అనేవి మెదడు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానంలో జీవితాంతం ఉండే తేడాలు. ఈ తేడాలు చదవడం, రాయడం, స్పెల్లింగ్, సమన్వయం, లేదా గణితం వంటి నైపుణ్యాలపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా, ఎస్.ఎల్.డి లు సరైన బోధన లేకపోవడం, తక్కువ తెలివితేటలు, చూపు లేదా వినికిడి సమస్యలు, లేదా కృషి లోపం వల్ల రావు.

అభ్యాస/విద్యా లోపాలలో రకాలు

పిల్లవాడి అవసరాలను బాగా అర్థం చేసుకోవడానికి, నిర్దిష్ట విద్యా లోపాల రకాలను తెలుసుకోవడం ఉపయోగకరం:

  • డిస్లెక్సియా: చదవడం, స్పెల్లింగ్, మరియు అక్షరాలు లేదా శబ్దాలను గుర్తించడం పై ప్రభావం చూపుతుంది. పిల్లవాడు అక్షరాలను తారుమారుగా చదవవచ్చు, నెమ్మదిగా చదవవచ్చు లేదా శబ్దాల కలయిక (ఫోనిక్స్) లో ఇబ్బంది పడవచ్చు.
  • డిస్గ్రాఫియా: చేతిరాత, స్పెల్లింగ్ మరియు వ్రాయడం పై ప్రభావం చూపుతుంది. పిల్లవాడు నెమ్మదిగా రాయవచ్చు లేదా తన ఆలోచనలను పేపర్‌పై సక్రమంగా రాయడంలో ఇబ్బంది పడవచ్చు.
  • డిస్కాల్కులియా: సంఖ్యలు, గణితం, మరియు కొలతలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. పిల్లవాడు సమయం, కొలతలు లేదా సులభమైన లెక్కల్లో కష్టపడవచ్చు.

డైస్ప్రాక్సియా: శరీర కదలికలు, సమన్వయం, మరియు ప్లానింగ్‌లో ఇబ్బంది కలుగుతుంది. ఇది పనుల నిర్వహణ, జ్ఞాపకం మరియు కొన్ని సందర్భాల్లో మాటలపై కూడా ప్రభావం చూపవచ్చు.

నిర్దిష్ట విద్యా లోపాల సంకేతాలు ఏమిటి?

కొన్ని ప్రారంభ సంకేతాలు ఇవి కావచ్చు:

  • బహుళ దశల సూచనలను అనుసరించడంలో కష్టాలు ఎదురుకావచ్చు.
  • ఇప్పుడే చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవడంలో కష్టాలు రావచ్చు.
  • చదవడం లేదా వ్రాయడం వంటి పనులను తప్పించుకోవచ్చు.
  • కత్తెర వాడటం లేదా పెన్సిల్ పట్టుకోవడం వంటి సూక్ష్మ కదలికల పనుల్లో ఇబ్బందులు కలగవచ్చు.
  • గణిత సూత్రాలను అర్థం చేసుకోవడం లేదా నమూనాలను గుర్తించడం కష్టంగా అనిపించవచ్చు.

అయితే, ప్రతి పిల్లవాడు ప్రత్యేకమైనవాడు. ఈ సంకేతాలు కొన్ని కనిపించినంత మాత్రాన పిల్లవాడికి ఎస్.ఎల్.డి ఉందని అర్థం కాదు. క్రమబద్ధమైన లక్షణాలను గమనించడం, అవసరమైతే నిపుణుల ద్వారా పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.

తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఏమి చేయగలరు?

  • ఆసక్తిని చూపండి, విమర్శలు కాదు. ఒక పిల్లవాడు కష్టపడుతున్నప్పుడు, “అతను సరైన ప్రయత్నం చేయడం లేదు” అని అనుకోవడం కన్నా. “ఇప్పుడు అతనికి నేర్చుకోవడంలో ఏమి అడ్డంకిగా మారుతోంది?” అని ఆలోచించండి.
  • సురక్షితమైన నేర్చుకునే వాతావరణాన్ని సృష్టించండి. ఎస్.ఎల్.డి ఉన్న పిల్లలకు ఎక్కువ సమయం లేదా భిన్నమైన పద్ధతులు అవసరం కావచ్చు. ఒత్తిడి తగ్గించడం, విరామాలు ఇవ్వడం, భావోద్వేగ ధృవీకరణ ఇవ్వడం చాలా సహాయపడుతుంది.
  • పిల్లవాడి బలాలను ఉపయోగించి నేర్పించండి. ఉదాహరణకు, చిత్రాలు గీయడం ఇష్టపడే పిల్లవాడు, మైండ్ మ్యాప్స్ లేదా బొమ్మల రూపంలో కాన్సెప్ట్‌లను సులభంగా గుర్తుంచుకోవచ్చు.
  • చిన్న విజయాలను కూడా ప్రోత్సహించండి. అభివృద్ధి ఎప్పుడూ ఒకే రీతిలో ఉండకపోవచ్చు. ప్రోత్సాహం మరియు సానుకూల అభిప్రాయం, మనం అనుకున్నదానికంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటాయి.

ప్రతి పిల్లవాడికి ఒకటి కంటే ఎక్కువ సవాళ్ల కూడిన సంకేతాలు కనిపించవచ్చు, మరియు ఏ ఇద్దరు పిల్లలలో ఈ తేడాలు ఒకే విధంగా ఉండవు.

ఇంట్లో సహాయ పద్ధతులు

తల్లిదండ్రులు/సంరక్షకులకు చిన్న, సులభంగా నిర్వహించగల సాధనాలను అందించండి:

  • పనులను చిన్న చిన్న దశలుగా విభజించండి.
  • దృశ్య (విజువల్) షెడ్యూల్లు లేదా టైమర్లు ఉపయోగించండి.
  • చదువుతున్నప్పుడు కదలికల విరామాలను ప్రోత్సహించండి.
  • ఎంపికలు ఇవ్వండి (ఉదా: “ముందు గణితం మొదలుపెడతావా లేదా చదవడమా?”)
  • చదవడం/వ్రాయడం కష్టంగా ఉంటే ఆడియోబుక్స్ లేదా వాయిస్ టైపింగ్ ఉపయోగించండి.

పాఠశాలతో సహకరించడం 

ఉపాధ్యాయులతో బహిరంగ సంభాషణను ప్రోత్సహించండి:

  • ఉపాధ్యాయులు లేదా ప్రత్యేక శిక్షకులతో క్రమం తప్పకుండా చర్చలు జరపండి.
  • మీ పిల్లవాడికి ఏ విధానాలు ఉపయోగకరంగా ఉన్నాయో తెలియజేయండి.
  • పాఠశాలలో అదనపు సమయం, మౌఖిక పరీక్షలు లేదా ప్రత్యామ్నాయ మూల్యాంకనాలు వంటి సౌకర్యాలు ఇస్తారా అని తెలుసుకోండి.
  • అవకాశం ఉంటే, పాఠశాల ద్వారా మానసిక-విద్యా మూల్యాంకనం (సైకలాజికల్ అసెస్మెంట్) చేయమని కోరండి.

గమనిక: మీ పిల్లవాడిలో విద్యా లోపాల సంకేతాలను పరిశీలించినపుడు ఈ సంకేతాలు ప్రతి పిల్లవాడిలో వేరుగా కనిపించవచ్చని దయచేసి గుర్తుంచుకోండి. ప్రతి పిల్లవాడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎవ్వరూ అన్ని సంకేతాలు తప్పనిసరిగా ప్రదర్శించరు. అయితే, పైన వివరించిన సంకేతాలు చాలావరకు మీ పిల్లవాడి నేర్చుకునే శైలికి సరిపోతున్నాయా అని గమనించి, అవసరమైతే నిపుణుల మార్గదర్శకత్వం పొందండి. అదేవిధంగా, డిస్ప్రాక్సియా, డిస్క్యాల్కులియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా వంటి ఇతర విద్యా లోపాల గురించి కూడా తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి.

DISCLAIMER: Please note that this guide is for information purposes only. Please consult a qualified health practitioner for proper guidance.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ. డి హెచ్.డి. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.సూచన: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Tags:
Write Blog

Share your experiences with others like you!

No Related Resources Found.

No Related Services Found.
English