Skip to main content

డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తుల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని నిర్ధారిస్తుంది

डीएसएफआई

इस भाषा में उपलब्ध है हिंदी తెలుగు English
0पसंद किया गया
0 डाउनलोड्स

महत्वपूर्ण जानकारी

మేము ఈ వ్యాసంలోని ప్రధాన అంశాలను సిద్ధం చేస్తున్నాము. అవి త్వరలో అందుబాటులో ఉంటాయి.

డౌన్ సిండ్రోమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DSFI) భారతదేశం అంతటా డౌన్స్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులకు మరియు వారి కుటుంబాలకు మద్దతును అందిస్తుంది.

డౌన్ సిండ్రోమ్ (DS) ఉన్న పిల్లలలో  కొన్ని సాధారణ ఆరోగ్య సవాళ్లు గుర్తించబడ్డాయి మరియు నివేదించబడ్డాయి. ఈ సాధారణ ఆరోగ్య సమస్యల గురించిన అవగాహన మీ పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కొన్ని  సాధారణ సవాళ్లు:

> పునరావృత అంటువ్యాధులు (చర్మం, మూత్రాశయం మరియు శ్వాసకోశ)

> శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి

> పుట్టుకతోనే గుండె లోపాలు

>వినికిడి ఇబ్బందులు

>దృష్టి లోపాలు

>ఓరో-మోటార్ సమస్యలు (నోటి యొక్క కదలికలో సమస్యలు  )

>కండరాల టోన్ తక్కువగా ఉండుట

>నిద్రలేమి లేదా నిద్ర ఆటంక సమస్యలు

>జీర్ణవ్యవస్థతో సమస్యలు

> పాదం యొక్క ఆర్చ్ లో సమస్యలు

డౌన్స్ సిండ్రోమ్ ను నయం చేయలేము , కానీ, ఆరోగ్య సవాళ్లను జాగ్రత్తగా పరిష్కరించుకోవడం ద్వారా మీ పిల్లల జీవన నాణ్యత ఎంతో మెరుగుపడుతుంది.

డౌన్స్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆరోగ్య సమస్యల యొక్క శీఘ్ర అవలోకనం కోసం మీరు పైన ఉన్న ఇన్ఫోగ్రాఫిక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదనంగా, మీరు ఈ సాధారణ వైద్య సవాళ్లలో ప్రతి ఒక్కదాని వివరాలను లోతుగా పరిశోధించే ప్రెసెంటేషన్  కూడా యాక్సెస్ చేయవచ్చు. మీరు దీన్ని ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నిరాకరణ : ఇన్ఫోగ్రాఫిక్లోని కంటెంట్ ఏదీ వైద్య సలహాగా పరిగణించబడదని మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే పరిగణించబడుతుందని గమనించండి.

కృతజ్ఞతలు:

ఈ సమాచారాన్ని ఏకీకృతం చేయడంలో నిపుణుల సలహా మరియు మార్గదర్శకత్వాన్ని అందించినందుకు కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, డా.నీనా పీయూష్ వైద్య (M.B D.Ped, PGDGC) గారికి  ప్రత్యేక ధన్యవాదాలు.

ఈ ఇన్ఫోగ్రాఫిక్‌ని ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించడానికి తీసుకున్న సమయం మరియు కృషికి మా వాలంటీర్ శ్రీమతి రాధిక గుడుగుంట్ల గారికి  ధన్యవాదాలు.

 

टैग्स :
ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी