Skip to main content
Install App
If you're using:

పిల్లల అభివృద్ధి సంబంధిత ఆందోళనలు కనిపించినప్పుడు డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్ లేదా పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ లలో ఎవరిని సంప్రదించాలి?

DrPranathiGutta

डॉ प्रणथी गुट्टा

इस भाषा में उपलब्ध है English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

  • పిడియాట్రిషియన్ పాత్ర: భారతదేశంలో సాధారణంగా పిల్లల అభివృద్ధి సంబంధిత అంచనాలను సాధారణ (జనరల్) పిడియాట్రిషియన్లు చేస్తారు.
  • డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్లు: కొంతమంది పిడియాట్రిషియన్లు పిల్లల అభివృద్ధికి సంబంధించిన అంశాల్లోనే నైపుణ్యం సాధిస్తున్నారు. దీనివల్ల డెవలప్‌మెంటల్ పిడియాట్రిక్స్ అనే ప్రత్యేక వైద్య విభాగం ఏర్పడింది. 
  • ప్రత్యేకమైన నిర్ధారణ: డెవలప్‌మెంటల్ పిడియాట్రిషన్ పిల్లల్లో కనిపించే పలు అభివృద్ధి ఆలస్యాలను గుర్తించి, అంచనా వేస్తారు.
  •  నాడీ వ్యవస్థకు సంబంధించిన కారణాల వల్ల పిల్లల్లో వచ్చే అభివృద్ధి ఆలస్యాలను గుర్తించడంలో పిడియాట్రిక్ న్యూరాలజిస్టులు ప్రత్యేకత కలిగి ఉంటారు.
  • ప్రత్యేక వైద్య విభాగాల ప్రయోజనం: ఈ ప్రత్యేక వైద్య విభాగాల వల్ల పిల్లలకు సరైన నిర్ధారణ మరియు అవసరమైన సహాయం త్వరగా అందుతుంది.

మీరు లేదా మీ కుటుంబ సభ్యులు మీ పిల్లల అభివృద్ధిలో ఏ వయస్సులోనైనా అభివృద్ధి దశలను చేరుకోకపోవడం గమనిస్తే లేదా ఏవైనా సంకేతాలు కనిపిస్తే, వెంటనే   పిడియాట్రిషియన్‌ను సంప్రదించండి. పిడియాట్రిషియన్‌ మీ పిల్లలను పరిశీలించి, వారి ఎదుగుదల తెలుసుకునేందుకు అభివృద్ధి మూల్యాంకనం (డెవలప్‌మెంటల్ అసెస్‌మెంట్) చేయాలని సూచించవచ్చు. దీనిలో, మీ పిల్లల శారీరక, సామాజిక, భావోద్వేగ అభివృద్ధికు సంబంధించిన అనేక ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వాలి. మీ పిల్లల శరీరంలోని అవయవాల పనితీరును తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చేస్తారు. అలాగే, పిల్లల అభివృద్ధిలో ఆలస్యానికి కారణాలను గుర్తించడానికి సంబంధిత నిపుణులు వినికిడి, చూపు, శారీరక పరీక్షలు వంటి పరీక్షలు చేస్తారు. ఏదైనా సమస్య గుర్తిస్తే, దాని తీవ్రతను బట్టి పిల్లల అభివృద్ధికి అవసరమైన సహాయం, తీసుకోవాల్సిన చర్యల గురించి వైద్యుడు సూచిస్తారు.

గుర్తుంచుకోండి, అభివృద్ధి మూల్యాంకనం అనేది మీ పిల్లల అభివృద్ధికి సంబంధించిన ఏవైనా సమస్యలను గుర్తించడానికి మాత్రమే చేస్తారు. ఈ పరీక్ష చేయించడం వల్ల పిల్లలకు అభివృద్ధి ఆలస్యం నిర్ధారణ ఖచ్చితంగా జరుగుతుందని అర్థం కాదు. పరీక్షలో ఎలాంటి  అభివృద్ధి ఆలస్యం కనిపించకపోవచ్చు కూడా. అయితే, ఒక ఆలస్యం గుర్తించబడిన సందర్భంలో, ప్రారంభ దశలోనే అవసరమైన  సహాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రారంభ దశలో సహాయం అందించడం ద్వారా మీరు మీ పిల్లల అభివృద్ధి మరియు ఆరోగ్యానికి మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

