Skip to main content
Install App
If you're using:

పిల్లల ఎదుగుదలను అర్థం చేసుకోవడం మరియు అభివృద్ధిలో ఆలస్యం గమనిస్తే ఏమి చేయాలి?

Default Avatar

डॉ. अजय शर्मा

इस भाषा में उपलब्ध है English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

  1. ప్రారంభ దశలోనే సహాయం అందించడం ఎంతో ముఖ్యం. అభివృద్ధిలో ఆలస్యాలను ముందుగానే గుర్తించి అవసరమైన సహాయం అందించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. 
  2. మీ పిల్లల ఎదుగుదలను గమనించండి. అవసరమైన సమయంలో అభివృద్ధి మూల్యాంకనం  (అసెస్మెంట్) కోసం మీ పిల్లల వైద్యుడిని (పిడియాట్రిషన్) సంప్రదించండి.
  3. పిల్లలు పుట్టక ముందు మరియు తరువాత వారి అభివృద్ధిపై ప్రభావం చూపే అంశాలను డా. అజయ్ శర్మ నిపుణుల సూచనలు పంచుకున్నారు.
  4. పిల్లల ఆరోగ్యకరమైన అభివృద్ధికి కుటుంబంతో కలిసి గడపడం, ఆటలు ఆడించడం, కథలు చెప్పడం, అభివృద్ధిని గమనించడం ఎంత ముఖ్యమో ఈ సంభాషణలో తెలియజేశారు.

నయీ దిశా రిసోర్స్ సెంటర్, పిల్లల అభివృద్ధిలో గమనించాల్సిన సాధారణ సందేహాలు మరియు ఆందోళనల గురించి కన్సల్టెంట్ న్యూరో-డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్ డా. అజయ్ శర్మ గారితో మాట్లాడింది. మీ పిల్లల ఎదుగుదలను శ్రద్ధగా గమనిస్తే, అభివృద్ధిలో ఏవైనా ఆలస్యాలను చిన్న వయస్సులోనే గుర్తించవచ్చు. మీ పిల్లల ఎదుగుదలకి సంబంధించి ఏవైనా ఆందోళన కలిగించే సంకేతాలు కనిపిస్తే, వెంటనే మీ పిల్లల వైద్యుడిని (పిడియాట్రిషియన్ ను) సంప్రదించండి. అలాగే, మీ పిల్లల సమగ్ర అభివృద్ధి మూల్యాంకనం  (అసెస్మెంట్) చేయాలని వైద్యుడిని కోరండి.

ఈ సంభాషణలో చర్చించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు: 

1. గర్భధారణ సమయంలో శిశువు అభివృద్ధికి సహాయపడే లేదా ఆటంకం కలిగించే అంశాలు ఏవైనా ఉన్నాయా?

శిశువు అభివృద్ధి పుట్టిన తర్వాతే ప్రారంభమవుతుందని చాలామంది భావిస్తారు. కానీ, శిశువు అభివృద్ధి గర్భం దాల్చిన నాటి నుంచే ప్రారంభమవుతుంది.

అందువల్ల, తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యమైనది.

తల్లి థైరాయిడ్ హార్మోన్, రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే, ఆమె తీసుకునే ఆహారంలో అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఐరన్ వంటి పోషక పదార్థాలు తగినంతగా ఉండేలా చూసుకోవాలి.

మద్యం, మత్తు పదార్థాలు లేదా పొగాకు వంటి హానికారక పదార్థాలను తీసుకోవడం నివారించాలి.

2. పిల్లల అభివృద్ధిలో కుటుంబం పాత్ర ఏమిటి?

పిల్లలు మొదటగా వారి ప్రధాన సంరక్షకుడితో జరిగే పరస్పర చర్యల ద్వారా నేర్చుకోవడం ప్రారంభిస్తారు. ఇది కుటుంబంతో వారి సంబంధాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కుటుంబంతో ఏర్పడే ఈ బంధం, పిల్లల భాషాభివృద్ధి, సంభాషణ మరియు సామాజిక నైపుణ్యాల అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.

డా. అజయ్ శర్మ గారు పిల్లల సమగ్ర అభివృద్ధిలో కుటుంబం పాత్ర ఎంత ముఖ్యమైనదో వివరిస్తూ, కుటుంబ సహాయం తగినవిధంగా లేకుండా పెరిగిన పిల్లలు దీర్ఘకాలంలో అనేక ఇబ్బందులను  ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయని తెలిపారు.

3. పిల్లల అభివృద్ధిలో ఆట ఎందుకు ముఖ్యమైనది?

పిల్లలు నేర్చుకునే ఉత్తమమైన మార్గాల్లో ఆట ఒకటి. ఆట ద్వారా పిల్లలు ఆనందంగా నేర్చుకుంటూ, తమ చుట్టూ ఉన్న వస్తువులు, వాటి ఉపయోగాలు మరియు అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా, ఇతర పిల్లలతో కలిసి ఆడటం ద్వారా వారితో ఎలా మెలగాలో, ఎలా కలిసి ఉండాలో కూడా నేర్చుకుంటారు.

4. మా పిల్లల సామాజిక మరియు సంభాషణ నైపుణ్యాలను ఎలా మెరుగుపరచగలను?

మీ పిల్లలతో గడిపే సమయాన్ని ఆనందంగా మరియు సరదాగా మార్చడం అత్యంత ముఖ్యమైనది.

ఒకేసారి చాలా విషయాలు నేర్పడానికి ప్రయత్నించకుండా మీ పిల్లలు ఇతర పిల్లలతో కలిసి ఆడుకునేలా, పరస్పర చర్యలు చేసేలా ప్రోత్సహించండి.  

సామాజిక పరస్పర చర్య మరియు ఆట, పిల్లలు తమ పరిసరాల్లోని వివిధ విషయాలను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైనవి.

5. మా పిల్లల అభివృద్ధి మైలురాళ్లను ఎలా గమనించాలి?

మీ పిల్లలు వారి వయస్సుకు అనుగుణంగా అభివృద్ధి మైలురాళ్లను చేరుకుంటున్నారో లేదో గమనించడం చాలా ముఖ్యం. అయితే, ప్రతి పిల్లలు తమదైన వేగంతో అభివృద్ధి చెందుతారు. అందువల్ల, మీ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చకపోవడం చాలా ముఖ్యం.

మీ పిల్లల అభివృద్ధి గురించి మరింత అవగాహన పొందడానికి పుస్తకాలు, మరియు ఇతర సమాచార వనరుల నుండి సమాచారం సేకరించండి. ఈ రంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు, చైల్డ్ సైకాలజిస్టులను సంప్రదించవచ్చు.

మీ పిల్లల అభివృద్ధి గురించి ఏవైనా సందేహాలు లేదా ఆందోళనలు ఉంటే, ఆలస్యం చేయకుండా మీ పిడియాట్రిషియన్ ను సంప్రదించండి.

6. ఒక అభివృద్ధి మైలురాయిని చేరుకోకపోతే ఆందోళన చెందాలా?

“అవసరం లేదు,” అని డా. అజయ్ శర్మ గారు చెబుతున్నారు. కొంతమంది పిల్లలు ఒక అభివృద్ధి మైలురాయిని ఆశించిన సమయంలో చేరుకోకపోయినా, తరువాతి మైలురాళ్లను సాధారణంగా చేరుకోవచ్చు. అయితే, మీ పిల్లల అభివృద్ధిని క్రమం తప్పకుండా గమనించడం చాలా ముఖ్యం. ఒక అభివృద్ధి దశ ఆలస్యమైనందుకు ఆందోళన చెందకుండా, పిల్లల మొత్తం ఎదుగుదల మరియు అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలి. 

7. మా పిల్లల అభివృద్ధిలో ఆలస్యం ఉంటే ఎవరిని సంప్రదించాలి?

మీ పిల్లల అభివృద్ధి గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, ముందుగా మీ పిడియాట్రిషియన్ లేదా డెవెలప్మెంటల్ పిడియాట్రిషియన్ ను సంప్రదించండి. అవసరమైతే, మరింత సమగ్ర మూల్యాంకనం కోసం పిల్లల మానసిక వైద్య నిపుణుడు (చైల్డ్ సైకియాట్రిస్ట్) ను కూడా సంప్రదించవచ్చు.

8. వైద్యుడు పిల్లల అభివృద్ధిని ఎలా అంచనా వేస్తారు?

ముందుగా, మీ పిల్లల గురించి మీకు ఉన్న సందేహాలు మరియు ఆందోళనల గురించి వైద్యుడు అడుగుతారు. కాబట్టి, సంకోచించకుండా మీకు ఉన్న అన్ని విషయాలను స్పష్టంగా వివరించండి. ఆ తరువాత, వైద్యుడు మీ పిల్లల అభివృద్ధిని గురించి తెలుసుకుంటారు.

ఈ సమయంలో, మీ పిల్లల భాషాభివృద్ధి, సంభాషణ నైపుణ్యాలు, రోజువారీ కార్యకలాపాలు గురించిన వివరాలను పంచుకోండి.

వీటితో పాటు, వైద్యుడు మీ పిల్లలను పరిశీలించి, వారి అభివృద్ధిని అంచనా వేయడానికి అవసరమైన అభివృద్ధి మూల్యాంకనాలు నిర్వహిస్తారు. అవసరమైతే, వినికిడి మరియు చూపు పరీక్షలు చేసి, అభివృద్ధిలో ఆందోళనకు కారణమయ్యే ఇతర అంశాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తారు.

ఈ ప్రశ్నలు మరియు సమాధానాలు, మీ పిల్లల ఎదుగుదల మరియు అభివృద్ధిని మరింత బాగా అర్థం చేసుకోవడంలో, అలాగే ఏవైనా ఆందోళనలు ఉంటే ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా సహాయం పొందాలో తెలుసుకోవడంలో మీకు ఉపయోగపడతాయి.

ఈ వీడియో సిరీస్ ను తప్పకుండా చూసి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా పంచుకోండి. దీనివల్ల పిల్లల అభివృద్ధిలో ఆలస్యాలు, వాటి సంకేతాలు గురించి మరింత మందికి అవగాహన కలుగుతుంది.

మీ పిల్లలలో ఏవైనా అభివృద్ధి ఆలస్యాలను గమనిస్తే, వైద్యుడిని కలిసే ముందు అవసరమైన వివరాలతో ముందుగా సిద్ధం కావాలి.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సరైన మార్గదర్శకత్వం కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी