Skip to main content
Install App
If you're using:

పిల్లలకు స్వయంగా పనులు చేసుకోవడం నేర్పించడం ద్వారా వారి స్వంతంత్రతను పెంపొందించవచ్చు: డౌన్ సిండ్రోమ్ అవగాహన

Default Avatar

डीएसएफआई

इस भाषा में उपलब्ध है English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

  • ఈ విషయ వివరణ డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు అవసరమైన పనులను స్వయంగా చేసుకోవడం నేర్పించడం  యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
  • పిల్లలు తమ పనులను స్వయంగా చేసుకున్నప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతాయి.
  • పిల్లలకు నేర్పించగల నైపుణ్యాల్లో రోజువారీ జీవన కార్యకలాపాలు (ఏ.డి.ఎల్.లు), స్వీయ సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడానికి అవసరమైన పనులు ఉంటాయి.
  • పిల్లలకు పనులను స్వయంగా చేసుకోవడం నేర్పించడానికి , క్రమం తప్పకుండా సాధన చేయించడం పిల్లలు తప్పులు చేయడానికి అవకాశం ఇవ్వడం, వారు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గుర్తించడం, క్రమంగా కొత్త లక్ష్యాలను చేర్చడం వంటి పద్ధతులు ఉపయోగపడతాయి.
  • ప్రతి పిల్లలు ప్రత్యేకమైనవారని, ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన వేగంతో నేర్చుకుంటారని గుర్తుంచుకోండి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.18 MB]

పిల్లల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, సంఖ్యలు, రంగులు, ఆకారాలు ఎంత ముఖ్యమో, అలాగే వయస్సు పెరుగుతున్న కొద్దీ పిల్లలు రోజువారీ పనులు స్వయంగా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. 

ఈ విషయ వివరణ పైన అందుబాటులో ఉంచిన సమాచారం డౌన్ సిండ్రోమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో రూపొందించబడింది. 

ఈ అంశం పిల్లలకు చిన్న వయస్సు నుంచే తమ పనులను తామే చేసుకోవడం నేర్పించడం ఎందుకు అవసరమో తల్లిదండ్రులు అర్థం చేసుకోవడానికి కొన్ని సూచనలను అందిస్తుంది. అలాగే, డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలు రోజువారీ నైపుణ్యాలను నేర్చుకునే సగటు వయస్సును, సాధారణ అభివృద్ధి కలిగిన పిల్లలతో పోలిస్తే ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తుంది. పిల్లలకు తమ పనులను తామే చేసుకోవడం నేర్పించడం ద్వారా వారిలో స్వావలంబన మరియు స్వతంత్రత పెంపొందుతాయి.

తమ పనులను తామే చేసుకోవడం ఎందుకు ముఖ్యం? 

పిల్లలు అందరు తమ సొంత వేగంతో ఎదుగుతారు, నేర్చుకుంటారు. అదనపు అవసరాలు ఉన్న పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు. అయితే వారు వివిధ నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఎక్కువ సమయం మరియు సహనం అవసరం కావచ్చు. అయినప్పటికీ, కొన్ని పనులను పిల్లలు స్వయంగా చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నిర్లక్ష్యం చేయకూడదు.

1.      రోజువారీ పనులను ఎక్కువకాలం తప్పించుకోవడం సాధ్య పడదు. ప్రతి ఒక్కరూ ఈ పనులను చేయవలసి ఉంటుంది.

2.       ఈ పనులను స్వయంగా చేయగలిగినప్పుడు పిల్లలకు సాధించిన భావన కలుగుతుంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

3.       స్వతంత్రంగా పనులు చేయడం వల్ల ఇతరులు కూడా వారిని సానుకూల దృష్టితో  చూస్తారు.

4.       రోజువారీ పనులు నేర్చుకోవడం ద్వారా పిల్లల్లో స్వావలంబన మరియు స్వతంత్రత పెరుగుతాయి.

సులభమైనవే అయినా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పవలసిన కొన్ని ముఖ్యమైన రోజువారీ పనులు:

1.       స్వయంగా ఆహారాన్ని తినడం

2.       తిన్న తర్వాత తమ ప్లేట్‌ను తగిన చోట పెట్టడం

3.       పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, దుస్తులు ధరించడం  వంటి రోజువారీ జీవన నైపుణ్యాలు (ఏ.డి.ఎల్.లు) 

4.       వ్యక్తిగత శుభ్రత

5.       వ్యక్తిగత సంరక్షణ  నైపుణ్యాలు

6.      స్వీయ సంరక్షణ, పరిశుభ్రతకు సంబంధించినవి అంటే,  టాయిలెట్ ఉపయోగించిన ప్రతిసారి చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ప్రతిరోజూ బట్టలు మరియు లోదుస్తులు మార్చుకోవడం వంటివి. 

అయితే, ప్రతి పిల్లలు తన సామర్థ్యానికి అనుగుణంగా ఈ నైపుణ్యాలు నేర్చుకుంటారని గుర్తుంచుకోవాలి.వారి సామర్థ్యానికి మించి ఒత్తిడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.

పిల్లలకు స్వయంగా పనులు చేసుకోవడం నేర్పించే సూచనలు

1.  పిల్లలకు ఎక్కువగా సహాయం చేయకండి

 చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు పనులను స్వయంగా చేయనివ్వడం కష్టంగా భావిస్తారు. అందువల్ల వారిని ఎప్పుడూ పర్యవేక్షించడం లేదా సహాయం చేయడం వంటివి చేస్తుంటారు. ఇది ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది మరియు పిల్లలు మీ సహాయం లేకుండా పనులను స్వయంగా చేయడం నేర్చుకోలేరు. పిల్లలపై నమ్మకం ఉంచి వారి పనులను స్వయంగా చేయనివ్వండి. తప్పులు చేయడం సహజం. ఆ ప్రక్రియలో నేర్చుకోవడం  ముఖ్యమైనది.

2. క్రమం తప్పకుండా నేర్పించండి

కొన్ని నైపుణ్యాలు ఉదాహరణకు, పళ్లు తోముకోవడం, స్నానం చేయడం వంటి రోజువారీ పనులను వాటికి తగిన సమయంలోనే నేర్పించాలి. అలాగే, ఒకే విధమైన పద్ధతిని పాటిస్తూ, క్రమం తప్పకుండా సాధన చేయించడం కూడా చాలా ముఖ్యం.

 3. ఒక్కో దశగా ముందుకు తీసుకెళ్లండి

సాధన చేయడం వల్ల పిల్లలు ఒక పనిని బాగా నేర్చుకుంటారు. అయితే, పిల్లలను గమనిస్తూ, వారు తదుపరి దశకు వెళ్లడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారో అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. పిల్లలు మీ సహాయం తక్కువగా తీసుకుని ఒక పనిని చేయగలుగుతున్నప్పుడు, ఆ పనిలోని తదుపరి దశలను క్రమంగా వారికి నేర్పించడం ప్రారంభించండి.

 4. క్రమం తప్పకుండా నేర్పిస్తూ ఉండండి

పిల్లలు ఒక నైపుణ్యాన్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాత, కొత్త నైపుణ్యాన్ని నేర్పించడం ప్రారంభించండి. ఇలా క్రమం తప్పకుండా, నిరంతరం నేర్పించడం వల్ల పిల్లలకు వివిధ రకాల పనులు మరియు నైపుణ్యాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. పిల్లల వయస్సు, సామర్థ్యాన్ని బట్టి వేర్వేరు వయస్సుల్లో వేర్వేరు పనులను పరిచయం చేయవచ్చు.

డౌన్ సిండ్రోమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DSFI) సహకారంతో రూపొందించిన పై ప్రెజెంటేషన్‌లో  మోటార్ నైపుణ్యాలు, టాయిలెట్ ఉపయోగించడం, ఆహారం తినడం వంటి వివిధనైపుణ్యాలకు సంబంధించిన పూర్తి వివరాలను చూడవచ్చు.

ప్రతి పిల్లలు ప్రత్యేకమైనవారని, ప్రతి ఒక్కరూ తమ సొంత వేగంతో నేర్చుకుంటారని గుర్తుంచుకోండి., ప్రేమ, శ్రద్ధతో  క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం.

మైలురాళ్లను చేరుకోవడంలో లేదా మోటార్ నైపుణ్యాల అభివృద్ధి విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే, తల్లిదండ్రులు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ను సంప్రదించడం మంచిది. వారు తగిన కారణాన్ని గుర్తించి, దాన్ని పరిష్కరించడానికి అవసరమైన సహాయం అందిస్తారు. 

పిల్లలు ఒక పనికి  అవసరమైన నైపుణ్యాలు నేర్చుకున్న తర్వాత, ఆ పనిని వారు స్వయంగా చేయడం మరింత సులభమవుతుంది.

డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తుల అవసరాలు మరియు ఆరోగ్య సవాళ్లను అర్థం చేసుకోవడానికి సంరక్షకుల కోసం రూపొందించిన మాన్యువల్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గమనిక: ఈ విషయ వివరణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం దయచేసి అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी