Skip to main content
Install App
If you're using:

ప్రత్యేక అవసరాలు ఉన్న ఆడపిల్లల్లో నెలసరి సమయంలో వచ్చే భావోద్వేగ మార్పులను ఎదుర్కోవడం

Kavya_Gynaecologist

डॉ.काव्या प्रिया वज्राला

इस भाषा में उपलब्ध है हिंदी English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

  1.   హార్మోన్ల మార్పుల వల్ల నెలసరి సమయంలో భావోద్వేగాల్లో మార్పులు రావచ్చు.
  2.   ఇది మహిళలందరిలో కనిపించే సాధారణ విషయం, అయితే తీవ్రత అనేది భిన్నంగా ఉండవచ్చు.
  3.   మందులు అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి; వాటిని ప్రతి నెలా సాధారణ పరిష్కారంగా మార్చకూడదు 
  4.   ప్రత్యేక అవసరాలు ఉన్న అమ్మాయిలకు భావోద్వేగ పరమైన మద్దతు చాలా ముఖ్యమైనది.
  5.   పి.ఎం.ఎస్. ( ప్రీ-మెన్స్ట్రువల్ సిండ్రోమ్) ను ముందుగానే అర్థం చేసుకుని నిర్వహించడంలో కొన్ని సరళమైన సూచనలు తల్లిదండ్రులకు సహాయపడతాయి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.88 MB]

హార్మోన్లలో జరిగే మార్పుల వల్ల, శరీరంలో భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు కనిపించవచ్చు. ఈ దశను మెన్స్ట్రువల్ స్ట్రెస్ అని అంటారు. ఈ పరిస్థితి అందరి మహిళల్లో కనిపించే సహజమైన విషయం. అయితే దీని తీవ్రత ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండవచ్చు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో మందులు అవసరం కావచ్చు. అయితే సాధారణంగా నిర్వహించగల పరిస్థితుల్లో ప్రతి నెల మందులను ఉపయోగించడం మంచిది కాదు.

ఈ విషయ వివరణ ఒక ప్రజెంటేషన్‌ ఆధారంగా రూపొందించబడింది.  ప్రతి నెలా మీ అమ్మాయి నెలసరి ప్రారంభ సమయంలో ఎదుర్కొనే భావోద్వేగ మార్పులను అర్థం చేసుకోవడం మరియు ఆ సమయంలో తనకు అవసరమైన మద్దతును అందించడం కోసం  కొన్ని సులభమైన సూచనలను ఇందులో వివరించారు.

ఇది ప్రత్యేక అవసరాలు ఉన్న మహిళల్లో నెలసరి గురించి మరియు మీ అమ్మాయిలో జరుగుతున్న మార్పులను మీరు మరింత బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. సరైన అవగాహన ఉండడం వల్ల పి.ఎం.ఎస్.మరియు ప్రతి నెల వచ్చే నెలసరికి వారు మెరుగ్గా సిద్ధం కావచ్చు. 

పి.ఎం.ఎస్. అంటే ఏమిటి?

ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పి.ఎం.ఎస్.) అనేది ప్రతి నెలసరి ప్రారంభానికి 7–14 రోజుల ముందు శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు. దీని వల్ల కొన్ని లక్షణాలు కనిపించవచ్చు:

  •  అలసట
  •  భావోద్వేగ మార్పులు (మూడ్ స్వింగ్స్)
  • తలనొప్పి మరియు వెన్నునొప్పి
  • కడుపు నొప్పి
  • కడుపులో ఉబ్బరం (బ్లోటింగ్)

పి.ఎం.ఎస్.సంకేతాలు ప్రతి మహిళలో భిన్నంగా ఉంటాయి, అలాగే వాటి తీవ్రత కూడా భిన్నంగా ఉండవచ్చు. ఆటిజం స్పెక్ట్రంలో ఉన్న పిల్లలకు, నొప్పి లేదా అసౌకర్యాన్ని వ్యక్తపరచడం మరియు చెప్పడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే వారికి కమ్యూనికేషన్‌లో సమస్యలు ఉండవచ్చు. మాట్లాడలేని (నాన్ స్పీకింగ్) పిల్లల విషయంలో ఇది ఇంకా కష్టంగా ఉండవచ్చు, ఎందుకంటే వారు తమకు సహాయం కావాలని చెప్పడం లేదా తమ అసౌకర్యాన్ని తెలియజేయడం కష్టంగా అనిపించవచ్చు.

దీనికి గల కారణాలు ఏమిటి?

పి.ఎం.ఎస్ ప్రధానంగా శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కలుగుతుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరోన్ హార్మోన్ల స్థాయిలలో వచ్చే మార్పుల కారణంగా పి.ఎం.ఎస్ లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇది తీవ్రమైన నిరాశ (డిప్రెషన్) మరియు తీవ్రమైన మూడ్ స్వింగ్ లతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు.

పి.ఎం.ఎస్ ను సులభంగా నిర్వహించుకునే మార్గాలు ఏమిటి?

ఆహారం: క్రింద సూచించిన విధంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల పి.ఎం.ఎస్ సమయంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను తగ్గించుకోవచ్చు.

  • ఎక్కువ ఉప్పు /చక్కెర లేదా కారంగా ఉన్న ఆహారాన్ని తగ్గించండి.
  • తగినంత నీరు తాగండి, కెఫీన్  ఉన్న పానీయాలను తగ్గించండి.
  • ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోండి. ఉదాహరణకు బెల్లం, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్. ఇవి ఈ సమయంలో కోల్పోయే ఐరన్ ను తిరిగి పొందడంలో సహాయపడతాయి.
  • మెగ్నీషియం మరియు కాల్షియం ఉన్న ఆహారాలను తీసుకోండి.
  • విటమిన్ D, B12, ఒమేగా-3 వంటి సప్లిమెంట్లను తీసుకుంటూ ఉండండి.

వ్యాయామం:

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కండరాల నొప్పి మరియు అలసట తగ్గుతాయి. యోగా, ఏరోబిక్స్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అభివృద్ధి చేయడం ముఖ్యము.
  •  పి.ఎం.ఎస్ ఉన్న రోజుల్లో కూడా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మూడ్ మెరుగుపడుతుంది మరియు మంచి నిద్రకు సహాయపడుతుంది.
  • వెన్ను మరియు పొట్ట కండరాలను బలపరచే వ్యాయామాలపై దృష్టి పెట్టడం వల్ల పి.ఎం.ఎస్  సమయంలో నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది.

నిద్ర:

  •  మంచి ఆరోగ్యానికి తగినంత నిద్ర చాలా ముఖ్యం.
  •   కాబట్టి, పిల్లలకు తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి మరియు ఎక్కువ అలసటకు గురికాకుండా జాగ్రత్త పడాలి.
  •   పని ఒత్తిడి ఎక్కువ ఉన్న రోజుల్లో పిల్లలకు విరామం మరియు విశ్రాంతి తీసుకోవడం నేర్పించండి.

అర్థం చేసుకోవడం:

  • న్యూరోడైవర్స్ పిల్లలు మరియు తోటి సాధారణ పిల్లలు కూడా యుక్త వయసులో హార్మోన్ల మార్పులు మరియు నెలసరికి సంబంధించిన మార్పులను అనుభవిస్తారు.
  • సరైన విధంగా తమ అవసరాలను తెలియజేయలేకపోవడం వల్ల పిల్లలు తమ అసౌకర్యాన్ని వ్యక్తపరచడం మరింత కష్టంగా మారవచ్చు.
  • అటువంటి సందర్భాల్లో, తల్లిదండ్రుల ప్రేమ మరియు అర్థం చేసుకోవడం పిల్లలకు ఎంతో ఊరటనిస్తుంది.
  • సంరక్షకులుగా, పిల్లలకు అవసరమైన మానసిక మరియు భావోద్వేగ సహాయాన్ని అర్థం చేసుకుని అందించడం మన బాధ్యత.

విశ్రాంతి:

  • పిల్లలు ఆలోచించి, చేయాల్సిన పనుల్లో పాల్గొనేలా చేయడం వల్ల పిల్లలను అసౌకర్యం నుండి దృష్టి మళ్లించడంలో సహాయపడతాయి మరియు వారికి అర్థవంతమైన పనిలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తాయి. బేకింగ్, వంట వంటి కార్యకలాపాలు ఇందుకు ఉదాహరణలు.
  • ఆర్ట్ & క్రాఫ్ట్ వంటి వినోదాత్మక మరియు సృజనాత్మక కార్యకలాపాలు కూడా వారి దృష్టిని మళ్లించడమే కాకుండా, పనిని పూర్తి చేసిన ఆనందం మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
  • మంచి సంగీతం కూడా పిల్లలకు ప్రశాంతతనిస్తుంది.
  • మీ పిల్లలు ప్రశాంతంగా ఉండడానికి సహాయపడే కార్యకలాపాలు మరియు పరిస్థితులను గుర్తించండి.

తీవ్రమైన మూడ్ మార్పులు:

  •  కొన్నిసార్లు కొంతమంది పిల్లలు తమ నియంత్రణలో లేని తీవ్రమైన మూడ్ మార్పులు అనుభవించవచ్చు.
  •  పి.ఎం.ఎస్ తో పాటు తీవ్రమైన మూడ్ మార్పులు మరియు నిరాశ (డిప్రెషన్) కనిపిస్తే దాన్ని ప్రీ మెన్స్ట్రువల్ డైస్పోరిక్ డిసార్డర్ (పి.ఎం.డి.డి) అని అంటారు.
  • ఇలాంటి సందర్భాల్లో డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. వారు మందులు సూచించవచ్చు, కానీ వాటి వలన కలిగే ప్రభావాలపై జాగ్రత్తగా ఉండాలి.
  • ఈ మందులను ఎక్కువగా వాడకుండా, డాక్టర్ సూచించిన మోతాదు ప్రకారం మాత్రమే తీసుకోవడం చాలా ముఖ్యం.

ప్రణాళిక చేయడం మరియు కమ్యూనికేషన్ లో ఉన్న సవాళ్లు, అలాగే ఎక్కువ ఆందోళన మరియు భావోద్వేగ మార్పులు వల్ల ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు నెలసరిని నిర్వహించడం కష్టం కావచ్చు.

అదనంగా, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్లో నెలసరి సమయంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా నిర్వహించాలి అనే విషయంపై కొన్ని ఉపయోగకరమైన సూచనల కోసం ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్లో నెలసరి నిర్వహణ కోసం ఆక్యుపేషనల్ థెరపీ సూచనలు అనే అంశాన్ని కూడా చదవవచ్చు.

అలాగే, “మీ పిల్లలకు మంచి నెలసరి పరిశుభ్రత అలవాట్లు ఎలా నేర్పాలి?” అనే అంశాన్ని కూడా చూడండి. ఇది పిల్లలకు నెలసరి సమయంలో పరిశుభ్రత అలవాట్లు గురించి ఎలా నేర్పాలో తెలియజేస్తుంది.

గమనిక: ఈ విషయ వివరణ ప్రత్యేక అవసరాలు ఉన్న మహిళల/పిల్లల కోసం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. నెలసరి మరియు పరిశుభ్రత పద్ధతుల గురించి మరింత సమాచారం కోసం దయచేసి అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ.డిహెచ్.డి, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

टैग्स : Puberty in Girls
ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी