Skip to main content
Install App
If you're using:

మేధో మరియు అభివృద్ధి సంబంధిత ఆలస్యాలలో ఆక్యుపేషనల్ థెరపీ పాత్ర

Hyderabad_occupational-therapist_Snehal_Vaidya

सुश्री स्नेहल वैद्य

इस भाषा में उपलब्ध है हिंदी తెలుగు English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

  1. ఈ విషయ వివరణ   ఆక్యుపేషనల్ థెరపీ (ఓ.టి.) అంటే ఏమిటి?’ అనే విషయాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
  2.   ఓ.టి. అనేది వ్యక్తులు ఇంటి వద్ద, పాఠశాలలో మరియు సమాజంలో తమ సామర్థ్యాల మేరకు రోజువారీ జీవిత కార్యకలాపాల్లో పాల్గొనడానికి సహాయపడుతుంది.
  3.   ఓ.టి. అనేది సాక్ష్యాధారిత విధానం. ఇది పిల్లలలో మోటార్ నైపుణ్యాలు, ఇంద్రియ (సెన్సరీ) సున్నితత్వాలు, పాఠశాల సిద్ధత మరియు రోజువారీ జీవన కార్యకలాపాలు (ఏ.డి.ఎల్) వంటి పలు అంశాలలో మద్దతు ఇస్తుంది.
  4.   ఓ.టి. శాస్త్రీయ పరిశోధనలతో బలంగా నిరూపించబడింది. ఇది రోజువారీ పనితీరును మెరుగుపరచడంలో ఎంతగానో ప్రభావవంతమని నిరూపితమైంది.
  5.   ప్రతి వ్యక్తి తాము చేయగలిగే పనులను ఆధారంగా చేసుకుని, పనులను వారికి అనుగుణంగా మార్చడం ద్వారా వారిని రోజువారీ పనుల్లో వారు చురుకుగా పాల్గొనేలా  ఓ.టి. సహాయపడుతుంది.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.67 MB]

 ఈ విషయ వివరణ పైన ఉన్న ప్రెజెంటేషన్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మేధో మరియు అభివృద్ధి సవాళ్లు ఉన్నవారిలో ఆక్యుపేషనల్ థెరపీ (ఓ.టి.) యొక్క పాత్ర గురించి వివరిస్తుంది.

శ్రీమతి స్నేహాల్ వైద్య గారితో కలసి నయీ దిశా ఒక వర్క్ షాప్ ను నిర్వహించింది. డౌన్ సిండ్రోమ్, సెరిబ్రల్ పాల్సి మరియు అభివృద్ధి ఆలస్యాలను ఎదుర్కొంటున్న పిల్లలలో కొన్ని సాధారణ సవాళ్ల గురించి ఆమె ప్రస్తావించారు. చాలా వరకు ఇళ్లల్లో అందుబాటులో ఉన్న వస్తువులతో తల్లిదండ్రులు ప్రతిరోజూ తమ పిల్లలతో ఎలా సాధన చేయించాలి అనే విషయంగా ఆమె విలువైన సలహాలు, సూచనలు అందించారు. మేధో పరమైన మరియు అభివృద్ధి సవాళ్లు (ఐ.డి.డిలు) ఎదుర్కొంటున్న వారిలో ఆక్యుపేషనల్ థెరపీ పాత్ర పై ఆమె అందించిన వివరణాత్మక ప్రెజెంటేషన్ ను పైన అందుబాటులో ఉంది. తల్లిదండ్రులు దీనిని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఆక్యుపేషనల్ థెరపీ (ఓ.టి.)  అంటే ఏమిటి? 

  •  ఓ.టి. అనేది శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడిన విధానం. ఇది వ్యక్తులు అభివృద్ధి చెందడానికి మరియు తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఉపయోగకరమని పరిశోధనలు బలంగా చూపిస్తున్నాయి.
  • థెరపీ ఆధారిత సహాయాల ద్వారా, వ్యక్తులు తమకు ముఖ్యమైన రోజువారీ పనుల్లో, స్వీయ సంరక్షణ, వినోదం లేదా ఉపాధి సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఓ.టి. సహాయపడుతుంది.
  • ఓ.టి. వలన వ్యక్తులు ఇంట్లో, పాఠశాలలో మరియు సమాజంలో తమ సామర్థ్యంతో మెరుగ్గా పనిచేయడానికి అవసరమైన సాధనాలను అందిస్తుంది.
  •  ఓ.టి. నిపుణులు వ్యక్తిని పూర్తిగా  అర్థం చేసుకుని, వారి ప్రత్యేకమైన సామర్థ్యాలు మరియు అవసరాలకు అనుగుణంగా పరిసరాలను, పనులను మార్చి సహాయం చేస్తారు.  

ఓ.టి. ద్వారా పిల్లల అభివృద్ధిలో సహాయపడే ముఖ్యమైన అంశాలు:

  •  రోజువారీ జీవన కార్యకలాపాలు 
  •  సామాజిక నైపుణ్యాలు 
  •  ఆట
  • మేధో నైపుణ్యాలు
  • పాఠశాల సిద్ధత 
  • మోటార్ నైపుణ్యాలు 
  • పర్యావరణం మరియు పరికరాల మార్పులు

ఓ.టి. దృష్టి సారించే ముఖ్యమైన అభివృద్ధి అంశాలు

పిల్లల అభివృద్ధిలో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆక్యుపేషనల్ థెరపిస్ట్ వివిధ ముఖ్యమైన అంశాలను గుర్తించి వాటిపై పని చేస్తారు.

  • ఇంద్రియ వ్యవస్థలు – వాసన గుర్తించడం, చూడడం, వినడం, రుచి గుర్తించడం, స్పర్శ, శరీర సమతుల్యతను నిలుపుకోవడం, మరియు శరీర భాగాల స్థితి గురించి అవగాహన కలిగి ఉండడం.
  • సెన్సరీ-మోటార్ నైపుణ్యాలు – కదలికలను సరిగా ప్రణాళిక చేయడం, శరీర అవగాహన, శరీర నియంత్రణ, సరైన భంగిమను స్థిరంగా ఉంచుకోవడం.
  • ఇంద్రియ గ్రహణం మరియు కదలికల అభివృద్ధి- వినికిడి మరియు భాషా నైపుణ్యాలు, వస్తువుల స్థానం మరియు దూరాన్ని గుర్తించడం,  శ్రద్ధ మరియు ఏకాగ్రత, శరీరం మరియు చేతులను సమన్వయంతో ఉపయోగించడం.  
  • మేధో నైపుణ్యాలు – రోజువారీ జీవన నైపుణ్యాలు (ఏ.డి.ఎల్ లు), ప్రవర్తన, విద్యా అభ్యాస నైపుణ్యాలు.

పిల్లల ఇంద్రియాలు, కదలికల  అభివృద్ధి నైపుణ్యాలపై సమగ్రంగా పని చేయడం ద్వారా, వారి రోజువారీ జీవితంలోని అనేక ముఖ్యమైన రంగాల్లో మంచి మార్పులను తీసుకురావచ్చు.

 మోటార్ నైపుణ్యాలు: వివిధ కార్యకలాపాల ద్వారా ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పిల్లలలో అనేక రకాల కదలిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతారు.

  1. సూక్ష్మ చలన (గ్రాస్ మోటార్) నైపుణ్యాలు – సమతుల్యత, పరుగెత్తడం, శరీర సమన్వయం, దూకడం.
  2. స్థూల చలన (ఫైన్ మోటార్) నైపుణ్యాలు – వస్తువులను పట్టుకోవడం, వేలి కొనలతో పట్టుకోవడం (పించ్ చేయడం), కత్తిరించడం.
  3. ఓరల్ మోటార్ నైపుణ్యాలు – నమలడం, ఊదడం, స్ట్రాతో తాగడం.
  4. విజువల్ మోటార్ నైపుణ్యాలు – చేతిరాత, ఆటల్లో పాల్గొనడం, కంటి-చేతి సమన్వయం.

రోజువారీ జీవన నైపుణ్యాలు – రోజువారీ పనులను స్వయంగా చేయగల సామర్ధ్యాలను మెరుగుపరచడంలో సహాయపడే అత్యంత ముఖ్యమైన నైపుణ్యాలలో ఓ.టి ఒకటి. ఉదాహరణకు స్నానం చేయడం, పళ్ళు తోముకోవడం, దుస్తులు ధరించడం మొదలైనవి. వీటిని ప్రధానంగా రెండు రకాలుగా చెప్పవచ్చు:

  1. ప్రాథమిక దైనందిన నైపుణ్యాలు (బి.ఏ.డి.ఎల్ లు) – ఇవి రోజువారీ జీవితంలో అవసరమైన ప్రాథమిక స్వీయ సంరక్షణ పనులు. ఉదాహరణకు పళ్ళు తోముకోవడం, దుస్తులు ధరించడం, స్నానం చేయడం.
  2. స్వతంత్ర జీవన నైపుణ్యాలు (ఇన్స్ట్రుమెంటల్ ఏ.డి.ఎల్ లు) – ఇవి ప్రాథమిక పనులకు మించి, కొంత క్లిష్టమైన పనులు. స్వతంత్రంగా జీవించడానికి ఇవి చాలా అవసరం. ఉదాహరణకు ఇంటి శుభ్రత, బట్టలు ఉతకడం, కొనుగోలు చేయడం.
  •  ఆట: పిల్లలు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, అలాగే వారి ఎదుగుదల మరియు అభివృద్ధికి సహాయపడేందుకు ఓ.టి. లో ఆటను ఒక ప్రభావవంతమైన పద్ధతిగా తరచుగా ఉపయోగిస్తారు. పిల్లలు వివిధ రకాల ఆటల ద్వారా నేర్చుకోవచ్చు. ఉదాహరణకు:
  1.  తమంతట తామే ఆడుకునే ఆట – ఇంట్లో పిల్లలకు అనుకూలమైన సాధారణ వస్తువులతో ఆడుకోవడం.
  2. ఒంటరిగా ఆడే ఆట – కార్డ్‌బోర్డ్ పెట్టెలు, ట్రైన్ సెట్లు, కిచెన్ ప్లే సెట్లు వంటి వాటితో ఒంటరిగా ఆడుకోవడం.
  3. సమాంతరంగా ఆడే ఆట – స్టిక్కర్ పుస్తకాలు, స్టాకింగ్ మరియు సార్టింగ్ ఆటలు వంటి వాటితో ఇతర పిల్లల పక్కన ఉండి ఆడుకోవడం.
  4.  కలిసి మెలిసి ఆడే ఆట – లెగోస్ వంటి వాటితో ఇతర పిల్లలతో కలసి పరస్పర చర్యలతో ఆడుకోవడం.
  5. జట్టుగా ఆడే ఆట – పప్పెట్ ఆటలు వంటి వాటిలో కలిసి పాత్రలు పంచుకుని ఆడుకోవడం.
  • పాఠశాల సిద్ధత 

పాఠశాలకు సిద్ధంగా ఉండటం అనేది పిల్లల అభివృద్ధిలో చాలా ముఖ్యమైన భాగం. ఓ.టి.  ఈ క్రింది ముఖ్యమైన నైపుణ్యాల అభివృద్ధికి సహాయపడుతుంది:

  1. ఫైన్ మోటార్ నైపుణ్యాలు – పెన్సిల్‌ను సరిగా పట్టుకోవడం, కత్తెర ఉపయోగించడం, కత్తిరించే నైపుణ్యాలు.
  2. రాయడానికి ముందస్తు నైపుణ్యాలు
  3. రాయడానికి కావలసిన నైపుణ్యాలు
  4. ఇతర ముఖ్యమైన నైపుణ్యాలు – సెన్సరీ సున్నితత్వాలను నిర్వహించడం, సామాజిక పరస్పర చర్యలు, సూచనలు పాటించడం.

ప్రతి పిల్లలకు వారి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పద్ధతుల ద్వారా, పిల్లలు స్వతంత్రంగా నేర్చుకోవడానికి, ఎదగడానికి మరియు పాఠశాలలో పురోగతి సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఓ.టి. సహాయపడుతుంది.

మరింత సమాచారం కోసం ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఏమిటి? అనే వీడియోను చూడవచ్చు.

అదనంగా, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలలో నెలసరి నిర్వహణకు సంబంధించిన ఆక్యుపేషనల్ థెరపీ సూచనలను గురించిన ప్రెజెంటేషన్‌ను కూడా చూడవచ్చు.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు

గమనిక: ఈ విషయ వివరణ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది. సురక్షితమైన నిర్వహణ కోసం అర్హత కలిగిన వైద్య నిపుణుడిని తప్పనిసరిగా సంప్రదించండి

ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी