Skip to main content
Install App
If you're using:

అభివృద్ధి సంబంధిత సవాళ్లున్న వ్యక్తుల్లో జీవన నైపుణ్యాల (లైఫ్ స్కిల్స్)ప్రాముఖ్యత

Default Avatar

Nayi Disha Team

इस भाषा में उपलब्ध है हिंदी English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

 1. పిల్లల అభివృద్ధి అవసరాలు ఈ ఏడు ముఖ్యమైన నేర్చుకునే రంగాలను కలిగి ఉంటాయి:

o   ఆరోగ్యం 

o   విద్య 

o   భావోద్వేగ అభివృద్ధి

o   వ్యక్తిత్వ గుర్తింపు 

o   కుటుంబం మరియు సంబంధాలు

o   సామాజిక ప్రవర్తన

o   స్వీయ సంరక్షణ నైపుణ్యాలు

2. జీవన నైపుణ్యాలు ముఖ్యంగా ఈ అంశాలపై దృష్టి పెడతాయి:

o   భద్రత 

o   సామాజిక పరస్పర చర్యలు 

o   స్వతంత్రత 

3. జీవన నైపుణ్యాలను సృజనాత్మకంగా మరియు ఆసక్తికరంగా నేర్పినప్పుడు పిల్లలు వాటిని మరింత సులభంగా నేర్చుకుంటారు.

4. ఇంట్లో చేసే చిన్న చిన్న పనులు పిల్లల్లో స్వతంత్రతను పెంపొందించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు:

o   తోటపని చేయడం 

o   బట్టలు ఉతకడం 

o   పత్రాలను (ఫైళ్లు) క్రమబద్ధంగా ఉంచడం

o   భోజనానికి టేబుల్ సిద్ధం చేయడం

o   ఆహారం తయారీ మరియు వంట పనులు

Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [0.99 MB]

జీవన నైపుణ్యాలు ఎందుకు ముఖ్యమైనవి

పిల్లలు యుక్తవయసులోకి అడుగుపెట్టి, పెద్దవారిగా మారుతున్న సమయంలో జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఎంతో ముఖ్యం. పాఠశాల విద్య, విద్యా విషయాలు మరియు అక్షరాస్యతపై ఎక్కువగా దృష్టి పెట్టినప్పటికీ, పిల్లలు స్వీయ సంరక్షణ, సురక్షితమైన నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబం మరియు సమాజంలో చురుకుగా పాల్గొనడం కోసం అవసరమైన ప్రాయోగిక నైపుణ్యాలు కూడా నేర్చుకోవాలి.

ప్రత్యేక అవసరాలున్న పిల్లలలో ఆత్మవిశ్వాసం, స్వతంత్రత మరియు తమ అవసరాలను వ్యక్తపరచుకునే సామర్థ్యానికి జీవన నైపుణ్యాలు బలమైన పునాది వంటివి. ఈ నైపుణ్యాలను ప్రోత్సహించడం ద్వారా రోజువారీ జీవన నైపుణ్యాలు మెరుగుపడటమే కాకుండా, పిల్లలు అర్థవంతమైన సంబంధాలను మరియు తమ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడంలో కూడా సహాయపడుతుంది.

అభివృద్ధికి తోడ్పడే ముఖ్యమైన రంగాలు

పైన పేర్కొన్న ప్రదర్శనలో పిల్లల సమగ్ర అభివృద్ధికి సహాయపడే ఏడు ముఖ్యమైన నేర్చుకునే రంగాలను వివరించారు:

  1. ఆరోగ్యం: పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత మరియు శారీరక వ్యాయామానికి సంబంధించిన అలవాట్లను అభివృద్ధి చేయడం.
  2. విద్య: విద్యా విషయాల అభ్యాసంతో పాటు ప్రాయోగిక నైపుణ్యాలను కూడా ప్రోత్సహించడం.
  3. భావోద్వేగ అభివృద్ధి: పిల్లలు తమ భావాలను అర్థం చేసుకోవడం మరియు వాటిని సరైన విధంగా వ్యక్తపరచడం నేర్చుకోవడంలో సహాయపడడం.
  4. వ్యక్తిత్వ వికాసం: ఆత్మవిశ్వాసం మరియు స్వీయ అవగాహనను పెంపొందించడం.
  5. కుటుంబం మరియు సంబంధాలు: కుటుంబ సభ్యులు మరియు సమాజంతో సాన్నిహిత్యాన్ని, అనుబంధాలను పెంపొందించడం.
  6. సామాజిక ప్రవర్తన: వివిధ పరిస్థితుల్లో ఇతరులతో ఎలా మెలగాలి మరియు సంభాషించాలి అనే నైపుణ్యాలను నేర్చుకోవడం.
  7. స్వీయ సంరక్షణ నైపుణ్యాలు: దుస్తులు ధరించడం, స్నానం చేయడం, స్వయంగా భోజనం చేయడం వంటి రోజువారీ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.

ప్రాధాన్యత ఇవ్వాల్సిన జీవన నైపుణ్యాలు

పిల్లలు ఎదుగుతున్న కొద్దీ కొన్ని జీవన నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా ముఖ్యం:

  1. భద్రత: సురక్షితమైన మరియు అసురక్షితమైన పరిస్థితులను గుర్తించడం, అవసరమైనప్పుడు ఎవరిని సహాయం కోసం సంప్రదించాలో తెలుసుకోవడం, అలాగే రహదారి మరియు ఇంటి భద్రతా అలవాట్లను నేర్చుకోవడం.
  2. సామాజిక పరస్పర చర్యలు: సంభాషణ నైపుణ్యాలు, పంచుకోవడం, తమ వంతు కోసం ఎదురుచూడడం మరియు వ్యక్తిగత హద్దులను అర్థం చేసుకోవడం వంటి సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.
  3. స్వతంత్రత: చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం, రోజువారీ పనులను పూర్తి చేయడం మరియు తమ సాధనలపై గర్వపడడం నేర్చుకోవడం.
  4. రోజువారీ జీవన నైపుణ్యాలు: స్వతంత్ర జీవనానికి అవసరమైన రోజువారీ స్వీయ సంరక్షణ పనులు. ఉదాహరణకు స్నానం చేయడం, దుస్తులు ధరించడం, భోజనం చేయడం, టాయిలెట్ ఉపయోగించడం మరియు ఒకచోటు నుండి మరొక చోటుకి స్వతంత్రంగా వెళ్లడం వంటి నైపుణ్యాలు.

సృజనాత్మక పద్ధతుల్లో బోధించడం

జీవన నైపుణ్యాలను సరదాగా మరియు ఆసక్తికరమైన కార్యకలాపాల ద్వారా నేర్పినప్పుడు పిల్లలు మరింత సులభంగా నేర్చుకుంటారు. రోజువారీ పనులు లేదా ఆటలలో భాగంగా నేర్పినప్పుడు పిల్లలు వాటికి త్వరగా అలవాటు పడతారు. ఉదాహరణకు:

  1. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలి అనే విషయాలను నేర్పడానికి పాత్రధారణ (రోల్ ప్లే) వంటివి ఉపయోగపడతాయి.
  2. పాటలు, చిత్రాలు లేదా ఆటల సహాయంతో రోజువారీ పనుల దశలను గుర్తుంచుకునేలా చేయడం — ఇది పిల్లలకు పనులను సులభంగా గుర్తుంచుకోవడంలో సహాయపడుతుంది.
  3. చిన్న చిన్న విజయాలను కూడా ప్రశంసించడం మరియు సంబరంగా జరుపుకోవడం — ఇది పిల్లల్లో ఉత్సాహాన్ని మరియు నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది.

స్వతంత్రతను పెంపొందించే ఇంటి పనులు

రోజువారీ ఇంటి పనులు పిల్లలు జీవన నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు అభ్యాసం చేయడానికి మంచి అవకాశాలను అందిస్తాయి. ఉదాహరణకు:

  1. తోటపని చేయడం: బాధ్యత, సహనం మరియు ప్రకృతిపట్ల శ్రద్ధను పెంపొందిస్తుంది.
  2. బట్టలు ఉతకడం: పనులను క్రమపద్ధతిలో చేయడం మరియు స్వతంత్రతను ప్రోత్సహిస్తుంది.
  3. పత్రాలను క్రమబద్ధంగా ఉంచడం: వర్గీకరణ, క్రమబద్ధీకరణ మరియు సూక్ష్మ కదలికల(మోటార్) నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది.
  4. భోజనానికి టేబుల్ సిద్ధం చేయడం: క్రమశిక్షణ, బాధ్యత మరియు రోజువారీ అలవాట్లను పెంపొందిస్తుంది.
  5. ఆహారం తయారీ మరియు వంట పనులు: భద్రత, పోషకాహార అవగాహన మరియు దశలవారీగా పనులు చేయడం వంటి నైపుణ్యాలను నేర్పిస్తుంది.

ఈ పనులన్నింటినీ చిన్న చిన్న దశలుగా విభజించి నేర్పవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు తమకు అనుకూలమైన వేగంలో నేర్చుకునే అవకాశం పొందుతారు.

కుటుంబాలకు మద్దతు

మీకు సహాయపడే విధంగా, అభివృద్ధి లోపాలు ఉన్న పిల్లలలో సామాజిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి సూచనలు చదవండి. అదనంగా, ఆక్యుపేషనల్ థెరపీ వీడియోను చూడండి.  ఇది మరిన్ని సూచనలను అందిస్తుంది.

కృతజ్ఞతలు: ఈ సమాచారాన్ని రూపొందించడంలో సహకరించిన రితికా వత్సా మరియు ఆటిజం నిచ్ వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

कोई संबंधित संसाधन नहीं मिले।

No Related Services Found.
हिन्दी