Skip to main content
Install App
If you're using:

ఓరోమోటర్ నైపుణ్యాలు మరియు మాట, ఆహార తీసుకోవడంలో వాటి పాత్ర

Ms Chitra Thadathil
Ms.Chitra Thadathil
Also available in: हिंदी English
Like Icon 0Likes
Download Icon 0 Downloads

Key Takeaways:

  • ఓరోమోటార్ నైపుణ్యాలు నాలుక, పెదవులు, దవడలను బలపరచి, డౌన్ సిండ్రోమ్‌ (డి.ఎస్.) ఉన్న పిల్లల్లో మాట మరియు ఆహారం తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  • నమలడం, మింగడం వంటివి సహజంగానే మాట కోసం అవసరమైన కండరాలను బలపరుస్తాయి.
  • పిల్లల ఆరోగ్య, భావోద్వేగ పరిస్థితి వారు థెరపీలో పాల్గొనగల సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.
  • ఇంద్రియ వ్యత్యాసాలు తినడం మరియు మాట్లాడే వ్యాయామాలను కఠినతరం లేదా సులభతరం చేయవచ్చు.
  • ఆట ఆధారిత కార్యకలాపాలు (ప్లే ఫుల్ ఆక్టివిటీస్) -బుడగలు ఊదటం, స్ట్రా ద్వారా ద్రవాలు త్రాగటం వంటివి ఓరోమోటార్ శక్తిని పెంచుతాయి.
  • సహజ కదలికలకు ప్రోత్సాహం ఇవ్వడం మరియు సెన్సరీ అవసరాలను పెంపొందించటం నేర్చుకునే ప్రక్రియను సులభతరం చేస్తుంది.
  • నయీ దిశా, స్పీచ్ థెరపీ వర్క్‌షాప్‌ను స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ శ్రీమతి చిత్రా తడథిల్ గారితో నిర్వహించింది. ఆమె చెప్పిన ముఖ్య విషయాలు ఇవి:

ఓరో మోటార్ నైపుణ్యాలు అంటే ఏమిటి?

ఓరోమోటార్ నైపుణ్యాలు అంటే మాట్లాడటానికి, తినటానికి ఉపయోగపడే నాలుక, పెదాలు, దవడ మరియు ఇతర కండరాల కదలికల సమన్వయం. ఈ కండరాలు చిన్నవిగా ఉండటం వల్ల చేతులు లేదా కాళ్లలా నేరుగా మార్గనిర్దేశం చేయడం సాధ్యం కాదు. అందువల్ల అవి నమలడం, మింగడం, నోటి ఆటల (ఉదా. బుడగలు ఊదటం, స్ట్రా తో తాగటం) వంటి కార్యకలాపాల ద్వారా సహజంగానే అభివృద్ధి చెందుతాయి. ఈ కండరాలను బలపరచడం వల్ల మాట స్పష్టంగా రావడమే కాకుండా తినే ప్రక్రియ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఆహారం తీసుకునే (తినే/తాగే) ప్రక్రియ మాట అభివృద్ధికి ఎలా తోడ్పడుతుంది?

  • ఒక పిల్లవాడు నమలినప్పుడు, నోటిలో ఆహారాన్ని నాలుకతో కదిలించినప్పుడు, మింగినప్పుడు లేదా వేర్వేరు వాసనల/రుచుల అన్వేషణ చేసినప్పుడు, మాట కోసం అవసరమైన కండరాలకు సహజంగానే వ్యాయామం జరుగుతుంది.
  • పెదవులు బిగించడం, నాలుక కదలికలు, దవడ స్థిరత్వం వంటి చర్యలు మాట స్పష్టతకు సహాయపడతాయి.

ఓరోమోటార్ నైపుణ్యాలను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు

  1. పూర్తి ఆరోగ్య స్థితి మరియు శరీర నియంత్రణ
  • పిల్లల శారీరక మరియు భావోద్వేగ శ్రేయస్సు వారు థెరపీలో పాల్గొనగల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
  • పిల్లలు అనారోగ్యంగా ఉన్నా, ఒత్తిడిగా ఉన్నా లేదా శరీర నియంత్రణ లోపించినా, మాట మరియు తినే వ్యాయామాలు కష్టంగా అనిపించవచ్చు మరియు తక్కువ ఫలితాలను ఇస్తాయి.
  1. సెన్సరీ ప్రాసెసింగ్ వ్యత్యాసాలు మరియు ఓరోమోటార్ నైపుణ్యాలు
  • కొంతమంది పిల్లలు నోటి ద్వారా వచ్చే స్పర్శ, రుచులను వేరుగా అనుభవిస్తారు, ఇది తినే విధానాన్నీ మాట్లాడే సామర్థ్యాన్నీ ప్రభావితం చేయవచ్చు.
  • హైపోసెన్సిటివిటీ లేదా ఇంద్రియ ప్రతిస్పందనా లోపం.
  • నోటిలో ఆహారం ఉన్నట్టు వారికి పూర్తిగా అనిపించకపోవచ్చు, దీనివల్ల నమలడం మరియు నాలుక కదలికలు కష్టంగా మారవచ్చు.
  • సెన్సరీ అనుభూతి పెంచుకోవడానికి వారు ఘాటైన రుచులు/వాసనలు   ఇష్టపడవచ్చు.
  • హైపర్సెన్సిటివిటీ (అధిక సెన్సరీ అవగాహన)
  • కొన్ని వాసనలు, ఉష్ణోగ్రతలు లేదా స్పర్శ అనుభూతులు వారికి అధికంగా అనిపించి అసౌకర్యాన్ని కలిగించవచ్చు.
  • దీని వల్ల కొన్ని ఆహారాలను తిరస్కరించడం లేదా ప్రసంగ వ్యాయామాలను భరించడం కష్టమవచ్చు.
  • మిశ్రమ ఇంద్రియ వ్యత్యాసాలు
  • కొంతమంది పిల్లలకు కొన్ని అంశాల్లో తక్కువ అవగాహన ఉండగా, మరికొన్ని అంశాల్లో అధిక సున్నితత్వం ఉంటుంది. దీని వల్ల ఆహారం మరియు మాట్లాడే విధానానికి అనూహ్య ప్రతిస్పందనలు రావచ్చు.
  1. ఆటలతో మరియు కొత్తగా ప్రయత్నించడం ద్వారా నోటి కండరాలు బలంగా అవుతాయి.
  • మాటలకు ఉపయోగపడే వివిధ కండరాలు (స్పీచ్ మజిల్స్) కేవలం ప్రాక్టీస్ ద్వారానే కాకుండా నోటి కదలికలు ద్వారా బలంగా తయారవుతాయి.
  • బుడగలు ఊదడం, స్ట్రా తో త్రాగడం, డ్రై ఫ్రూట్స్ లేదా ఎక్కువసేపు నమిలే చిరు ఆహారాలు, వింతైన నోటి కదలికలు (ఉదా: నోరు బాగాతెరచి నవ్వడం) ద్వారా సహజంగా నోటికండరాలు బలోపేతం అవుతాయి.
  • వివిధ రకాల ఆహార పదార్ధాలను నమలడం, వింతైన ముఖ కవళికలు (ఉదా: వెర్రి ముఖాలు చూపించమనడం, ముఖం చిట్లించడం), సరదాగా అనిపించే నోటి వ్యాయామాలను ప్రోత్సహించడం ద్వారా మంచి మార్పును తీసుకురావచ్చు.

ప్రోత్సాహక విధానాన్ని అమలుపరచడం:

  • ఇంద్రియ (సెన్సరీ) అభిరుచులకు ప్రాధాన్యతనివ్వడం – పిల్లలు కొన్ని ఆహారాలు లేదా వ్యాయామాలను నిరాకరిస్తే, వారి సౌకర్యానికి అనుగుణంగా విధానాన్ని మార్చండి.  
  • సహజమైన నోటి కదలికలను ప్రోత్సహించడం – నమలడం, ఊదడం, పీల్చడం మరియు సరదా మాటల వ్యాయామాలు వంటివి.
  • సరదాగా, ఆకట్టుకునే విధంగా మార్చండి – పిల్లలను ఒత్తిడి చేయకుండా, వారు ఇష్టపడే విధంగా నోటికదలిక వ్యాయామాలను రోజువారీ పనుల్లో కలపండి.

ప్రతి పిల్లవాడి నోటి కదలికల (ఓరోమోటర్) అభివృద్ధి ప్రయాణం ప్రత్యేకమైనది. సరైన సహాయం మరియు పిల్లల బలాలను గుర్తించే విధానంతో, వారు మాటలూ, తినే నైపుణ్యాలను తమకు సహజంగా, సౌకర్యంగా అనిపించే రీతిలో అభివృద్ధి చేసుకోగలరు.

అదనంగా, డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తుల దీర్ఘకాల సంరక్షణ మరియు శ్రేయస్సు గురించి తెలుసుకోవడానికి ఈ కేర్‌గివర్ మాన్యువల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ. డి హెచ్.డి. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

DISCLAIMER: Please note that this guide is for information purposes only. Please consult a qualified health practitioner for safe management.సూచన: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Tags:
Write Blog

Share your experiences with others like you!

No Related Resources Found.

No Related Services Found.
English