Skip to main content
Install App
If you're using:

ప్రత్యేక అవసరాలున్న అమ్మాయిల్లో యుక్తవయసు మార్పులను అర్థం చేసుకోవడం

Kavya_Gynaecologist

डॉ.काव्या प्रिया वज्राला

इस भाषा में उपलब्ध है हिंदी English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

  1.   ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు యౌవన దశ (యుక్తవయసు) గురించి చెప్పడం కాస్త క్లిష్టంగా ఉండొచ్చు: శారీరక, భావోద్వేగ లేదా మేధో అభివృద్ధి సవాళ్లు ఉండడం వల్ల యుక్తవయసులో జరిగే మార్పులను, ముఖ్యంగా నెలసరి గురించి వివరించడం మరియు నిర్వహించడం కష్టం కావచ్చు. 
  2.   ప్రత్యేక అవసరాలు ఉన్న బాలికలకు నెలసరి సమయంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి: మార్పులను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, పరిశుభ్రతను నిర్వహించడం, శారీరక అసౌకర్యం, భావోద్వేగ ప్రతిస్పందనలను ఎదుర్కోవడం వంటి సమస్యలు ఉండవచ్చు. 
  3.   శారీరక మార్పులను గుర్తించడం చాలా ముఖ్యం: బాలిక పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా కూడా తల్లిదండ్రులు ఈ దశలో జరిగే శారీరక మార్పులను గుర్తించి వాటిని సరైన విధంగా నిర్వహించాలి. 
  4.   అవగాహన మరియు భరోసా చాలా అవసరం: పిల్లలు అర్థం చేసుకునే స్థాయికి అనుగుణంగా, నిదానంగా మరియు పునరావృతంగా ఈ విషయాలను చెప్పడం ద్వారా భయం లేదా అయోమయం తగ్గించవచ్చు.
  5.   సహాయక వనరులు అందుబాటులో ఉన్నాయి: ఇక్కడ  అందుబాటులో ఉంచిన ప్రెజెంటేషన్  తల్లిదండ్రులకు సహాయ పడేలా  రూపొందించబడింది. ఇది సాధారణంగా ఎదురయ్యే ఇబ్బందులను మరియు ఆందోళనలను వివరించి, తమ పిల్లల జీవితంలోని ఈ దశను ఎలా ఎదుర్కోవాలో మార్గదర్శకత్వం ఇస్తుంది.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [506.77 KB]

ఏ తల్లిదండ్రులకైనా తమ కుమార్తె జీవితంలో యుక్తవయసు ప్రారంభంతో వచ్చే మార్పుల గురించి ఎలా వివరించాలో అర్థం చేసుకోవడం ఒక సవాలుగా ఉంటుంది. పిల్లలకు శారీరక, భావోద్వేగ లేదా మేధో అభివృద్ధికి సంబంధించిన అదనపు అవసరాలు ఉన్నప్పుడు ఇది మరింత కష్టంగా మారుతుంది. ప్రత్యేక అవసరాలు ఉన్న అమ్మాయిలకు నెలసరి సమయంలో పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 

ఈ విషయ వివరణ ఆటిజం స్పెక్ట్రమ్‌లో ఉన్న బిడ్డకు తల్లి మరియు గైనకాలజిస్టు డా. కావ్య ప్రియ వజ్రాల రూపొందించిన సమాచారాత్మక ప్రెజెంటేషన్ ఆధారంగా రూపొందించబడింది.

యుక్తవయసును అర్థం చేసుకోవడం

ప్రతి అమ్మాయి, యుక్తవయసులో శారీరకంగా మరియు భావోద్వేగంగా మార్పులను అనుభవిస్తుంది. ఈ మార్పులను తల్లిదండ్రులు గుర్తించి, ముందుగానే తమను తాము మరియు తమ పిల్లలను సిద్ధం చేయడం చాలా ముఖ్యము. ఈ సమయంలో ఎక్కువగా కనిపించే మార్పులు శరీరంలో జరుగుతాయి. అమ్మాయిల్లో ముఖ్యంగా కనిపించే మార్పులు ఇవి:

  • శరీరంపై రోమాలు పెరగడం
  • వక్షోజాల అభివృద్ధి
  • మొదటి నెలసరి రావడం
  • హార్మోన్ల మార్పులతో వచ్చే సమస్యలు — మొటిమలు, నెలసరి ముందు వచ్చే లక్షణాలు (పి.ఎం.ఎస్), చిరాకు, అలసట.

యుక్తవయసు ప్రారంభం మరియు నెలసరి

చాలా మంది అమ్మాయిల్లో నెలసరి సాధారణంగా 10 నుండి 16 సంవత్సరాల మధ్య ప్రారంభమవుతుంది. అభివృద్ధిలో ఆలస్యం ఉన్న అమ్మాయిల్లో, సాధారణంగా ఇతర పిల్లలతో పోలిస్తే నెలసరి కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుందని గమనించబడింది.

అయితే, జీవనశైలిలో వచ్చిన మార్పులు మరియు ఆహారంలో ఉండే హార్మోన్లలను పోలి ఉండే పనిచేసే కాలుష్య పదార్థాల కారణంగా, ఈ రోజుల్లో పిల్లల్లో ఈ దశ ముందుగానే ప్రారంభమవుతోంది.

మనం ఎలా సహాయం చేయగలం?

ముందుగానే ప్రారంభించండి:

  •  చిన్న వయసు నుంచే పిల్లలకు తమ శరీరం గురించి అవగాహన కల్పించండి. ఇతర విషయాలు నేర్పినట్లే, వారి వ్యక్తిగత అవయవాల పేర్లు మరియు వాటి పనితీరును కూడా వారికి చెప్పండి.
  •  గోప్యత (ప్రైవసీ) అనే భావనను పరిచయం చేయండి, ముఖ్యంగా ఈ రెండు విషయాలపై దృష్టి పెట్టండి.
    • దుస్తులు మార్చుకునేటప్పుడు తలుపులు మూసుకోవడం
    • బయట ఉన్నప్పుడు వ్యక్తిగత భాగాలను కప్పి ఉంచడం

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి

  • అందరు పిల్లలు ప్రత్యేక అవసరాలున్న వారైనా లేదా సాధారణ అభివృద్ధి కలిగినవారైనా, గౌరవం మరియు స్వీయ విలువల్లతో అభివృద్ధి చెందగలరు. అందుకే వారి స్వీయ గౌరవాన్ని ప్రోత్సహించడం ముఖ్యము.
  •  మీరు చూడాలనుకునే మంచి ప్రవర్తనను గుర్తించి ప్రశంసించండి. ఇది వారికి ప్రోత్సాహం మరియు ప్రేరణ ఇస్తుంది.
  • వారు తమ ఆలోచనలు మరియు అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచేలా ప్రోత్సహించండి.

తమను తాము చూసుకోవడం ద్వారా స్వీయ వ్యక్తీకరణ

  •  పిల్లలు తమకు నచ్చిన దుస్తులు, హెయిర్‌స్టైల్ లేదా మేకప్‌తో తమను తాము చూసుకునేలా ప్రోత్సహించండి .
  •  ఇలా స్వీయ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వడం మరియు ప్రోత్సహించడం వారి ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.

పిల్లలు స్వయంగా చేయడానికి అవకాశం ఇవ్వండి

తమ పిల్లలు స్వతంత్రంగా మరియు స్వయంగా పనులు చేసుకునేలా తయారవ్వడం ప్రతి తల్లిదండ్రి లక్ష్యం. ఇది సాధ్యమవ్వాలంటే వారికి ఈ అవకాశాలు ఇవ్వాలి: 

  •  రోజువారీ జీవన విధానాలు:  ఉదాహరణకు పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం వంటి పనులు. తాము చేసుకునేలా ప్రోత్సహించండి.
  •  టాయిలెట్ ఉపయోగించిన తర్వాత తమను తాము శుభ్రం చేసుకోవడం నేర్పండి. పరిశుభ్రత కోసం టాయిలెట్ ఉపయోగించిన తర్వాత వ్యక్తిగత భాగాలను బాగా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యము.
  • తమకు నచ్చినవి, నచ్చనివి స్పష్టంగా చెప్పేలా ప్రోత్సహించండి.

స్వీయ రక్షణ

 సురక్షితమైన వాతావరణంలో ఉండటం ప్రతి పిల్లల హక్కు. అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా. అందువల్ల మీ పిల్లలకు ఈ విషయాలు నేర్పడం చాలా ముఖ్యము:

  • శారీరక / శరీర హద్దులు
    •  మంచి / సురక్షిత స్పర్శ (సేఫ్ టచ్ ) మరియు చెడు / అసురక్షిత స్పర్శ ( అన్ సేఫ్ టచ్ /బాడ్ టచ్ ) మధ్య తేడా.
    • వారికి అసౌకర్యంగా అనిపించే ఎలాంటి స్పర్శను కూడా అంగీకరించాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పాలి.
    • నమ్మకాన్ని పెంపొందించండి మరియు ఏదైనా విషయం లేదా వ్యక్తి వల్ల అసౌకర్యంగా అనిపించినప్పుడు వెంటనే మీ వద్దకు రావాలని ప్రోత్సహించండి.
  • భావోద్వేగ / సామాజిక హద్దులు
    • వేధింపులు (అబ్యూస్) ఎప్పుడూ శారీరకంగా మాత్రమే ఉండదు. అది మాటల ద్వారా కూడా ఉండవచ్చు.
    • పిల్లలు తమకు అసౌకర్యంగా అనిపించే సంభాషణల్లో పాల్గొనకూడదని అర్థం చేసుకునేలా సహాయం చేయండి.
    • అప్రమత్తంగా ఉండండి, మాట్లాడలేని పిల్లలు తమ భావాలు లేదా అసౌకర్యాన్ని ఎలా వ్యక్తపరచగలరో గుర్తించి వారికి సహాయం చేయండి.

దృశ్య సహాయకాలు

పిల్లలకు స్వీయ సంరక్షణ మరియు రోజువారీ పనుల గురించి నేర్పడానికి వివిధ కార్యకలాపాలు మరియు వాటిలో ఉండే దశలను చూపించే దృశ్య సహాయక సాధనాలను తయారు చేసి ఉపయోగించండి.

కొన్ని సందర్భాల్లో సహాయం

కొన్ని సందర్భాల్లో అధిక రక్తస్రావం (మెనోరాజియా)  వంటి సమస్యలు రావచ్చు. ఇవి పిల్లలకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అటువంటి సమయంలో పిల్లలకు సహాయం చేయడానికి మందులు కాకుండా కొన్ని సరళమైన మార్గాలు ఉన్నాయి:

  • వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం మరియు ఆరోగ్యకరంగా బరువును తగ్గించడం
  • తగినంత నీరు తాగడం
  • ఉప్పు మరియు చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించి, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం

 తీవ్రమైన నొప్పి లేదా ఎక్కువ అసౌకర్యం ఉంటే, మరింత మార్గదర్శకత్వం కోసం గైనకాలజిస్టును సంప్రదించండి. యుక్తవయసులో వచ్చే శారీరక మార్పులను గుర్తించడం చాలా అవసరం. అదే సమయంలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ఈ విషయాలను వివరించడం మరియు వారికి భరోసా ఇవ్వడం తల్లిదండ్రులకు కష్టంగా అనిపించవచ్చు. ఈ ప్రెజెంటేషన్ ప్రత్యేక అవసరాలున్న అమ్మాయిలకు నెలసరి సమయంలో ఎదురయ్యే కొన్ని సాధారణ సవాళ్లను చర్చిస్తుంది. అలాగే తమ కుమార్తె యుక్తవయసులోకి ప్రవేశించే ముందు మరియు ఆ సమయంలో తల్లిదండ్రులు ఎదుర్కొనే కొన్ని ఆందోళనలను కూడా ఇందులో ప్రస్తావించారు.

ప్రత్యేక అవసరాలు ఉన్నా లేకపోయినా ప్రతి అమ్మాయికి యుక్తవయసును అనుభవించే హక్కు ఉంది. పరిస్థితులు కష్టంగా అనిపించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో ఇక్కడ తెలుసుకోండి.

కృతజ్ఞతలు: డా. కావ్య ప్రియా వజ్రాల గారికి వారి విలువైన సూచనలు మరియు మార్గదర్శకత్వం అందించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ప్రజెంటేషన్‌ను ఇంగ్లీష్ నుంచి హిందీ లోకి అనువదించడానికి తన సమయం మరియు శ్రమను స్వచ్ఛందంగా అందించిన శ్రీమతి హేమంతా నిజ్‌హావన్ గారికి కూడా మా కృతజ్ఞతలు.

గమనిక: దయచేసి గమనించండి, ఈ విషయం వివరణ సమాచారం ఇవ్వడానికి మాత్రమే. సరైన మార్గదర్శకత కోసం అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ.డి.హెచ్.డి, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, మీకు సహాయం చేయడానికి నయీ దిశా బృందం మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

टैग्स : Puberty in Girls
ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी