Skip to main content
Install App
If you're using:

మాటలతో వ్యక్తపరచలేని పిల్లలు తమ భావాలను సమర్ధవంతంగా వ్యక్తపరచుకునేందుకు ప్రత్యామ్నాయ పరికరాలు మరియు పద్ధతులు ఏ విధంగా సహాయపడతాయి?

Lavanya
K.S.Lavanya
Also available in: हिंदी English
Like Icon 0Likes
Download Icon 0 Downloads

Key Takeaways:

  1. సంభాషించడంలో సవాళ్లు అనేవి తరచుగా సంభాషణను ప్రభావితం చేసే అభివృద్ధి కండరాలకు సంభందిచిన పరిస్థితుల వలన ఉత్పన్నమవుతాయి.
  2. సంబాషణ లేని కమ్యూనికేషన్: చిరునవ్వు, తల ఊపడం, ముఖం చిట్లించడం వంటివి పిల్లలు వారి భావాలను సమర్ధవంతంగా వ్యక్తపరచడంలో సహాయపడతాయి
  3. సంభాషణా పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న పిల్లలకు సంభాషణకు మద్దతునిచ్ఛే ప్రత్యామ్నాయ పరికరాలు (..సి) ఉపయోగపడతాయి
  4. పిల్లవాడి అవసరాన్ని బట్టి ..సి పద్ధతులు లేదా పరికరాలు సాధారణ సంకేతాల నుండి పిక్చర్ బోర్డులు, కమ్యూనికేషన్ యాప్స్ వరకు విస్తరించి ఉంటాయి.
  5. వివిధ రకాల కమ్యూనికేషన్ పరికరాలను కలిపి ఉపయోగించడం వలన పిల్లవాడు ఆత్మవిశ్వాసంతో, స్వతంత్రంగా సంభాషించగలుగుతాడు.

చాలామంది పిల్లలు మాటలకు మించి పలు రకాలుగా కమ్యూనికేట్ చేస్తారు. కొందరు కొన్ని కారణాల వలన తమ భావాలను వ్యక్తపరచుకోవడం కొంత కష్టంగా ఉండవచ్చు. ఉదాహరణకు

  • నాడీవ్యవస్థలో ఉన్న వ్యత్యాసాలు సంభాషణను ఉత్పత్తి చేయడంలో ప్రభావాన్ని చూపుతాయి.  
  • కండరాల సంబంధిత సవాళ్లు సంబాషణ, ఉచ్ఛారణపై ప్రభావితం చూపుతాయి.

ఈ వ్యత్యాసాలు వారి భావాలు, ఆలోచనలు, అవసరాలు పంచుకునే సామర్ధ్యాన్ని తగ్గించవు. కాకపోతే వారు భిన్న రీతిలో వ్యక్తపరచుకుంటారు.

సంబాషణ లేకుండా కమ్యూనికేషన్ విధంగా జరుగుతుంది

కేవలం మాటల ద్వారానే కాకుండా పిల్లలు కమ్యూనికేషన్ చేయగలరు. దీనికి సాధారణ ఉదాహరణలు:

  • సంకేతాలు: చేయిని ఊపడం, చేతి ద్వారా సంకేతాలు ఇవ్వడం, వస్తువులను వేలితో చూపడం
  • ముఖాభినయాలు: చిరునవ్వు, ముఖం చిట్లించడం, కను బొమ్మలు పైకెత్తడం
  • శరీర భాష: తల ఊపడం, తల ఆడించడం

సంభాషణకు మద్దతునిచ్చే ప్రత్యామ్నాయ పరికరాల పరిచయం

పిల్లల కమ్యూనికేషన్ ను ప్రోత్సహించడానికి అనేక మార్గాలున్నాయి.

  • రోజువారీ చేతి సంజ్ఞలు మరియు సైగలు: చేతి కదలికలు, వేలితో చూపడం
  • పిక్చర్ బోర్డులు: తమ అవసరాలు లేదా ఆలోచనలను తెలియజేయడానికి తగిన చిత్రాన్ని చూపించడం
  • ఏ.ఏ.సి (ప్రత్యామ్నాయ పద్ధతులు) యాప్స్: ఇల్లు, పాఠశాల లేదా ఇతర సామాజిక వాతావరణంలో తమ ఆలోచనలను పంచుకోవడానికి మరియు వాక్య నిర్మాణానికి ఉపయోగపడే సాంకేతిక పరికరాలు.

మీ పిల్లలకున్న ప్రత్యేకమైన కమ్యూనికేషన్ శైలిని బట్టి వారు తమ ఆలోచనలను స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో పంచుకునేందుకు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ప్రత్యామ్నాయ పరికరాలు ఎంచుకోవచ్చు.

ఏ.ఏ.సి పరికరాలు ఎందుకు అవసరం

ఏ.ఏ.సి పరికరాలు సంభాషణను భర్తీ చేయలేవు కానీ కమ్యూనికేషన్ కొరకు ఇవి సరైన ప్రత్యామ్నాయాలు. వీటి ఉపయోగం ఈ విధంగా ఉంటుంది.

  • పిల్లలు తమను వ్యక్తపరచుకొనేందుకు మరిన్ని మార్గాలను అందించడం
  • కమ్యూనికేషన్ చేయడానికి ఎదురయ్యే ఇబ్బందుల వలన వచ్చే నిరాశను తగ్గిస్తాయి.  
  • సామాజిక సంబంధాల మరియు భాగస్వామ్య ప్రోత్సాహం లభిస్తుంది

సంక్షిప్త వివరణ:

  • కమ్యూనికేషన్ అనేది కేవలం సంభాషణ మాత్రమే కాదు
  • ప్రతి చిన్నారి తమ అభిప్రాయాలను వ్యక్తీకరించుకునే హక్కును కలిగి ఉంటారు.
  • పిల్లలు అనుకూల పద్దతిలో తమను వ్యక్తపరచుకునే విధంగా ఏ.ఏ.సి పరికరాలు శక్తినిస్తాయి.

సూచన: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ. డి హెచ్.డి. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

Write Blog

Share your experiences with others like you!

English