Skip to main content
Install App
If you're using:

మాట్లాడుకుందాం: మీపిల్లలలోభాషాఅభివృద్ధికికమ్యూనికేషన్మరియుఅభ్యాసనైపుణ్యాలుఏవిధంగాప్రభావితంచేస్తాయి.

Default Avatar
Nayi Disha Editor
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

“మనం మాట్లాడుకుందాం ” అనేది మీ బిడ్డలో భాషా అభివృద్ధి, కమ్యూనికేషన్ మరియు అభ్యాస నైపుణ్యాలను పెంపొందించడంలో పాత్రను వివరించే ఒక బుక్ లెట్.

సంభాషణ అనేది బాహ్య ప్రపంచంతో అనుసంధానం కలిగించే ముఖ్యమైన మార్గాలలో ఒకటి.  తమ చుట్టూ ఉన్నవారితో నిరంతర సంబంధాలు కొనసాగించే సామర్థ్యం పిల్లల ప్రారంభ దశలో మొదలౌతుంది. ఇది వారి అభివృద్ధిలో ఒక కీలకమైన మైలు రాయి.   

పిల్లల్లో మాటలు నేర్చుకునే ప్రయాణం ఇలా మొదలవుతుంది:

  • శబ్దాలను సరిగ్గా పలకగల నైపుణ్యం
  • పదాలను నేర్చుకునే సామర్ధ్యం పొందడం
  • పదాలను కలిపి పూర్తి వాక్యాలుగా నిర్మించడం
  • చివరకు ఒక భాషను మాట్లాడగలగడం

మనం మాట్లాడుకుందాం” అనే బుక్ లెట్ ను ఇక్కడ మేము అందుబాటులో ఉంచాము. తల్లిదండ్రులు/సంరక్షకులు తమ బిడ్డతో సులభంగా సంభాషణ కొనసాగించి వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుంది. మాట అనేది కేవలం పిల్లలు తమ భావాలను వ్యక్తపరచుకునేందుకు మాత్రమే కాదు వారి ఉన్నత అభ్యాసాల సామర్ధ్యానికి కూడా పునాది అవుతుంది. “భాషా అభివృద్ధి పాత్రను తెలుసుకోవడానికి మరియు ఇంట్లో జరిగే సాధారణ దైనందిన సంఘటనలు మీ బిడ్డ మాటల అభ్యాసానికి ఉపయోగకరమైన మార్గదర్శకాలు ఎలా అవుతాయో తెలుసుకోవడానికి “మనం మాట్లాడుకుందాం” పుస్తకాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోండి.” పసితనం నుండి  నాలుగు సంవత్సరాల వయసు దాటే వరకు, మీ బిడ్డతో సంభాషణ సాగించేందుకు బొమ్మలు మరియు పుస్తకాలను ఆటవస్తువుల్లా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి కూడా ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది.

త్వరిత సూచన కోసం మీరు భాషా అభివృద్ధి ఇన్ఫోగ్రాఫిక్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదనంగా, మీరు సంభాషణా, భాష మరియు కమ్యూనికేషన్‌లపై కూడా వీడియోలను చూడవచ్చు.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ. డి హెచ్.డి. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

సూచన: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

टैग्स :
ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

कोई संबंधित संसाधन नहीं मिले।

No Related Services Found.
हिन्दी