భారతదేశంలో సాధారణంగా అభివృద్ధి మూల్యాంకనాలు పిడియాట్రిషియన్ల ద్వారానే నిర్వహించబడతాయి. అయితే, ఇటీవలి కాలంలో కొంతమంది పిడియాట్రిషియన్లు పిల్లల అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ మరియు నైపుణ్యం పొందుతున్నారు. ఈ ప్రత్యేక విభాగం వలన  డెవలప్‌మెంటల్ పిడియాట్రిక్స్ రంగానికి  అవసరమైన ప్రత్యేక స్థానం ఏర్పడింది.

డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్ మీ పిల్లలో కనిపించే చాలా రకాల అభివృద్ధి ఆలస్యాలను గుర్తించి అంచనా వేయగలరు. అయితే, న్యూరాలజీలో ప్రత్యేక శిక్షణ పొందిన మరో విభాగంగా పిడియాట్రిక్ న్యూరాలజీ ఏర్పడింది. నాడీ వ్యవస్థకు సంబంధించిన కారణాలు ఉన్న అభివృద్ధి ఆలస్యాలను పిడియాట్రిక్ న్యూరాలజిస్టులు పరిశీలించి తగిన సహాయక మార్గాలను అందిస్తారు.

పిల్లల వైద్యరంగంలోని  ఈ రెండు ప్రత్యేక విభాగాల మధ్య ఉన్న తేడాలు మరియు పోలికలను తెలుసుకోవడానికి, క్రింద చూపించిన పట్టికను చూడండి.

డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్ మరియు పిడియాట్రిక్ న్యూరాలజిస్టు మధ్య తేడాలు

డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్ vs పిడియాట్రిక్ న్యూరాలజిస్టు

మా నగరంలో పిడియాట్రిక్ న్యూరాలజిస్టు లేకపోతే  ఎవరిని సంప్రదించాలి?
పిడియాట్రిక్ న్యూరాలజిస్టు పిల్లల్లో మెదడు మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను అంచనా వేసే నిపుణుడు. మీ ప్రాంతంలో అలాంటి నిపుణుడు అందుబాటులో లేకపోతే, పెద్దలకు వైద్యం చేసే  న్యూరాలజిస్టును సంప్రదించి తదుపరిఏం చేయాలో తెలుసుకోవచ్చు. 

మా నగరంలో డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్  లేకపోతే ఎవరిని సంప్రదించాలి?
డెవలప్‌మెంటల్ పీడియాట్రిషియన్ పిల్లల్లో ప్రారంభ దశలో కనిపించే అభివృద్ధి ఆలస్యాలను గుర్తించి, అంచనా వేయడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటారు . మీ ప్రాంతంలో వారు లభించకపోతే, మీ పిడియాట్రిషియన్ లేదా పిడియాట్రిక్ న్యూరాలజిస్టును సంప్రదించి తదుపరి చర్యలపై సలహా తీసుకోండి.

అభివృద్ధి మూల్యాంకనం కోసం ఎవరిని సంప్రదించాలి?
సాధారణంగా, అభివృద్ధి మూల్యాంకనం డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్ చేత చేయించుకోవాలి. అయితే, భారతదేశంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్ల ను కనుగొనడం కొంత కష్టంగా ఉంటుంది. .

ప్రస్తుతం, ఈ రకమైన మూల్యాంకనాలు ఎక్కువగా పిడియాట్రిక్ న్యూరాలజిస్టులు మరియు చైల్డ్ సైకియాట్రిస్టులు కలిసి పనిచేస్తున్నారు.  

పిల్లల అభివృద్ధిని ప్రభావితం చేసే సహాయక లేదా ఆటంకపరచే అంశాలు కూడా చదవవచ్చు. ఇవి వారి అభివృద్ధిపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతాయి.

గమనిక: దయచేసి గమనించండి, ఈ మార్గదర్శకం సమాచారం ఇవ్వడానికి మాత్రమే. సరైన మార్గదర్శకత కోసం అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ.డి.హెచ్.డి. లేదా ఇతర మేధో అభివృద్ధి సంబంధిత సవాళ్ల గురించి సందేహాలు ఉన్నా లేదా పిల్లల అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी