Skip to main content

5 మరియు 11 సంవత్సరాల మధ్య పిల్లలలో ఆటిజం యొక్క తోలి సంకేతాలు (ఆంగ్లం /హిందీ/ తెలుగు)

Default Avatar

डॉ अजय शर्मा

इस भाषा में उपलब्ध है हिंदी English
Like Icon 0पसंद किया गया
Download Icon 0 डाउनलोड्स

महत्वपूर्ण जानकारी

మేము ఈ వ్యాసంలోని ప్రధాన అంశాలను సిద్ధం చేస్తున్నాము. అవి త్వరలో అందుబాటులో ఉంటాయి.

Infographic Image

ప్రతి పిల్లవాడి అభివృద్ధి ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉంటుంది. ఐతే, కొంత మంది పిల్లల అభివృద్ధి లో వివిధ రకాల డెవెలప్మెంటల్ డిసబిలిటీస్ ని సూచించే రెడ్ ఫ్లాగ్స్ అనగా ప్రమాద సంకేతాలు కనబడతాయి. చాల సందర్భాలలో, ఈ రెడ్ ఫ్లాగ్స్ ని తొందరగా గుర్తించడం వల్ల వీలైనంత త్వరగా వారికి సహాయం అందించగలము. చిన్న వయసులోనే వైజ్ఞానిక పద్దతుల ప్రమేయం తో ఆ పిల్ల/పిల్లవాడికి సహాయపడటం ద్వారా వారు కొత్త విషయాలను నేర్చుకునే సామర్త్యాన్ని మరియు వారి ప్రవర్తనను పెంపొందించవచ్చు. ఇది చిన్నతనం లోనే ప్రారంభించడం పిల్లల భవిష్యత్తుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఆటిజం యొక్క తోలి సంకేతాలను గుర్తించడం లో తల్లిదండ్రులకు సహాయపడుతుంది. తద్వారా, 5 నుండి 11 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లల్లో ఆటిజం ఉండటానికి అత్యంత ప్రమాదం ఉన్న పిల్లలు గుర్తింపబడి, సాధ్యమైనంత తొందరగా సహాయం అందుకోగలరు.
హెచ్చరిక: ఈ గైడ్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని దయచేసి గమనించండి. సురక్షితమైన నిర్వహణ కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించగలరు.

ఒకవేళ మీరు ఆటిజం యొక్క తోలి సంకేతాలను గమనించినట్లయితే, మీరు కొన్ని ఆన్ లైన్ టెస్టులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఐతే, ఎప్పుడూ ఆటిజం ఉందని మీరే స్వయంగా నిర్ధారించుకోకండి. వెంటనే మీ పరిశీలనలు మీ వైద్యుడితో చర్చించండి. అలాగే ఆటిజం గురించి మరింత తెలుసుకోవడానికి లేదా ఆటిజం థెరపీల గురించి సమాచారం కోసం మా ఆటిజం ఫాక్ట్ షీట్ ని చూడగలరు.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర మేధో వైకల్యాల గురించి ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి ఆందోళనలు ఉంటే, సహాయం చేయడానికి नई दिशा బృందం ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996లో సంప్రదించండి. మీరు మాకు కాల్ చేయవచ్చు లేదా whatsappలో సందేశం పంపవచ్చు. మా కౌన్సెలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీతో సహా వివిధ భాషలను మాట్లాడతారు.

ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी