Skip to main content
Install App
If you're using:

ఇకోలేలియా అంటే ఏమిటి?

Default Avatar
Nayi Disha Team
इस भाषा में उपलब्ध है हिंदी English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

1.ఇకోలేలియా అంటే ఏమిటి

2. ఇకోలేలియాకు కారణమయ్యే పరిస్థుతులు

  • బాషా ప్రక్రియ 
  • మేథో ప్రక్రియ 
  • స్వీయ ఓదార్పు మరియు నియంత్రణ 
  • సామజిక సంబాషణ
  • నాడీసంభందిత వ్యత్యాసాలు

3. ఇకోలేలియా సంకేతాలు

  • పదాలను పునరావృతం చేయడం 
  • జవాబుకు బదులు ప్రశ్ననే తిరిగి చెప్పడం 
  • మాధ్యమాల ద్వారా లేదా గతంలో జరిగిన సంభాషణల నుండి తెలుసుకున్న పదబంధాలు ఉపయోగించడం    
  • సమాచార ప్రక్రియకు ఇకోలేలియా ఉపయోగించడం 
  • ముఖ్యంగా ఇతరులతో సంభాషించడానికి ఇకోలేలియాను ఉపయోగించడం

4. ఇకోలేలియాలో ఉన్న రకాలు 

  • ఇంటరాక్టివ్ 
  • నాన్ ఇంటరాక్టివ్ 
  • తక్షణ 
  • ఆలస్యమైన

5. పిల్లల్లో ఇకోలేలియా పాత్ర నిర్ధారణ మరియు అవగాహన

6. ఇకోలేలియాకు సమర్ధవంతమైన మద్దతు

  • స్పీచ్ థెరపీ 
  • ఆక్యుపేషనల్ థెరపీ 
  • బిహేవియర్ థెరపీ

7. కమ్యూనికేషన్ ను పెంపొందించడానికి చిట్కాలు 

  • పరిమిత పదజాలాన్ని ఉపయోగించడం 
  • ఎందుకు, ఏమిటి (“wh”) అనే ప్రశ్నలకు పరిమితం చేయడం
  • దృశ్య సంకేతాలు మరియు సంభాషణ యొక్క అధికారిక నమూనాలు

 

ఇకోలేలియా అంటే ఏమిటి?

ఇకోలేలియా అంటే ఇతరులు చెప్పిన పదాలు లేదా పదబంధాలు తిరిగి పునరావృతం చేయడం. పిల్లలు తాము విన్న పదాలు లేదా పదబంధాలు తిరిగి అదేవిధంగా అనుకరించడాన్ని ఇకోలేలియాగా చెప్పవచ్చు. పిల్లలకు మూడు సంవత్సరాల వయసు వచ్చేవరకు ఈ అనుకరణ ప్రక్రియ సాధారణంగా ఉంటుంది. 3 సంవత్సరాల వయసు దాటినప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగితే అది అభివృద్ధి లో ఆలస్యం, భాష నేర్చుకోవడంలో ఆలస్యం, ఆటిజం, ట్యూరెట్ సిండ్రోమ్, లేదా మేథో వైకల్యం వంటివి సంకేతం కావచ్చు.

ఆటిజం పిల్లల్లో ఇకోలేలియా సాధారణంగా కనిపిస్తుంది. ఇది పలు రకాల విధులను నిర్వహిస్తుంది . అంటే భాషాభివృద్ధికి గాని, భావోద్వేగ నియంత్రణకు కానీ, తమను తాము శాంతపరచుకునేందుకు గాని, తమని ఆనందపరుకునే విధంగా కానీ ఉంటుంది.

ఇకోలేలియాకు కారణమయ్యే పరిస్థుతులు

ఇకోలేలియా యాదృచ్ఛిక పునరావృతం కాదు. కొందరు వ్యక్తులకు భాషను అభివృద్ధి చేసుకునే ప్రక్రియలో కానీ, భావోద్వేగాల నియంత్రణకు కానీ, తమ అవసరాలను తెలియజేసేందుకు కానీ ఇది ఒక అర్ధవంతమైన మార్గం.  

  • భాష నేర్చుకునే ప్రక్రియ మరియు అభ్యాసం: ఇది మాటలు నేర్చుకోవడానికి, అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. చాలా మంది పిల్లలు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి ఇకోలేలియాను ఒక సాధనంగా ఉపయోగిస్తారు.
  • మేథో ప్రక్రియ: కొందరు వ్యక్తులు సమాచార ప్రక్రియకు, విషయాలను గుర్తు పెట్టుకునేందుకు పదాలు లేదా పదబంధాలను పునరావృతం చేస్తారు.  
  • స్వీయ నియంత్రణ మరియు స్వాంతన:  ఒక మంచి పాట పాడటం వలన సానుకూలతనిచ్చి ప్రశాంతమైన అనుభూతి లభించినట్లు సుపరిచితమైన పదాలు లేదా పదబంధాలను పునరావృతం చేయడం వలన కొందరికి ఓదార్పు లభిస్తుంది.
  • సామజిక కమ్యూనికేషన్ మరియు సాన్నిహిత్యం: పరిస్థితులకు తగిన విధంగా పదాల వినియోగం లేకపోయినప్పటికీ కొన్నిసార్లు సంభాషణలలో పాల్గొనడానికి ఇకోలేలియా ఒక మార్గంగా ఉంటుంది. 
  • నాడీ సంబంధిత వ్యత్యాసాలు: మెదడులో ప్రసంగాలను ప్రాసెస్ చేసి దానిని ఉత్పత్తి చేసే విధానంలో ఉన్న వ్యత్యాసాలకు ఇకోలేలియా ముడిపడి ఉంటుంది. దీనిని తప్పుగా కానీ చెడుగా కానీ పరిగణించకూడదు. ఇది భాషతో ముడిపడిన ఒక భిన్నమైన మార్గం.    

ఇకోలేలియా సంకేతాలు

  • పదాలు లేదా పదబంధాల అర్ధం పూర్తిగా తెలియకపోయినప్పటికీ తరచుగా వాటిని పునరావృతం చేయడం. 
  • ప్రశ్నకు జవాబు చెప్పడానికి బదులుగా తిరిగి ప్రశ్ననే చెప్పడం 

ఉదా: “నీకు దాహంగా ఉందా?” 

ఈ ప్రశ్నకు అవును లేదా కాదు అని జవాబివ్వకుండా తిరిగి “నీకు దాహంగా ఉందా?”  అని అనడం.

  • టీ వి కార్యక్రమాలు, సినిమాలు, పుస్తకాల వంటి మాధ్యమాల ద్వారా తెలుసుకున్న లేదా గతంలో విన్న సంభాషణలు పదాలను భిన్న సందర్భాలలో వాడటం.
  • తాము విన్న అసలు స్వరాన్ని అనుకరించే ప్రక్రియలో పదజాల పునరావృతం ఉంటుంది.
  • అసలు వాక్యాలను రూపొందించడంలో ఇబ్బంది వలన భాషను పునరావృతం చేయడంపై ఆధారపడతారు.
  • ప్రతిస్పందించే ముందు సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి ఇకోలేలియా   ఉపయోగించబడుతుంది.
  • స్వీయ నియంత్రణకు, ముఖ్యంగా ఒత్తిడితో కూడిన లేదా అతిగా ప్రేరేపించే పరిస్థితులలో పదాల పునరావృతం ఓదార్పు మరియు నియంత్రను అందిస్తుంది.
  • తమ సంభాషణను ప్రారంభించడానికి కానీ, కొనసాగించడానికి కానీ పునరావృత ప్రక్రియను ఎంచుకుంటారు. (ఉదా: ఆకలి వేసినప్పుడు “భోజనానికి సమయమైంది” అని చెప్పడం).

ఇకోలేలియా లో ఉన్న రకాలు: 

ఇకోలేలియా ను ఇంటరాక్టివ్, నాన్ ఇంటరాక్టివ్ అని రెండు విధాలుగా చూడవచ్చు.

ఇంటరాక్టివ్ ఇకోలేలియా:

 ఈ రకమైన ఇకోలేలియాలో వ్యక్తి ఇతరులతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్న సామాజిక పరిస్థితులలో సంభవిస్తుంది. వ్యక్తి తమ కోరికలను తెలియజెప్పేందుకు, ప్రశ్నలు అడిగేందుకు, తమ సంభాషణను కొనసాగించేందుకు పదజాలాన్ని పునరావృతం చేయవచ్చు.

ఉదాహరణలు:

  • టర్న్-టేకింగ్:
  • ప్రశ్న: “నీకు ఆకలిగా ఉందా?” 
  • బిడ్డ: “నీకు ఆకలిగా ఉందా?”  (అవును ఆకలిగా ఉంది అని అర్ధం) 
  • అభ్యర్ధన: 
  • పిల్లవాడు తలుపు తెరవమని కోరే క్రమంలో తనకు నచ్చిన షో నుండి సమాన అర్ధం వచ్చే ఒక పంక్తిని పునరావృతం చేయవచ్చు. 
  • ఒప్పందం లేదా ధ్రువీకరణ: 
  • పిల్లవాడికి బయట ఆడుకోవాలి అని కోరుకున్నప్పుడు “బయట ఆడుకుంటావా?” అని చెప్పవచ్చు.

ఇలా జరగడానికి గల కారణాలు

  • పిల్లలు తమ సంభాషణను కొనసాగించుకునే ప్రయత్నంలో కొత్తగా వాక్యాలను రూపొందిచకుండా సుపరిచితమైన పదజాలాన్ని పునరావృతం చేయడం సులభ మార్గంగా ఎంచుకుంటారు.
  • ఇది భాషను సాధన చేయడానికి మరియు సామాజిక సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునేందుకు ఒక మార్గంగా ఉండవచ్చు.
  • కొందరు వారు అర్ధం చేసుకున్న విషయాలను నిర్ధారించుకునేందుకు లేదా తమ స్వతంత్ర ప్రసంగాన్ని రూపొందించేందుకు దీనిని ఒక మార్గంగా ఉపయోగించవచ్చు.

నాన్ఇంటరాక్టివ్ ఇకోలేలియా:

ఈ విధానం ఇతరులతో సన్నిహితంగా ఉండటానికి ఉపయోగించబడదు కానీ స్వీయ నియంత్రణ, ప్రశాంతత లేదా సమాచార ప్రక్రియ వంటి వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది.

ఉదాహరణలు:

  • స్వీయ ఓదార్పు:
  • ఒక పిల్లవాడు అధికంగా ఆందోళన చెందుతున్నప్పుడు టీవీ షో లేదా గత సంభాషణల నుండి విన్న పదజాలాన్ని పునరావృతం చేస్తాడు.
  • బాషా సాధన: 
  • ప్రసంగ సరళిని సాధన చేయడానికి వారు పదాలు లేదా వాక్యాలను తమకు తాముగా పునరావృతం చేసుకుంటారు.
  • గత సంఘటనలను ప్రాసెస్ చేసుకోవడం:
  • సంభాషణ జరిగిన కొన్ని గంటల తర్వాత దానిని అర్థం చేసుకోవడానికి వారు తమలో తాము ఆ సంభాషణను పునరావృతం చేసుకుంటారు.
  • ఆనందం పొందడం: 
  • కొన్ని పదజాలాల ఉచ్చారణ లేదా అవి వినడం ద్వారా వచ్చే అనుభూతి నచ్చడం వలన వాటిని పునరావృతం చేస్తుంటారు.

ఇలా జరగడానికి గల కారణాలు

  • ఇంద్రియ సమాచార ప్రక్రియలో బాగా ఒత్తిడిగా అనిపించినప్పుడు ఇది వారి స్వీయ ఓదార్పుకు సహాయపడుతుంది.
  • కొంతమంది వ్యక్తులు సుపరిచితమైన పదాలు లేదా శబ్దాలను పునరావృతం చేయడంలో ఓదార్పు పొందుతారు.

ఇకోలేలియా అనేది వెంటనే లేదా ఆలస్యంగా సంభవించవచ్చు:

వెంటనే జరిగే ఇకోలేలియా 

కొందరు పదాలను లేదా పదజాలాన్ని విన్న వెంటనే పునరావృతం చేస్తారు. 

ఉదాహరణకు 

  • ప్రశ్న: “నీకు దాహంగా ఉందా?” 
  • బిడ్డ: “నీకు దాహంగా ఉందా?”  (అవును ఆకలిగా ఉంది అని అర్ధం) 

ఇలా జరగడానికి గల కారణాలు:

  • ప్రతిస్పందించే ముందు భాషను ప్రాసెస్ చేయడానికి ఇది ఒక మార్గం కావచ్చు.
  • ఇది భావోద్వేగాల నియంత్రణకు, స్వీయఉపశమనం పొందడానికి ఒక మార్గంగా ఉపయోగపడవచ్చు.
  • అసలు ప్రసంగంలో పాల్గొనకపోయినా కానీ తమ సందేశంతెలియజేసే ప్రయత్నం కావచ్చు.

ఆలస్యంగా జరిగే ఇకోలేలియా:

ఒక వ్యక్తి తాను విన్న పదాలు, పదజాలాలు లేదా మొత్తం కథారూపాన్ని కొన్ని గంటలు, రోజులు లేదా వారాల తరువాత కూడా పునరావృతం చేస్తాడు.

ఉదాహరణకు

  • ఒక పిల్లవాడు ఇంటినుండి బయటకు వస్తూ, తాను చూసిన కార్టూన్ షో లో “మనం బయటకు వెళ్దామా” అని ఒక పాత్ర చెప్పిన పంక్తిని రోజుల తరువాత గుర్తు చేసుకుంటూ తాను పలకడం.

ఇలా జరగడానికి గల కారణాలు:

  • సందర్భానికి తగిన విధంగా లేకపోయినప్పటికి తమ వ్యక్తిగత అవసరాలు, భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఇది ఒక మార్గం కావచ్చు.
  • ముఖ్యంగా తమకు నచ్చిన షో నుండి లేదా గత సంభాషణల నుండి విన్న 

పదాలు లేదా పదజాలాన్ని పునరావృతం చేయడం వలన వారికి స్వాంతన లభిస్తుంది.

  • ఇది భాష నేర్చుకునేందుకు మరియు సామాజిక సాన్నిహిత్యం కోసం ఉపయోగపడుతుంది.

పిల్లల్లో ఇకోలేలియా పాత్ర అవగహన & నిర్ధారణ

ఇకోలేలియాను సాధారణంగా స్పీచ్ లాంగ్వేజ్ థెరపిస్టులు, మనస్తత్వవేత్తలు లేదా అభివృద్ధి నిపుణులు గుర్తిస్తారు. అయితే నిపుణులు దీనిని ఒక సవాలుగా పరిగణించడానికి బదులు కమ్యూనికేషన్ మరియు భాష అభివృద్ధిలోని పనితీరును అర్థం చేసుకోవడంపై దృష్టి పెడతారు.

నిపుణుల అంచనాలో ఉండే అంశాలు:

  • ఇకోలేలియా ఎప్పుడు, ఎలా ఉపయోగించబడుతుందో గమనించడం.
  • ఇది సంభాషణాత్మక, ఇంద్రియ, స్వీయ నియంత్రణల వంటి ఏ ప్రయోజనాలను వినియోగిస్తుందో గుర్తించడం.
  • దీనిని బలవంతంగా అణచివేయకుండా భాషా వినియోగాన్ని విస్తరిం

ఇకోలేలియా కు సమర్ధవంతమైన మద్దతు

పిల్లలకు అర్ధవంతమైన సంభాషణా నిర్మాణానికి స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ మరియు బిహేవియర్ థెరపీ ల సహాయంతో ఇకోలేలియా ను ఉపయాగించుకోవచ్చు.

సంభాషణను మెరుగుపరచే కొన్ని చిట్కాలు:

ఆటిజం పిల్లలలో ఇకోలేలీయాను అణచివేయకూడదు ఎందుకంటే చాలామంది ఆటిజం పిల్లల్లో సమాచార మార్పిడికి ఉన్న ప్రాథమిక సాధనం ఇది మరియు దీనిని మరింత అధునాతన సంభాషణా నైపుణ్యాలను నేర్పడానికి ఉపయోగించవచ్చు.

ఇకోలేలీయా ఉన్న పిల్లలకు దృశ్య సమాహారాలు లేదా నమూనాలు వారి భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. ఇంకా “ఎందుకు”,”ఏమిటి” వంటి ప్రశ్నలకు పరిమితం చేయడం, దృశ్య సంకేతాలు, మోడలింగ్ విధానాల ద్వారా సంభాషణను మెరుగుచేయవచ్చు.  

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర మేధో వైకల్యాల గురించి ప్రశ్నలు ఉంటే, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి ఆందోళనలు ఉంటే, నయీ దిశ బృందం మీకు సహాయం చేయడానికి ఇక్కడ ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్‌ను 844-844-8996లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు.

హెచ్చరిక: ఈ అంశం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని మరియు ఏ విధంగానూ వైద్య సలహాగా పరిగణించరాదని దయచేసి గమనించండి.

टैग्स :
ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

कोई संबंधित संसाधन नहीं मिले।

No Related Services Found.
हिन्दी